breaking news
International
-
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్ పేర్కొన్నారు.తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్.. ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్ ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్‌లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు. 📹 DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route."Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." - President Trump pic.twitter.com/N4TAkgPHXN— The White House (@WhiteHouse) October 18, 2025 -
పాక్-ఆప్ఘన్ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్-ఆప్ఘన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.ఖతార్ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్ ఖండించింది. -
ట్రంప్‌కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో అమెరికన్లు.. ‘నో కింగ్స్’ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక, అమెరికన్లకు మద్దతుగా లండన్ నుంచి వాషింగ్టన్ వరకు యూరప్ దేశాల్లోనూ వీరికి సపోర్టు లభించింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా గ్రేట్, సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్‌డౌన్ వంటి నిర్ణయాల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలనాతీరు, విధానాలపై అనేక దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో కూడా నిరసనలు చేపట్టిన అమెరికన్లు తాజాగా మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. WOW! Protesters created a HUGE human sign on San Francisco’s Ocean Beach reading “No Kings YES on 50” to support California’s Prop 50 and stand up against Donald Trump’s fascist regime pic.twitter.com/NbUnQk6ZZB— Marco Foster (@MarcoFoster_) October 18, 2025‘నో కింగ్స్’ (No Kings protests) పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. యాభై రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. పలు ఐరోపా దేశాల్లోనూ వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికా రాజధాని ప్రాంతం అంతటా నిరసనకారులు కవాతు చేశారు. ఉత్తర వర్జీనియాలో, వాషింగ్టన్ డీసీకి వెళ్లే దారిలో ఓవర్‌పాస్‌లపై నిరసనకారులు కవాతు చేస్తూ కనిపించారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు.Holy shit, look at this crowd from the Boston No Kings protest. Samuel Adams would be damn proud. pic.twitter.com/Efl1i8RExB— Mike Nellis (@MikeNellis) October 18, 2025ట్రంప్ స్పందన..మరోవైపు.. తాజా ఆందోళనలపై ట్రంప్ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. వారంతా నన్ను రాజు అని అంటున్నారు. కానీ, వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. ఇక, అమెరికన్ల నిరసనలను వైట్‌హౌస్‌తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీల్లో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని.. ఇవి ‘హేట్ అమెరికా’ నిరసనలని అన్నారు.100,000+ out for a “No Kings” protest in Chicago. pic.twitter.com/oZhGrkfGUX— Spencer Hakimian (@SpencerHakimian) October 18, 2025 Thank you to the many millions who are showing up all over the country to say no to kings. pic.twitter.com/lzS4fzBYct— Adam Schiff (@SenAdamSchiff) October 18, 2025 -
Italy: ఎయిర్ ఇండియా షాక్.. దీపావళి ప్రయాణాలు వాయిదా!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్‌నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు. -
రాయల్ టైటిల్ వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ
లండన్: బ్రిటన్రా జు చార్లెస్–3 త మ్ముడు ప్రిన్స్ ఆండ్రూ(65) తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకున్నారు. ఇకపై అన్ని రాచ బిరుదులను, మర్యాదలను సైతం వదిలేసు కుంటున్నట్లు ఆండ్రూ ఎక్స్ వేదికగా ప్రక టించారు. అమెరికాను కుదిపేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంతో ప్రిన్స్ ఆండ్రూకు సంబంధాలున్నట్లు ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడుల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన హిజ్ రాయల్ హైనెస్ (హెచ్ఆర్హెచ్)ను వాడటం ఆపేశారు. -
సోమవారం నుంచి తెరుచుకోనున్న రఫా క్రాసింగ్
కైరో: గాజాకు తిరిగి వచ్చే పాలస్తీనియన్ల కోసం సోమవారం నుంచి రఫా క్రాసింగ్ పాయింట్‌ను తెరిచి ఉంచుతామని పాలస్తీనా దౌత్య కార్యాలయం తెలిపింది. గాజాకు తిరిగి వెళ్లేందుకు తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న పాలస్తీనియన్ల సంఖ్య భారీగా ఉందని శనివారం పేర్కొంది. అయితే, ఎందరనే విషయం స్పష్టం చేయలేదు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ నియంత్రణలో లేని బయటి ప్రపంచానికి గాజాకు ఉన్న ఏకైక మార్గం ఈ క్రాసింగ్. గాజాను నియంత్రణ తీసుకున్న తర్వాత 2024 మే నుంచి ఇజ్రాయెల్ దీనిని మూసివేసింది. ఇలా ఉండగా, ఇజ్రాయెల్– హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో మృతుల సంఖ్య 68 వేలు దాటిపోయిందని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. వారం క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. శిథిలాల తొలగింపు సందర్భంగా మృతదేహాలు బయటపడుతు న్నట్లు వెల్లడించింది. -
పాక్–ఆఫ్గాన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను: ట్రంప్
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాకిస్తాన్‌పై జరుగుతున్న దాడి, ఆఫ్గని స్తాన్‌పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది. నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణలను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపటంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పాక్–ఆఫ్గాన్ మధ్య సైనిక ఘర్ష ణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
మొజాంబిక్ తీరంలో పడవ ప్రమాదం..
కొచ్చి: మొజాంబిక్‌లో బెయిరా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. గురువారం సముద్రంలో నిలిపి ఉన్న ఓడలో మెయింటెన్స్ పనికోసం కొందరిని పడవలో పంపించారు. పడవ నుంచి ఓడను చేరుకునేందుకు ప్రయతి్నస్తుండగా తీవ్రమైన అలల తాకిడికి పడవ బోల్తా పడిందని భారత ఎంబసీ తెలిపింది. ఘటన సమయంలో పడవలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని వివరించింది. అయితే, ప్రమాద బాధితుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనలో గల్లంతైన వారిలో ఇద్దరు మలయాళీలు కూడా ఉన్నట్లు కేరళ ఎమ్మెల్యే అనూప్ జాకబ్ శనివారం తెలిపారు. వీరిలో ఒకరు ఎర్నాకులం జిల్లా పిరవోమ్‌కు చెందిన ఇంద్రజిత్(22) కాగా, మరొకరు కొల్లమ్‌కు చెందిన వ్యక్తి అని ఆయన వివరించారు. -
రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ తమను ఏమాత్రం రెచ్చగొట్టినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. తమను రెచ్చగొడితే వెంటనే తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు. నేటి అణ్వాయుధాల వాతావరణంలో యుద్ధాలకు తావులేదని, ఈ విషయంలో భారత సైనికాధికారులు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో అద్భుతమైన సామర్థ్యాలు ప్రద ర్శించామని, లక్ష్యాలను ఛేదించామని అన్నారు. కేవలం అంకెల్లో గొప్పగా కనిపిస్తున్న ప్రత్యరి్థపై విజయం సాధించామని స్పష్టంచేశారు. భారత్‌ను అస్థిరపర్చడానికి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుటోందని అసిమ్ మునీర్ ఆరోపించారు. పిడికెడు మంది ఉగ్రవాదులు తమను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్నవారిని మట్టిలో కలిపేస్తామని పరోక్షంగా తెహ్రీక్–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ని హెచ్చరించారు. -
రక్త పరీక్ష 1.. గుర్తించగల క్యాన్సర్లు 50
వాషింగ్టన్: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ ఒకే ఒక రక్త పరీక్షకు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. పలు రకాల క్యాన్సర్లకు తొలి దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. అలాంటి క్యాన్సర్ ముదరబోతోందనే హెచ్చరిక సంకేతాన్ని సైతం ఈ రక్తపరీక్ష అందివ్వగలదు. ఉత్తరఅమెరికాలో ఇటీవల జరిపిన సంబంధిత ప్రయోగం విజయవంతమవడంతో బహుళ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షకు బాటలుపడ్డాయి. ఈ 50 క్యాన్సర్లలో దాదాపు మూడు వంతుల క్యాన్సర్లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు. కానీ ఈ బ్లడ్టెస్ట్తో వాటి ఆనవాళ్లను సైతం ముందే కనిపెట్టవచ్చు. సగం క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తింవచ్చు. దీంతో వాటికి వీలైనంత త్వరగా చికిత్స మొదలెట్టి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘గ్రెయిల్’ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్‌కు ‘గ్యాలెరీ’అని పేరుపెట్టింది. క్యాన్సర్ కణితి నుంచి ముక్కలై విడివడి మానవ రక్తప్రవాహంలో చక్కర్లు కొడుతున్న డీఎన్ఏ అవశేషాలను ఈ రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ డీఎన్ఏ అవశేషాలు ఏ అవయవం నుంచి వస్తుందనేది కూడా ఈ బ్లడ్‌టెస్ట్ ద్వారా తెలుస్తుంది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ద్వారా సేకరించిన వేలాది మంది పౌరుల రక్తనమూనాలను పరిశీలించి ఈ బ్లడ్‌టెస్ట్ సామర్థ్యాన్ని గణించారు. అమెరికా, కెనడాల్లో 25,000 మంది యుక్తవయసు వాళ్ల రక్తాన్ని సైతం సేకరించి నూతన తరహాలో రక్త పరీక్ష చేశారు. వీరిలో ప్రతి 100 మందిలో దాదాపు ఒక శాతం మంది క్యాన్సర్‌బారిన పడబోతున్నట్లు తేలింది. వీరిలో తర్వాతి కాలంలో 62 శాతం మందికి క్యాన్సర్ లక్షణాల బయటపడటం విశేషం. ‘‘క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో ఇదొక మైలురాయి. ముదరక ముందే క్యాన్సర్‌ను కనిపెట్టడంతో దానికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుంది. చికిత్సలో విజయశాతాలు అద్భుతంగా ఉంటాయి’’అని అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఒరెగాన్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీలో రేడియేషన్ మెడిసిన్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ నిమా నబాబిజదేహ్ చెప్పారు. ‘‘క్యాన్సర్ ఉండకపోవచ్చు అని దాదాపు 99 శాతం మందిలో సాధారణ రక్తపరీక్షల్లో ‘నెగెటివ్’అని రాగా, అది తప్పు అని మా రక్తపరీక్ష నిరూపించింది’’ అని వివరించారు. -
ఎక్కడిదక్కడే ఆపేయండి
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలని, ఇకనైనా ఎక్కడిదక్కడే ఆపేసి రెండు దేశాలు వెనక్కు తగ్గాలని సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం (స్థానిక కాలమానం) మధ్యాహ్నం ట్రంప్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిగాయి. అనంతరం తన సొంత సోషల్‌మీడియా కంపెనీ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ‘వారు ఎక్కడిదక్కడే ఆపేయాలి. ఇద్దరూ ఎవరికి వారే యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవచ్చు. అసలు విషయాన్ని చరిత్రకు వదిలేద్దాం’అని పేర్కొన్నారు. ఇక ఇళ్లకు వెళ్లండి యుద్ధాన్ని ఆపేసి ఇరుపక్షాలు చర్చలకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవులు గడిపేందుకు ఫ్లోరిడాకు వచి్చన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడికైనా యుద్ధక్షేత్రంలోకి వెళ్లి చూడండి. అంతటా తీవ్రమైన పరిస్థితులే. యుద్ధాన్ని ఎక్కడిదక్కడే ఆపేసి ఇరుపక్షాలు ఇళ్లకు వెళ్లిపోండి. కుటుంబాలతో గడపండి. హత్యలు ఆపండి. ఇరుపక్షాలు ఈ పనిచేయటం మంచిది’అని పేర్కొన్నారు. యుద్ధ విరమణపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ గురువారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయతి్నస్తున్న ట్రంప్.. గతంలో జెలెన్స్కీని తీవ్రంగా విమర్శించగా, తాజాగా పుతిన్‌పై బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాలను వదిలేసి వెనక్కు వెళ్లాలని హెచ్చరించారు. వెనక్కు తగ్గకుంటే ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి అత్యాధునిక తొమహాక్ క్షిపణులు అందిస్తానని రష్యాను హెచ్చరించిన ఆయన.. తాజాగా మాట మార్చి రష్యాను బెదిరించేందుకే అలా చెప్పానని, ఆ క్షిపణులు ఉక్రెయిన్‌కు అవసం లేదని ఎన్బీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం ఆపాలన్న ట్రంప్ ప్రకటనను జెలెన్స్కీ స్వాగతించారు. కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరిపేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు. -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు
హాంగ్జౌ: ఎయిర్ చైనా విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగాయి. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌కు బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాకంపితులయ్యారు. ఓవర్‌హెడ్ బిన్ నుంచి మంటలు రాగా.. విమానం లోపలంతా పొగ వ్యాపించింది.అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.Air China flight CA139 made emergency landing in Shanghai today after a lithium battery in overhead luggage self-ignited. No injuries reportedThat’s why Emirates has now restricted power bank charging onboardpic.twitter.com/KNDVKpINKJ— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) October 18, 2025 -
ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్‌లోని ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు -
‘ఆధార్’ నమూనాతో ‘బ్రిట్ కార్డ్’.. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి
లండన్: ఇటీవలే భారత్‌లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు.ఆధార్ కార్డు ప్రజా సంక్షేమం, సేవలకు బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తుండగా, యూకే పథకం మరోలా ఉపయుక్తం కానుంది. అక్రమ వలసలను అరికట్టే దిశగా యూకే ‘బ్రిట్ కార్డ్’ను తీసుకురానుంది. అయితే దీనిపై యూకేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన రెండు రోజుల ముంబై పర్యటనలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకల్పనలో సహకారం అందించిన నందన్ నీలేకనితో పాటు పలువురితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడీ కార్యక్రమం అమలు, ప్రభావంపై చర్చించారు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆధార్.. దేశంలోని ప్రజలందరికీ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, సంక్షేమం తదితర సేవలకు ఆధారంగా మారింది. ఈ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పరిపాలనా ఖర్చులను ఆదా చేయడంలో కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆదార్లోని లోతుపాతులపై చర్చించిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. బ్రిట్ కార్డు దీనికి భిన్నమైన డిజైన్‌తో ఉంటుందని, బయోమెట్రిక్ డేటాను సేకరించదని తెలిపారని ‘ది గార్డియన్’ పేర్కొంది. కాగా బ్రిట్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం. బ్రిట్ కార్డు ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, కొందరు లేబర్ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తూచ్ అదంతా ఉత్తినే.. జెలెన్స్కీకి ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్ కొత్త ప్లాన్ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్‌కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌ను జెలెన్స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్‌లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్‌హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ఎన్ఎస్ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.జాతీయ భద్రతపై ఆందోళన?‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
పాకిస్తాన్ సైన్యం అరాచకం.. తాలిబన్ నేత సీరియస్ వార్నింగ్
కాబూల్: దాయది దేశం పాకిస్తాన్(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పాక్ సైన్యం ఆప్ఘనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవరాక్షన్‌కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.మరోవైపు.. పాక్ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం. -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ! -
హెచ్1బీ ఫీజు పెంపుపై పిటిషన్
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్‌లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్‌పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్‌పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్‌పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
పూచీకత్తుగా రూ.96 కోట్లు
బీరుట్: లిబియా దివంగత నేత కల్నల్ గఢాఫీ కుమారుడు హానిబాల్ గఢాఫీని బెయిల్‌పై విడుదల చేసేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు విడుదల కావచ్చని పేర్కొంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన గఢాఫీ తిరుగుబాటుదార్ల చేతిలో 2011 అక్టోబర్‌లో చనిపోయారు. అయితే, ఆయన పాలనాకాలంలో 1978లో లిబియాకు వచ్చిన షియాల గురువు మౌసా అల్ సదర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే, గఢాఫీ కుమారుడు హానిబాల్‌కు ఆ విషయం తెలుసని అనుమానించిన మిలిటెంట్ల గ్రూపు 2015లో ఆయన్ను అపహరించి బాల్బెక్లో ఉంచింది. అనంతరం లెబనాన్ పోలీసులు అతడిని మిలిటెంట్ల చెరనుంచి విడిపించి బీరుట్ జైలులో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్దకాలంగా ఎలాంటి విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు. శుక్రవారం అధికారులు ఆయన్ను జస్టిస్ ప్యాలెస్‌లో జడ్జి జహెర్ హమాదెహ్ ఎదుట హాజరుపరిచారు. హానిబాల్ బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా ఆయన నిర్ణయించారు. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే జైలు నుంచి విడుదల కావచ్చని తెలిపారు. అయితే, రెండు నెలలపాటు దేశం విడిచి వెళ్లరాదనే షరతును విధించారు. హానిబాల్ తరఫు లాయర్ చర్బెల్ మిలాడ్ అల్–ఖౌరీ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. హానిబాల్ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని చెప్పారు. ఆయన బ్యాంకు అక్కౌంట్లపై నిషేధం ఉందని చెప్పారు. కాగా, షియా గురువు మౌసా అల్ సదర్ అదృశ్యం వ్యవహారం లెబనాన్‌లో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. లెబనాన్‌లోని ఏదో ఒక జైలులో ఆయన సజీవంగా ఉండి ఉంటారని కుటుంబీకులు భావిస్తుండగా, ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. జీవించి ఉంటే ఆయనకు ఇప్పుడు 96 ఏళ్లుంటాయని అంచనా. -
నన్ను అలా చేసేలే చేశారు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ప్రస్తుతం చైనాపై విధించిన సుంకాలు శాశ్వతం కాదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా చర్యలకు అనుగుణంగానే వారి వస్తువులపై అత్యధిక సుంకాలు విధించాల్సి వచ్చిందన్నారు. అవేమీ స్థిరంగా కొనసాగవన్నారు ట్రంప్. కాకపోతే తాను ఆ విధంగా సుంకాలు విధించేలా చేశారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్.. చైనాపై విదించిన సుంకాలకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు అత్యధిక సుంకాలు విధించుకోవడానికి కారణాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ బదులిచ్చారు. మరో రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అవుతానని, అప్పుడు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు, సుంకాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తమ మధ్య భేటీ అంతా సజావుగానే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. చైనా ఎప్పుడూ తమపై ఆదిపత్యం కోసమే చూస్తుందని, ఏం జరుగుతుందనేది తనకైతే తెలియదని, ఏం జరుగుతందో చూద్దాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైనాపై 145 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య వైరం కాస్త ముదిరింది. ఆపై చైనాపై సుంకాలను 100 శాతానికి పరిమితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సైతం చైనా తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండటానికి ఈ తరహా విధానం మంచిది కాదని, తమ ఆధిపత్యంతో ప్రపంచ దేశాల్ని కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చైనా ధ్వజమెత్తింది. అప్పట్నుంచీ ఇరు దేశాల మధ్య వైరంతో పాటు దూరం కూడా పెరిగింది.ఇదీ చదవండి. ‘రాబోయే కాలమంతా భారత్‌ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’ -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోంది.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ (India) తరఫున ఆప్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆప్ఘన్‌తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్ విషయంలో ఆప్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025అంతకుముందు కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్‌కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్‌లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
కూచిపూడి నర్తకి అరుణిమకు అరుదైన గౌరవం
లండన్: భారతీయ నృత్యరూపకం కూచిపూడికి బ్రిటన్‌లో ఎనలేని గుర్తింపు తెస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కళకు మరింత వన్నె తెచ్చిన ప్రముఖ నాట్యకళాకారిణి అరుణిమ కుమార్‌ను యూకే సర్కార్ అరుదైన గౌరవంతో సత్కరించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 ‘గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం)’తో అరుణిమను గౌరవించారు. ఒక కూచిపూడి కళాకారిణి ఈ మెడల్‌ను సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శిస్తూ భారత్, బ్రిటన్‌సహా పలు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాల బలోపేతానికి ఆమె తన కూచిపూడి కళ ద్వారా కృషిచేశారని బ్రిటన్ రాజకుటుంబం పేర్కొంది. యూకేలో పౌర, సైనిక కార్యకలాపాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజు ప్రతిఏటా ఈ పురస్కారాన్ని ప్రదానంచేస్తారు. అరుణిమ ఇప్పటికే బ్రిటన్ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాత సాధించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 వర్ధంతి వేడుకల్లో, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో, లండన్‌లోని యూకే ప్రధాని కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అరుణిమ ఎన్నోసార్లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ నృత్యరూపం అంబాసిడర్‌గా, ఇన్‌ఫ్లూయన్సర్‌గా, సాంస్కృతిక సారథిగా అరుణిమకు మంచి పేరుంది. తనకు బ్రిటిష్ ఎంపైర్ మెడల్ రావడంపై అరుణిమ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజు నుంచి గౌరవ పురస్కారం పొందడం నిజంగా ఎంతో గర్వంగా, సముచితంగా గౌరవంగా అనిపిస్తోంది. కళలో నా కృషిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా భావించట్లేను. అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ నాట్యానికి దక్కిన గౌరవం. కూచిపూడి నాకు జీవితాంతం తోడుంటుంది. నా భావాల వ్యక్తీకరణకు మాధ్యం కూచిపూడి’’అని ఆమె అన్నారు. ఈమెకు చెందిన ‘అరుణిమ కుమార్ డ్యాన్స్ అకాడమీ’50కిపైగా దేశాల్లో 3,000కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచి్చంది. ఐదేళ్ల చిన్నారి మొదలు 75 ఏళ్ల వృద్దుల దాకా ఈమె వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈమెకు వందలాది మంది శిష్యులు ఉన్నారు. పద్మ భూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ జయరామారావు వద్ద అరుణిమ శిష్యరికం చేసి కూచిపూడిలో నైపుణ్యం సాధించారు. -
ఒక ఫైటర్ జెట్ 3.5 కోట్ల పూసలు
దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు రాల్ఫ్ జిమాన్ అయిదేళ్లపాటు 3.5 కోట్ల పూసలు ఉపయోగించి ఒక పాత సోవియట్ మిగ్–21 ఫైటర్ జెట్‌కు కొత్త రూపాన్ని ఇచ్చాడు. యుద్ధ చిహా్నలను కళాఖండాలుగా మార్చే అతని ‘వెపన్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్’ శ్రేణిలో ఇది చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రాల్ఫ్ జిమాన్కు చిన్నప్పటి నుంచే ఆయుధాలతో భయంకరమైన అనుభవాలున్నాయి. 1970లలో, జోహన్నెస్‌బర్గ్‌లో 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతన్ని ఓ వ్యక్తి .45 మాగ్నమ్ తుపాకీతో బెదిరించాడు. కానీ తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 15 నుంచి 20 సార్లు తుపాకీ గురి పెట్టినట్లు జిమాన్ గుర్తు చేసుకున్నాడు. ఈ భయంకరమైన అనుభవాల వల్లే ఆయన ‘తుపాకుల వ్యతిరేకి’గా మారారు. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్‌లో ఉంటున్న జిమాన్, వృత్తిరీత్యా కమర్షియల్ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్. దశాబ్ద కాలంగా యుద్ధ కళాఖండాలను లక్షలాది చేతితో అల్లిన పూసలు ఉపయోగించి కళాత్మక వస్తువులుగా మార్చ డమే తన పనిగా పెట్టుకున్నాడు. జిమాన్ తన కళాఖండాల ద్వారా దక్షిణాఫ్రికా చరిత్రలో హింసపై ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం 2019లో అత్యంత పెద్ద సవాలుగా మిగ్–21 విమానాన్ని ఎంచుకున్నాడు. అయిదేళ్ల కష్టం.. మిగ్–21 కళాఖండం మొదట, జిమాన్ ఫ్లోరిడాలోని ఒక సైనిక కాంట్రాక్టర్ నుండి మిగ్–21 జెట్‌ను కొనుగోలు చేశాడు. అది ముక్కలుగా, మంచి స్థితిలో లేకపోయినా, కళాఖండంగా మార్చడానికి కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించాడు. తొలు త ఆయన బృందం మిగ్ ఇంజన్‌ను తొలగించి విమానాన్ని లాస్ ఏంజిలెస్‌లోని స్టూడియోకు తరలించింది. జిమాన్ అల్యూమినియం ప్యానెల్‌లపై డిజైన్లను రూపొందించి, ఆ పేపర్ షీట్లను దక్షిణాఫ్రికాకు పంపాడు. జోహన్నెస్‌బర్గ్, క్వాజులు–నటల్, మ్పుమలంగా ప్రావిన్సుల నుండి వచ్చిన జింబాబ్వేయన్, న్డెబెలె కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ ప్యానెళ్లను పూసలతో తయారు చేయడం ప్రారంభించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానంపై సుమారు 3.5 కోట్ల పూసలు అమర్చినట్లు అంచనా.విద్యకు నిధి మిగ్–21 ప్రాజెక్టుకు మద్దతు ఇచి్చన డీటీగ్రుయిల్లె చారిటీ సంస్థ ద్వారా ఈ కళాకారుల పిల్లలు, ఇతర యువత 25 మంది విద్యకు స్పాన్సర్íÙప్ లభిస్తోంది. వీరు వైద్యం, నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటి కోర్సులు చదువుతున్నారు. ఈ అద్భుతమైన మిగ్–21 విమాన కళాఖండాన్ని అమెరికాలో ప్రదర్శన తర్వాత అమ్మకానికి ఉంచుతారు. దీనిద్వారా వచ్చే నిధులు విద్యా కార్యక్రమాలకు, ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులైన పిల్లలకు ఆర్ట్ థెరపీ అందించడానికి వినియోగిస్తారు. యుద్ధ చిహ్నాలను ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా రాల్ఫ్ జిమాన్ కళతో శాంతి, ఆశ సందేశాన్ని ప్రపంచానికి బలంగా తెలియజేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక ఉక్రెయిన్–రష్యాపైనే దృష్టి: ట్రంప్
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు. రష్యా దాడులను తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యం ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ట్రంప్ బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత పుతిన్‌కు సూచించారు. లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చిచెప్పారు. మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. -
ఏఐ టాయిలెట్!
సాక్షి, సాగుబడి: కృత్రిమ మేధ.. ఇప్పుడు టాయిలెట్‌ని కూడా అత్యా ధునిక స్మార్ట్ లేబొరేటరీగా మార్చేసింది! మనకు మున్ముందు రాగల జబ్బుల్ని ముందుగానే పసిగట్టే ఆధారపడదగిన గట్ హెల్త్ డేటాను.. చిటికెలో మొబైల్ యాప్లోకే అప్లోడ్ చేసేస్తాయట ఈ సూపర్ స్మార్ట్ ఏఐ టాయిలెట్లు!అన్ని రంగాల మాదిరిగానే రోజువారీ వ్యక్తిగత ఆరోగ్య సమాచార సేకరణ వ్యవస్థ కూడా అత్యాధునికతను సంతరించుకుంటోంది. పొద్దున్నే నిద్ర లేవగానే చిటికెలో ఆనాటి తాజా వ్యక్తిగత ఆరోగ్య గణాంకాలను అందించే మొబైల్ యాప్‌లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరికొత్త కొనసాగింపుగా వచ్చిందే స్మార్ట్ మరుగుదొడ్డి!కూర్చుని లేచేలోపే..మలమూత్ర విసర్జన చేస్తున్నంతటి సేపట్లోనే సెన్సార్లు, కృత్రిమ మేధ విశ్లేషణ పరికరాలు.. మల మూత్రాల రంగు, రూపు, నాణ్యతలను బట్టి ఆరోగ్య స్థితిగతుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. కడుపులో సూక్ష్మజీవరాశి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏదైనా తేడా ఉంటే దాని వల్ల ఏయే వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచి ఉందో కూడా తేల్చి చెప్పేస్తాయి. కమోడ్ మీద కూర్చొని, లేచే సమయానికే ఈ సమస్త సమాచారం మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసేస్తాయి ఈ ఏఐ టాయిలెట్లు! ప్రత్యక్ష పరీక్షల మాదిరిగా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఈ పరీక్షల ఫలితాలు ఉంటాయని అనుకోలేం. కానీ, కొలరెక్టల్ కేన్సర్ వంటి అనేక జబ్బుల్ని అత్యంత తొలి దశలోనే గుర్తించటంలో సూపర్ స్మార్ట్ టాయిలెట్ల పాత్రను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో తయారీస్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్‌కు చెందిన టోటో టాయిలెట్స్ సంస్థ ఒక ముందడుగు వేసింది. మరుగుదొడ్డి కమోడ్‌కు అమర్చిన సెన్సార్.. మలం రంగు, ఆకారం, పరిమాణం వంటి వివరాలను అందిస్తుంది. బార్కోడ్ స్కానర్ మాదిరిగా క్షణాల్లో రిపోర్టు ఇస్తుంది. మనిషి కూర్చోగానే సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఎల్ఈడీ లైటు వెలుతురులో మలాన్ని సెన్సార్ పరీక్షిస్తుంది. సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడే స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపిస్తుంది. మల విసర్జన చేసిన ప్రతిసారీ సేకరించిన సమాచారంతో కూడిన స్టూల్ కేలండర్‌ను ఈ యాప్ భద్రపరుస్తుంది. ట్రెండ్ ఎలా ఉంది.. ఏమైనా తేడాలున్నాయా.. ఉంటే, వాటిని సరిదిద్దుకోవటానికి జీవన శైలిని ఎలా మార్చుకోవాలో కూడా సూచనలిస్తుంది. సుఖ మల విసర్జనకు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది కూడా.