రక్తదానం మహాదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం మహాదానం

Jun 24 2025 3:31 AM | Updated on Jun 24 2025 3:31 AM

రక్తద

రక్తదానం మహాదానం

బళ్లారి రూరల్‌ : స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీఎంసీఆర్‌సీ బ్లడ్‌ సెంటర్‌, బళ్లారి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బళ్లారి ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఆవరణలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో బ్యాంకు సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు సాగిన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రముఖులు డాక్టర్‌ మహిపాల్‌, షకీబ్‌, వీరేశ్‌, విశ్రాంత రేడియాలజిస్ట్‌, 137 సార్లు రక్తదానం చేసి బళ్లారి బ్లడ్‌బ్యాంకుగా పేరొందిన డాక్టర్‌ నాగరాజరావు, బీఎంసీఆర్‌సీ బ్లడ్‌సెంటర్‌ సిబ్బంది, ఎస్‌బీఐ డీజీఎం అశోక్‌చంద్ర, ఆర్‌ఎం రవి, మెశ్రమ్‌, ఏజీఎం రాముముచ్చి, సీఎం, హెచ్‌ఆర్‌లు గౌతమ్‌ అడిగ, మధుకేశ్వరస్వామి, ప్రేమ్‌సింగ్‌ నాయక్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ప్రతిభ, బెహ్రా, డీజీఎస్‌ రామకృష్ణ దేవర, ఆర్‌.శంక్రప్ప, డీజీఎస్‌ సురాజ్‌, డీఆర్‌ఎస్‌ వాదిరాజ్‌, ఏజీఎస్‌ ధర్మేంద్ర నాగపాల్‌, జడ్‌ఎస్‌ మహేశ్వరప్ప, రక్తదాన శిబిరం చైర్మన్‌, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి బి.దేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.

భిక్షకుల మధ్య కొట్లాట..

ఒకరి హత్య

హుబ్లీ: భిక్షగాళ్లు ఇద్దరు తగువులాడుకున్న ఫలితంగా ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలు.. తన తల్లిని తిట్టాడన్న చిన్న కారణంతో ఒకే ఇంట్లో అద్దెకు ఉన్న స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు. పాత హుబ్లీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన మితిలేష్‌ కుమార్‌ హత్యకు గురయ్యాడు. రాజేష్‌కుమార్‌ కేసులో ప్రధాన నిందితుడు. అతడిపై కేసు నమోదైంది. గత రాత్రి ఇద్దరి మధ్య ఇంట్లో మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాజేష్‌కుమార్‌ మితిలేష్‌ కుమార్‌ తలపై మైక్‌సెట్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మితిలేష్‌ కుమార్‌ మృతి చెందాడని పాత హుబ్లీ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

అధికారికి వీడ్కోలు

బళ్లారిఅర్బన్‌: జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా గత మూడేళ్ల నుంచి విధులు నిర్వహించి చిత్రదుర్గ జిల్లాకు బదిలీ అయిన విజయ్‌కుమార్‌కు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. డీసీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హాల్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి విజయ్‌కుమార్‌ను అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు. విజయ్‌కుమార్‌ కొంచెం కోపిస్టి అయినా విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించేవారని తాజాగా డీడీ బాధ్యతలు చేపట్టినా ఇప్పటి వరకు ఆ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణ నాయక్‌ తెలిపారు. విజయ్‌కుమార్‌ ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగించకుండా పనులు సక్రమంగా నిర్వహించేలా ఉద్యోగులతో చక్కగా మెలుగుతూ విధులు సమర్థవంతంగా చేపట్టేలా చూశారని కొనియాడారు. విజయ్‌కుమార్‌ సతీమణి జ్యోతి, ఎస్టీ కార్పొరేషన్‌ అధికారి దివాకర్‌, జాలెప్ప, సవితతో పాటు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

వైద్యుడి బదిలీ తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడిని బదిలీ చేయడం తగదని కర్ణాటక రైతు సంఘం, టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం సింధనూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అధ్యక్షుడు యరదిహాళ మాట్లాడారు. ఇటీవలే ప్రారంభించిన చిన్న పిల్ల్లల ఆస్పత్రిలో వైద్య సేవలు అందించే డాక్టర్‌ నాగరాజ్‌ను ఉన్నఫళంగా బదిలీ చేయాల్సిన అవసరం లేదని, బదిలీ అదేశాలను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

రక్తదానం మహాదానం 1
1/2

రక్తదానం మహాదానం

రక్తదానం మహాదానం 2
2/2

రక్తదానం మహాదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement