
భారీగా బంగారు నగలు సీజ్
యశవంతపుర: తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు ఆర్‌ఆర్ నగర పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.58.60 లక్షలు విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు విల్లుపురానికి చెంది, ఆర్‌ఆర్ నగరలో నివాసం ఉంటున్న నాగమణి (47), రవికుమార్ (45) ఇటీవల ఓ ఫ్లాటు కిటికీలను బద్ధలు కొట్టి 55 గ్రాముల బంగారం, 3 కేజీల వెండిని దోచుకెళ్లారు. పోలీసులు గాలించిన అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి 537 గ్రాముల బంగారం, 7.84 కేజీల వెండి, బైక్‌ని సీజ్ చేశారు.
బైకు దొంగ అరెస్ట్
బైకులను మాయం చేస్తున్న దొంగను బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్‌లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్‌ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లిలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లి మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు.
సిటీలో ఇద్దరు దొంగలకు సంకెళ్లు