ప్రత్యేక స్టార్టప్లుకృత్రిమ మేధతో కూడిన బాత్రూమ్ టెక్నాల జీలను అందించే స్టార్టప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని ఆస్టిన్ నగరంలోని త్రోన్ అనే స్టార్టప్ మల మూత్రాల బాగోగులను విశ్లేషించేందుకు ఏఐ టాయిలెట్ కెమెరాను రూపొందించింది. టాయిలెట్‌ను ఉపయోగించే వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, మూత్ర విసర్జన తీరు ఎలా ఉంది? ఆ వ్యక్తి సరిపడా నీరు తాగుతు న్నారా లేదా?.. వంటి రియల్ టైమ్ డేటాను కూడా మొబైల్ యాప్‌కు పంపుతుంది. ఎక్కువ మంది వాడే టాయిలెట్లలో కూడా ప్రతి యూజర్ గట్ ప్రొఫైల్‌ను త్రోన్ ఏఐ వ్యవస్థ సిద్ధం చేస్తుంది. టాయిలెట్‌ను వాడుతున్న వ్యక్తి ఎవరో బ్లూటూత్ ద్వారా గుర్తించి కచ్చితమైన వివరాలను ఎవరివి వాళ్లకు అందిస్తుంది. రోజువారీ బాత్రూమ్ అలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య సమాచార వ్యవస్థను సంపన్నం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్‌పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్‌పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్‌ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్‌ను అనబోయి..భారత్‌లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్‌కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్‌లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్‌లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్‌ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్‌కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్‌ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్‌కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
World Food Day: టన్నుల ఆహారం చెత్తకుప్పల్లోకి!
గాలి, నీరు తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది ఆహారం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆహారం, జీవితం, స్వేచ్ఛ, పని, విద్య తదితర హక్కులు ఉండాల్సిందే. వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటు, భద్రతతో కూడిన పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలి. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ నిర్వహిస్తోంది.ఎలా మొదలయ్యింది?ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ)1945, అక్టోబర్ 16న స్థాపితమయ్యింది. దీనికి గుర్తుగా ఇదే రోజున ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి తదితర సంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ ఏడాది జరుపుకునే ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ ‘మెరుగైన ఆహారాలు, మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం’. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పేదరికం, యుద్ధ సంఘర్షణలు, వాతావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో ఎఫ్ఏఓ పనిచేస్తోంది.ఆందోళన కలిగిస్తున్న ఆహార వ్యర్థాలుప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృథా అవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టారు. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదిక వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2019లో 17శాతం ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి రెండు శాతం పెరిగి 19శాతాని కి చేరినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన 12 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తేలింది. భారతదేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఆహార వృథాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి.ఆకలితో కోట్లాదిమంది విలవిలఆహార వృథా పరిస్థితి సంగతి అలా ఉంటే.. నేటికీ కనీసం తీనేందుకు గుప్పెడు అన్నం లేక కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజంతా పస్తులుండే వారు కొందరైతే, ఒక పూట మాత్రమే తినే స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 78.3కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు ఆకలి బాధను అనుభవిస్తున్నారు. 2022లో 240కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. తెలిపింది. 78.3కోట్ల మంది ఆకలితో అలమటించగా, 14.8కోట్ల మంది పిల్లల్లో పోషహాకార లోపం కనిపించినట్లు తేలింది. తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 25శాతం ఇండియాలోనే ఉన్నారన్నది గమనార్హం. భారత దేశ జనాభాలో 14.5శాతం మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది.వాతావరణ మార్పులతో కుంగుబాటుప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులు, జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా వ్యవపాయ సాగుబడి తగ్గిపోతుంది. పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా కుంచించుకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృథాను అరికట్టడం ఎంతో అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలూ బాధ్యతాయుతంగా మెలగాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. మరోవైపు ఆహార వ్యర్థాలు వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో ఆహారం కుళ్లిపోవడం కారణంగా గ్రీన్హౌస్ వాయువు మీథేన్ విడుదలవుతుంది. ఇది హానికారకంగా మారుతుంది. ఆకలిని పరిష్కరించడం అంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు నూతన విధానాలు అవలంబించాలనే విషయాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. -
మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్‌ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్‌ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు. ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. అలాగే.. భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన. -
తాలిబాన్ల చేతిలో.. పాక్‌కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తాలిబాన్‌తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్‌పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్‌కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్‌ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
ఇక నేనే అధ్యక్షుడిని.. సైనిక నేత మైఖేల్ వెల్లడి
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్‌లో(Madagascar) అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా(Randrianirina) బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా(Madagascar President) పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు.జెన్ జెడ్ యువత(Gen Z) నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెలిసిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్‌లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు.అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయ రేడియోలో ప్రకటించారు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్‌జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్ ఆటకు చెక్: ట్రంప్
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో రష్యా నుంచి భారత్(India) చమురు కొనుగోలుచేయదని ప్రధాని మోదీ(PM Modi) తనకు కీలక హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా(Oil Buy From Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధ్రువీకరించలేదు.మరోవైపు.. రష్యా, చైనా అంశంపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా చైనా సైతం రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని ఇక ఇదే మిగిలి ఉందన్నారు. భారత్, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇంధన విధానంపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెప్పుకొచ్చారు. #WATCH | "Yeah, sure. He's (PM Narendra Modi) a friend of mine. We have a great relationship...I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now we've got to get China to do the same thing..."… pic.twitter.com/xNehCBGomR— ANI (@ANI) October 15, 2025 -
పేరాయణం!
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్ వాట్కిన్స్ అనే న్యూజిలాండ్ మాజీ సెక్యూరిటీ గార్డ్‌కి మాత్రం ఆ విధానం అస్సలు నచ్చలేదు! పేరు కాదది.. అష్టాదశ పురాణం!ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి! పెళ్లి మండపంలోనూ అదే హంగామా!1991లో లారెన్స్ వాట్కిన్స్ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్ తీసుకోకుండా, లారెన్స్ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్‌ను ముందుగానే రికార్డ్ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!. ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ షో చూసి, గిన్నిస్ రికార్డ్స్ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్ అయ్యారు!సంతకం సంగతేంటి?రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్ అలోన్ అలోయ్ వాట్కిన్స్’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్‌పోర్ట్‌కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట! ఇదే లారెన్స్ గారి పూర్తి పేరులారెన్స్ అలోన్ అలాయిస్ అలోయిసియస్ ఆల్ఫెజ్ అలున్ అలురెడ్ ఆల్విన్ అల్యాసాండిర్ ఆంబీ ఆంబ్రోస్ ఆంబ్రోసియస్ అమియాస్ అమియోట్ అమియాస్ అండర్స్ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్ ఆండ్రూ ఆండీ అనైరిన్ ఆంగ్విష్ ఆన్లెయిఫర్ ఆంథిన్... (ఓస్.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత పాస్‌పోర్టుకు 85వ ర్యాంకు
సింగపూర్: భారత పాస్‌పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్‌లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా సింగపూర్ పాస్‌పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్‌పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్‌పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్‌పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది. -
కెన్యా రాజకీయ దిగ్గజం ఒడిన్గా అస్తమయం
నైరోబీ: కెన్యా రాజకీయాలపై తనదైన చెరగని ముద్రవేసిన దిగ్గజ విపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడిన్గా తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవల ఆయన భారత్‌కు విచ్చేశారు. కేరళలోని కొత్తట్టుకులంలోని దేవమాత ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఆస్పత్రి ప్రాంగణంలో ఉదయపు నడకకు ఒడిన్గా బయల్దేరగా గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే ఉన్న ఆయన కుమార్తె, సోదరి, వ్యక్తిగత వైద్యుడు, భారత, కెన్యా భద్రతాధికారులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు ధ్రువీకరించారు. గత 12 సంవత్సరాలుగా కెన్యా పార్లమెంట్లో విపక్షనేతగా కొనసాగుతున్న ఒడిన్గా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అజీమియో లా ఉమోజా(వన్ కెన్యా) కూటమి పార్టీకి సారథ్యంవహిస్తున్నారు. ఒడిన్గా మరణ వార్త తెల్సి కెన్యా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. దేశ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంచేసేందుకు అవిశ్రాంతంగా పోరాడిన తమ నేత లేడన్న వార్త తెలిసి నైరోబీలోని ఆయన సొంతింటికి జనం పోటెత్తారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సైతం ఒడిన్గా నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మరణం పట్ల భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ‘‘నిలువెత్తు దార్శనికుడు నేలకొరిగారు’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. కెన్యా ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన గొప్పనేత ఒడిన్గా అంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా, టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ సహా పలువురు ప్రపంచనేతలు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. కెన్నెత్ మతిబా తర్వాత బహుళ రాజకీయపార్టీల కెన్యా ప్రజాస్వామ్యంలో ఒడిన్గాను మరో జాతిపితగా పలువురు కొనియాడతారు. అత్యంత ప్రజాదరణ నేతగా పేరు ఇటీవలి దశాబ్దాల్లో ఒడిన్గా కెన్యా రాజకీయాల్లో ముఖ్యనేతగా ఎదిగారు. కెన్యా స్వాతంత్య్రం సాధించాక తొలి ఉపాధ్యక్షుడిగా సేవలందించిన జరమోగు అజుమా ఒడిన్గా కుమారుడే ఈ ఒడిన్గా. కెన్యాలోని కిసుము నగరంలో 1945 జనవరి 7న జన్మించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఈయన చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. జర్మనీలో ఇంజనీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు కెన్యా నాణ్యతా ప్రమాణాల సంస్థకు మేనేజర్‌గా పనిచేశారు. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అయితే కేంద్రప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై అరెస్టయి జైలు జీవితం గడిపారు. 1997లో తొలిసారిగా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత దేశబహిష్కరణకు గురై యూరప్‌లో గడిపారు. 1992లో స్వదేశానికి తిరిగొచ్చారు. తర్వాత సైతం నాలుగుసార్లు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చినా అధ్యక్ష పగ్గాలు చేపట్టలేకపోయారు. 2007లో స్వల్ప తేడాలో పదవి దక్కకపోవడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రోజుల తరబడి జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల మంది చనిపోయారు. కానీ ఈయనపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం విశేషం. ఘర్షణలు సద్దుమణిగాక 2008 నుంచి 2013దాకా కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా సేవలందించారు. యువకునిగా ఉన్నప్పుడు నైరోబీలోని గోర్ మహియా ఫుట్‌బాల్ క్లబ్ తరఫున కొంతకాలం ఫుట్‌బాల్ సైతం ఆడారు. -
పాక్, అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణ
ఇస్లామాబాద్: ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ జరిగింది. కాందహార్ ప్రావిన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పాక్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మంది సాధారణ పౌరులు మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 80 మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పాక్ దాడిలో దాదాపు 50 మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఘర్షణ నానాటికీ ముదురుతుండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది. అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా మధ్యవ ర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబన్లను ఒప్పించాలని కోరింది. పరస్పరం నిందలు పాక్, అఫ్గాన్ మధ్య గతవారం హింసాకాండ మొదలైంది. కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. డురాండ్ లైన్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చారు. 20 పాక్ సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశారు. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది. మంగళవారం రాత్రి తొలుత పాక్ జవాన్లే కాల్పులు జరిపారని, భారీ ఆయుధాలు ప్రయోగించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఆరోపించారు. తమ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని, పాక్ ఆయుధాలను, యుద్ధ ట్యాంక్‌లను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించా రు. అయితే, రెండు సరిహద్దు పోస్టులు సహా మొ త్తం నాలుగుచోట్ల తాలిబన్లు మొదట కాల్పులు జరిపారని, దాంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని పాకిస్తాన్ సైన్యం తెలియజేసింది. ఎదురుకాల్పుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని స్పష్టంచేసింది. స్పిన్ బోల్డాక్‌లో మరో 20 మంది మృతిచెందారని వివరించింది. తాలిబన్లకు సంబంధించిన 8 సైనిక పోస్టులు, 6 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు పేర్కొంది. తాలిబన్ల దాడిలో చమన్‌జిల్లాలో నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్ వెల్లడించింది. ఒరాక్జాయ్ జిల్లాలో ఆరుగురు పాక్ పారామిలటరీ సిబ్బంది మృతిచెందినట్లు తెలిసింది. ఇరువర్గాల కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గత పది రోజులుగా సరిహద్దు మార్గాలను అధికారులు మూసివేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. పాక్ రక్షణ శాఖ మంత్రి, ఐఎస్ఐ అధినేత, ఇద్దరు సైనికాధికారులకు వీసాలు ఇవ్వడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరించింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. దాంతో అఫ్గాన్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీరి్ణంచుకోలేకపోతోంది. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది.48 గంటల కాల్పుల విరమణ అఫ్గానిస్తాన్‌తో 48 గంటలపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టంచేశారు. -
