
చాముండి కొండపైకి ఉచిత బస్సులు
మైసూరు: ఆషాడమాసంలో ప్రతి శుక్రవారం చాముండి కొండపై అమ్మవారికి విశేష పూజలకు మైసూరు నగరం నుంచి వేలాదిగా భక్తులు తరలివెళ్తారు. భక్తుల కోసం 60కి పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ అధికారి వీరేష్ గురువారం తెలిపారు. లలిత మహాల్ నుంచి వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణమని తెలిపారు. అమ్మవారి దర్శనానికి రూ.2 వేల టికెట్ కొన్నవారి కోసం లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు.
సీఎంకు అన్నీ చెప్పాను: బీఆర్
శివాజీనగర: సంతృప్తి, అసంతృప్తి అంటూ నాదేమీ లేదు, జరిగింది ఆయనకు చెప్పాను, అని సీఎం సిద్దరామయ్యను భేటీ తరువాత కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే బీ.ఆర్.పాటిల్ తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ప్రకటించడంతో కలకలం రేగడం తెలిసిందే. గురువారం కావేరి నివాసంలో సిద్దరామయ్యను భేటీ చేసి చర్చించారు. తరువాత మీడియాతో మాట్లాడారు, నేను చెప్పాల్సింది చెప్పి వచ్చాను. డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌కు కూడా వివరంగా చెప్పానన్నారు. వారు ఓపికగా విన్నారు. ఎలాంటి చర్యలు తీసుకొంటారనేది వారికి సంబంధించినది అని అన్నారు.
తొక్కిసలాట కేసు..
దయానంద్ విచారణ
బనశంకరి: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో సస్పెండైన నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ గురువారం బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ ముందు మెజస్టీరియల్ విచారణకు హజరయ్యారు. గంటకు పైగా కలెక్టర్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. భద్రతా లోపం , విధుల్లో లోపాలున్నాయా అని అడిగారు. విజయోత్సవం వద్దంటూ డీసీపీ కరిబసవనగౌడ రాసిన లేఖ గురించి కూడా కలెక్టర్ జగదీశ్ ప్రస్తావించారు. ఆర్‌సీబీ, డీఎన్‌ఏ ప్రతినిధులు ఒత్తిడి చేశారా అని అడిగారు. భారీ సంఖ్యలో వస్తారని ఊహించారా, అంచనా వేసినట్‌లైతే ఎందుకు మీరు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు అని ఆరా తీశారు. స్టేడియం వద్ద భద్రత కల్పించడానికి ఎందుకు ఆలస్యమైంది అని విచారించారు.
సెప్టెంబరులో రాజకీయ మార్పులు: మంత్రి
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ ఎత్తున మార్పులు జరగనున్నాయని సీఎంకు సన్నిహితుడు, మంత్రి కే.ఎన్.రాజణ్ణ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు జరుగనున్నాయని, దీని గాలి చల్లగా వీస్తోంది. సెప్టెంబర్ గడవనీ అని అన్నారు. సీఎం సిద్దరామయ్య 2013లో ఉన్నట్లుగా ఇప్పుడు లేరని విలేకరులు ప్రస్తావించగా, పవర్ సెంటర్‌లు అధికమయ్యాయి, ఏం చేయడానికీ సాధ్యపడదు అని అన్నారు. అప్పట్లో అయితే ఒకే పవర్ సెంటర్ ఉండేదని, సిద్దు మీద ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు, నేడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు డిమాండ్‌కు తగినట్లు నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తి ఉండవచ్చు. గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉందన్నారు.
బనశంకరి: అధికంగా మొబైల్‌ఫోన్ వినియోగం, ఆటపాటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, దానివల్ల స్థూలకాయం పెరిగి తదితర కారణాలతో బాలలు, విద్యార్థులు హృద్రోగానికి గురవుతున్నారని హుబ్లీలోని కర్ణాటక మెడికల్ కాలేజీ , పరిశోధనా సంస్థ (కిమ్స్) పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విష వలయంపై క్షుణ్ణంగా పరిశోధన చేసి నివేదికలను రూపొందించారు.
కొవ్వు శాతం పెరిగింది
● ఇటీవ రోజుల్లో రాష్ట్రంలో చిన్న వయసు పిల్లలు, 30 ఏళ్లలోపు యువతీ యువకులు గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న దుర్ఘటనలు ఎక్కువయ్యాయి.
● దీనిపై పలు వాదనలు వినబడుతుండగా నిజానిజాలను వెలికి తీయడానికి కిమ్స్ డాక్టర్లు నడుం కట్టారు.
● కిమ్స్ ఆసుపత్రి విభాగం పరిశోధన కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ రామ కౌలగుడ్డ, సముదాయ ఆరోగ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజునాథ్ నేకార, శాస్త్రవేత్తలైన డాక్టర్ శివకుమార బేలూర, డాక్టర్ అరుణ శెట్టర్ బృందం అధ్యయనం చేపట్టారు.
● ధార్వాడ జిల్లాలోని ఆరు పాఠశాలలకు చెందిన 8 , 9 తరగతులు చదువుతూ అధిక బరువు ఉన్న సుమారు 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
● 26 మంది విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు వెలుగుచూశాయి. చిన్న వయసులోనే షుగర్, అధిక రక్తపోటు, 11 మందిలో కొవ్వు సంబంధ ట్రైగ్లిజరైడ్స్, హోమోసిస్టీన్స్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.
● గుండె జబ్బుల వ్యాప్తికి ఇవి కారణమవుతున్నట్లు తేల్చారు.
ఇంకా ఏం సూచించారు..?
కిమ్స్ వైద్యులు తమ నివేదికలను భారతీయ ఆయుర్ విజ్ఞాన సంస్థకు, విద్యశాఖ మంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రికి సమర్పించారు. తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు పాఠ్యేతర కార్యకలాపాల్లో అధికంగా పాల్గొనేలా పాఠశాలలు, కాలేజీలను ఆదేశించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి సమగ్ర వైద్య పరీక్షలు చేయడానికి రూ.5 వేలు చొప్పున ఖర్చవుతుంది. ప్రభుత్వమే ఈ పరీక్షలు నిర్వహించి తగిన వైద్యసేవందిస్తే బాలల్లో గుండెపోటు ముప్పును తగ్గించవచ్చునని డాక్టర్లు పేర్కొన్నారు.
నివేదికపై స్పందన నిల్
నివేదిక ఇచ్చి ఐదునెలలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సదరు వైద్యులు ఆవేదన వ్యక్తంచేశారు. బాలలు అధికంగా మొబైల్ చూస్తూ కదలకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఆటలు ఆడడం తగ్గింది అని డాక్టర్ రామ కౌలగుడ్డ ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్‌ఫోన్‌తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు.
సెల్ వ్యసనం, ఆటపాటలకు దూరం
బాలల్లో గుండెజబ్బులకు ఇవీ కారణాలే
హుబ్లీ కిమ్స్ వైద్యనిపుణుల అధ్యయనం
తరగతిలో ఉపాధ్యాయుడు..
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో రోజు రోజుకు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించే ఘటనలు అధికమయ్యాయి. గురువారం బాగల్‌కోట జిల్లా జమఖండిలో తుంగళ హైస్కూల్‌లో కన్నడ ఉపాధ్యాయుడు గురుపాద (49) పాఠం చెబుతూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

చాముండి కొండపైకి ఉచిత బస్సులు

చాముండి కొండపైకి ఉచిత బస్సులు

చాముండి కొండపైకి ఉచిత బస్సులు