
కేంద్ర మంత్రిపై నోరు జారడం తగదు
రాయచూరు రూరల్: ఎయిమ్స్ మంజూరు విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి నేతలు అసభ్య పదజాలాన్ని వాడి నోరుజారడం తగదని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్, జమ్ము విజయ నగర్‌లో ఎయిమ్ష్, కశ్మీర్‌లోని అవంతికల్లో పోరోనిక్స్ విశ్వవిద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలన చేశాయా? అని ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో కమిటీలు రూపొందిస్తాయనడం అపహాస్యంగా ఉందన్నారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఈ విషయంలో మౌనం వహించాడని చెప్పడం అవివేకమన్నారు. మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ, శంకరప్ప, పాపారెడ్డి, రవీంద్ర, యల్లప్ప, శంశాలం, శ్రీనివాసరెడ్డిలున్నారు.