వాళ్లు ఇస్తున్న సబ్సిడీలు అన్యాయం: భారత్‌పై చైనా ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాలలో భారత్ అందిస్తున్న సబ్సిడీలు (EV Battery Subsidies) దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభాన్ని కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చైనా (China) బుధవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసింది. చైనా చేసిన ఫిర్యాదు వివరాలను త్వరలో పరిశీలిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారత్ ‘ నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిసిన వెంటనే చైనా ఈ ఫిర్యాదు చేసింది. ఈ స్కీం లక్ష్యం అరుదైన భూ మూలకాలు (rare earth elements) వంటి కీలక ఖనిజాల లభ్యతను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఇతర గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు కీలకం కావటంతో, వాటి ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.ఇతర దేశాలపైనా..చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్‌తో పాటు తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఈ తరహా ఫిర్యాదులు డబ్ల్యూవో వద్ద నమోదయ్యాయి. డబ్ల్యూవో నిబంధనల ప్రకారం మొదటి దశలో చర్చల ద్వారానే వివాద పరిష్కారం వెతకాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతే, సమస్యపై తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.ఈ విషయంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చైనా సమర్పించిన వివరాలను త్వరలో అధ్యయనం చేస్తామని తెలిపారు. చర్చలతో పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఇక వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే 2023-24లో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
అమెరికాలో ఐదేళ్లలో 100 మందిపైగా భారత విద్యార్థుల మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. 40 కుటుంబాలకు సహాయం''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.జాగ్రత్తలు తప్పనిసరికాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్‌రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్‌నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.చెడు అలవాట్లతో..మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులుఅక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్‌పై కాల్పులు జరిపారు.జనవరి 20, 2025: హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్‌లోని న్యూ హెవెన్‌లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్‌లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. -
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణలు.. పలువురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది. తాజా ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులతో పాటు పౌరులు కూడా మృతిచెందారని ఇరువైపుల భద్రతా అధికారులు మీడియాకు తెలిపారు.కాందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డాక్‌లో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఆఫ్ఘన్ తాలిబాన్ వర్గాలు గస్తీ తిరుగుతున్నాయి. కాగా ప్రధాన సరిహద్దు పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేసిన రెండు దాడులను తిప్పికొట్టామని, దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లోని ఆఫ్ఘన్ వైపున ఉన్న స్పిన్ బోల్డాక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో దాదాపు 20 మంది తాలిబాన్ సభ్యులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. పౌర జనాభాను పట్టించుకోకుండా ఈ దాడి జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సైన్యంతో సరిహద్దులో రాత్రిపూట జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది మరణించారని తెలుస్తోంది.రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరిగిన తాజా హింసలో 15 మంది పౌరులు మృతి చెందారని సంబంధిత అధికారులు ఆఫ్ఘన్ వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు జిల్లా ఒరాక్జాయ్లో దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో ఆరుగురు పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని భద్రతా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొంది. కాగా తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ దళాలు భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత వారాంతంలో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.కాగా తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినప్పటికీ, మృతుల సంఖ్య 23 అని పాకిస్తాన్ తెలిపింది. ఎదురు కాల్పుల్లో 200 మందికి పైగా తాలిబాన్లను, అనుబంధ దళాలను అంతమొందించామని పేర్కొంది. ఈ ఉద్రిక్తతల మధ్య అక్టోబర్ 12 నుంచి ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ మధ్య సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. ఏఎప్పీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా జరిపిన మోర్టార్ కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించారని స్పిన్ బోల్డక్ ప్రాంతంలోని స్థానిక సమాచార విభాగం ప్రతినిధి అలీ మొహమ్మద్ హక్మల్ తెలిపారు. 80 మందికి పైగా మహిళలు, పిల్లలు గాయపడ్డారని స్పిన్ బోల్డక్ జిల్లా ఆసుపత్రి అధికారి అబ్దుల్ జాన్ బరాక్ మీడియాకు తెలిపారు. -
చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్‌ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్‌పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్‌లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్‌గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్‌కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్ ప్రత్యర్థుల ఊచకోత
గాజా: ఇజ్రాయెల్ బందీల విడుదల అనంతరం హమాస్ సాయుధ గ్రూపు చూపు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా ప్రాంతంపై పట్టు తిరిగి సాధించేందుకు విరోధి సాయుధ శ్రేణులను ఏరి పారేసే పనికి పూనుకుంది. ఈ పరిణామం అమెరికా మధ్యవర్తిత్వంతో నెలకొన్న కాల్పుల విరమణ మనుగడపై కొత్త అనుమానాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోష పడుతున్న పాలస్తీనియన్లను హమాస్ వైఖరి భయపెడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన 8 మందిని కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తమ్మీద 50 మందిని ఇప్పటి వరకు మట్టుబెట్టి ఉంటుందని వైనెట్ వార్తా సంస్థ తెలిపింది. అంతర్గత భద్రతను హమాస్ చూసుకుంటుందని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వ్యాఖ్యానించింది. కళ్లకు గంతలు కట్టి, బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను షఫఖ్ న్యూస్ ప్రసారం చేసింది.Hamas continues mass executing anyone it sees as a potential threat in Gaza. No trial, no judge, no jury. But yeah, sure, these are the “freedom fighters.” 🤨https://t.co/v8o5CGqild— The Persian Jewess (@persianjewess) October 15, 2025దీనిపై స్పందించిన హమాస్.. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించడంతోపాటు నేర కార్యకలాపాల్గో పాల్గొన్నందుకే వీరిని శిక్షించామని తెలిపింది. అయితే, హమాస్ చర్యలు గాజాలోని డొగ్‌ముష్ వంటి గ్రూపులతో హింసాత్మక ఘర్షణలకు దారి తీస్తున్నాయి. డొగ్‌ముష్ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్ముష్కు చెందిన 52 మంది చనిపోయారని వైనెట్ పేర్కొంది. ఈ పోరులో 12 మంది హమాస్ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ సీనియర్ నేత బస్సెమ్ నయీమ్ కుమారుడు కూడా ఉన్నట్లు వైనెట్ పేర్కొంది. ప్రత్యర్థుల ప్రాంతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్సుల్లో వెళ్లిన హమాస్ శ్రేణులు శత్రు సంహారం చేస్తున్నారని తెలిపింది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్‌పై విమర్శలు వస్తున్నాయి.కొన్ని గ్రూపులకు ఇజ్రాయెల్ సాయంఅత్యంత అధునాతన, భారీ ఆయుధాలు కలిగిన డొగ్ముష్కు ఎప్పట్నుంచో హమాస్‌తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యాసెర్ అబూ షబాబ్ సారథ్యంలోని గ్రూపు సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఇటీవల హమాస్ శ్రేణులు యాసెర్ అబూ షబాబ్ సన్నిహితుడొకరిని చంపేసినట్లు ప్రకటించుకున్నాయి. షబాబ్‌ను వదిలేది లేదని కూడా తెలిపాయి.@DonaldTrump @SecRubio @HowardLutnik32 @StephenM @jaredkushner This isn’t October 7 - it’s from the past few hours. Hamas is parading through Gaza, showing off the bodies of the many people they’ve executed since the ceasefire. pic.twitter.com/oWffZUI0g2— Flor (@HeavensFlor) October 15, 2025హమాస్‌లోని యారో యూనిట్ హింసాత్మక ప్రతీకార చర్యల్లో ఆరితేరిందని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లూ సొరంగాల్లో రహస్యంగా నక్కుతూ పనిచేసిన హమాస్ సాయుధులు ఇప్పుడు తమ శత్రువుల అంతం చూసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం హమాస్ లేనట్లు కనిపిస్తోందంటున్నారు. ‘ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చలు ప్రారంభమయ్యేటప్పటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది’అని విశ్లేషకులు అంటున్నారు. -
ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్‌కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైమ్ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్‌పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్‌ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా? -
ఇక నేనే అధ్యక్షుడిని
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్‌లో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. జెన్ జెడ్ యువత నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెల్సిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్‌లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయరేడియోలో ప్రకటించడం తెల్సిందే. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్‌జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
సూపర్‌వుడ్ !
