
కుండపోత వర్షాలు.. ఉపనదుల పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మతో పాటు ఉప నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్‌లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, జత్రోట, బివశి సిద్దాళ, అకోళ, నిప్పాణి తాలూకా బారవాడ, కున్నూర, కారదగ, బోజ తదితర ఎనిమిది వంతెనలు జలావృతం అయ్యాయి. ఈ మార్గంలో కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రాకపోకల సంబంధాలు స్తంభించాయి. ఆల్మట్టి డ్యాం నుంచి 10 గేట్లను తెరిచి కృష్ణా నదిలోకి 98,250 క్యూసెక్కుల నీటిని వదిలారు. మరో వైపు రోడ్డు కోతకు గురి కావడంతో బెళగావి, గోవా మధ్య రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. కుసుమళ్లి వద్ద నదిపై నిర్మించిన వంతెన నీట మునిగింది. ఏళ్ల తరబడి నూతన వంతెన నిర్మాణం విషయంలో గందరగోళం నెలకొంది. ప్రజా ప్రతినిధులు వంతెన పనులను పూర్తి చేయడానికి నిధుల కొరతను సాకుగా చెబుతున్నారు. ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నది ఒడ్డున ఉన్న శిశిలేశ్వర ఆలయం జలావృతమైంది. బెళగావి జిల్లాలో బెణ్ణెతుప్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల రైతుల్లో ఆనందం తాండవిస్తోంది.

కుండపోత వర్షాలు.. ఉపనదుల పరవళ్లు

కుండపోత వర్షాలు.. ఉపనదుల పరవళ్లు