
ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడంతో అదుపుతప్పి ఇంటిని ఢీకొట్టింది. బస్సులోని 35 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాలు.. శివమొగ్గ నుంచి బెంగళూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు కేఎ.57 ఎఫ్ 2826.. తిపటూరు తాలూకాలోని కోనెహళ్ళి సిద్దాపుర గ్రామం వద్ద బస్సు టైరు పేలిపోయి రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభం, కొబ్బరి చెట్టును ముక్కలు చేసుకుంటూ వెళ్లి పుట్టణ్ణ ఇంటిని ఢీకొట్టింది. భారీ శబ్ధం, కుదుపులు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. సీట్లకు గుద్దుకోవడంతో ఎక్కువమందికి ముఖానికి, తలకు గాయాలయ్యాయి. ఇంటిలో ఉన్న వారికి గాయాలు తగిలాయి. ఎక్కువ గాయాలైనవారిని తిపటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
35 మందికి గాయాలు
తుమకూరు జిల్లాలో ప్రమాదం

ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు