
రైతుల సమస్యలను పరిష్కరించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంర్కొంటున్న జ్వలంత సమస్యలను పరిష్కరించాలని టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టా రు. సోమవారం రాయచూరు విశ్వ విద్యాలయం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అధ్యక్షుడు మానసయ్య డిమాండ్ చేశారు. తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని కాలువలపై 748 మంది గ్యాంగ్ మ్యాన్లకు ఆరు నెలల బకాయి వేతనాలను చెల్లిం చాలన్నారు. జిల్లాలో 45 ఏళ్ల నుంచి భూమి లేని పేదలకు భూములు పంచాలని, అధికారులు గుర్తించిన 1064 ఎకరాల భూములను పంపిణీ చేయడానికి ముందుకు రావాలన్నారు. హట్టి బంగారు గనుల కంపెనీ వద్ద రూ.2000 కోట్ల పెట్టుబడిపెట్టి 3 వేల మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు క ల్పించడానికి అవకాశముందని వాటిని పరిష్కారించాలని కోరుతు వినతి పత్రం సమర్పించారు .