వాషింగ్టన్: ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన చెక్కను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయ వంతంగా సృష్టించింది. దీనికి సూపర్‌వుడ్(Superwood) అని పేరుపెట్టింది. సాధారణ కలపనే రసాయన చర్యకు గురిచేసి అత్యంత పటిష్టమైన, కఠిన కలపగా రూపాంతరం చెందించారు. మౌలిక వసతుల రంగంలో నాణ్యమైన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మన్నికైన కలపకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్‌ను తలదన్నేలా కలపను సృష్టించి అమెరికా శాస్త్రవేత్తలు ఔరా అనిపించారు. ఈ బృందానికి ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ నిపుణుడు లియాంగ్బింగ్ హూ సారథ్యం వహించారు.ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చెట్టు కలపకు పటిష్టతను, రంగును ఇచ్చే లింగ్నిన్ అనే పదార్థాన్ని కలప నుంచి తొలగించి ఆ చెక్కకు చెక్కుచెదరని పటిష్టతను ఆయన ఆపాదించగలిగారు. ఇందుకోసం హూ బృందం వినూత్నమైన పద్ధతిని అవలంభించింది. సహజ కలప చెక్క నుంచి లింగ్నిన్, హెమీ సెల్యూలోజ్లను తొలగించేందుకు ఆ చెక్కలను తొలుత సోడియం హైడ్రాక్సైడ్, సోడియా సల్ఫేట్ ద్రావకంలో ఉడకబెట్టారు. తర్వాత అదే వేడిమీద చెక్కలను సమతల పరికరంతో గట్టిగా అదిమారు.దీంతో కలపలోని కణాల సవ్యఅమరిక ధ్వంసమై అన్నీ ఒక్కదగ్గరకు చేరిపోయాయి. దీంతో సెల్యూలోజ్ నానోకణాలు చిక్కగా ఒకే దగ్గరకు చేరి కలప ఉక్కులాగా గట్టిపడింది. ఇది ఏకంగా స్టీల్ కంటే 10 రెట్లు గట్టిగా ఉన్నట్లు పలు పరీక్షల్లో నిర్ధారణ అయింది. తేమను తట్టుకుంటూ సులువుగా విరిగిపోకుండా చెక్క మరింత దృఢత్వాన్ని సంతరించుకుంది. ఈ చెక్క బరువు సైతం సాధారణ చెక్క బరువులో ఆరోవంతే ఉండటం విశేషం. తక్కువ బరువు ఉండటంతో భూకంపాల వంటి సందర్భాల్లో ఈ చెక్కతో నిర్మించిన ఇళ్లు అంత త్వరగా కంపనాలకు గురికావు.అత్యంత తేలికగా ఉండటంతో నిర్మాణంలో ఉపయోగించడం సైతం చాలా సులువు. ఇల్లు, కార్యాలయాల ఫర్నిచర్, ఇంటీరియల్ పనుల్లో రెండు సాధారణ చెక్కలు నట్లు, బోల్ట్‌లతో జతచేసినప్పుడు అవి త్వరగా పాడవుతుంటాయి. ఈ సమస్యకు ఈ కొత్తతరహా కలపతో చెక్ పెట్టొచ్చని కంపెనీ చెబుతోంది. సూపర్‌వుడ్ పేరిట ఈ చెక్కను అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఫ్రెడెరిక్ ప్రాంతంలో వాణిజ్యపరంగా తయారుచేయనున్నారు. హూ సహ వ్యవస్థాపకునిగా ఉన్న ఇన్వెంట్‌వుడ్ అనే సంస్థ ఈ కలపను తయారుచేయనుంది.సాధారణ కలప కంటే 20 రెట్లు శక్తివంతంలియాంగ్బింగ్ హూ పదేళ్ల క్రితమే ఇలా పటిష్టమైన చెక్క కోసం ప్రయోగాలు మొదలెట్టారు. ‘‘భూమిపై అత్యధికంగా లభ్యమయ్యే సహజ పాలిమర్‌గా సెల్యూలోజ్ను చెప్పొచ్చు. ఇది కలపలో మెండుగా ఉంటుంది. దీని సాయంతో ఉక్కులాంటి చెక్కను తయారు చేయాలని గతంలోనే భావించా. 2017లోనే ఈ తరహా ప్రయోగం చేశా. ఇన్నాళ్లకు వాణిజ్యపర ఉత్పత్తికి సిద్దమయ్యాం’’ అని హూ చెప్పారు. -
మీ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి
న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు. పలు రంగాల్లో పరస్పర సహకారంఈ సందర్భంగా ఉఖ్నా భారత్‌ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్ అప్పగించనుంది. గందన్ బౌద్ధారామానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్‌ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి. -
పాపం మెలోనీ! అటు ట్రంప్.. ఇటు ఎర్డోగాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. Trump to Giorgia Meloni:“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. Erdogan to Meloni in Cairo:“You look great but I have to get you to stop smoking”🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌తో కలిసి స్మోక్కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్ -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన ట్రంప్.. పాక్‌తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిఫ్ట్ శర్మ్ ఎల్-షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు Gaza Peace Summit 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఆ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప దేశం. అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే.. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ ‘అంతే కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయిందేమో.. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో.. పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు.. Trump: "I think Pakistan and India are gonna live very NICELY together"Turns to Shehbaz Sharif: ‘Right?’Look at Chatukar's big smile. He still thinks this Joker Trump can save him when Bharat goes for the DECISIVE one?Anyway, let both of them happy 'TILL THEN'! pic.twitter.com/qlhS55S3GY— BhikuMhatre (@MumbaichaDon) October 13, 2025 షెహ్బాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్ భజనకే పరిమితం అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ రెండూ అణు శక్తులు. ఈ వ్యక్తి (ట్రంప్) మరియు ఆయన బృందం నాలుగు రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోయుంటే, యుద్ధం ఎవరికీ చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేది అని అన్నారు. ఆయన ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపారని, ఇవాళ ఎనిమిదోది(గాజా సంక్షోభం గురించి) ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నా అనడంతో.. వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకుని.. రకరకాల హవభావాలతో ‘ఇవేం పొగడ్తలు’ అన్నట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. వెనుకనే నోటిమీద చేయి వేసుకొని చూస్తుండిపోయారామె. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Pakistan's Prime Minister Shehbaz Sharif calls for Donald Trump to receive the Nobel Peace Prize: "Mr. President, I would like to salute you for your exemplary leadership. Visionary leadership." "I think you are the man that this world needed most at this point in time. The… pic.twitter.com/QXVOxszZx7— Mary Margaret Olohan (@MaryMargOlohan) October 13, 2025మరోవైపు.. ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని మోదీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానం అందించారు. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను కలిసి.. శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం చేశారాయన. ఈ విషయాన్ని విదేశాంగ ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అధికారికంగా ధృవీకరించారు. తన చొరవ వల్లే పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయంటూ ట్రంప్ మే 10వ తేదీ నుంచి నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రసంగంలోనూ ప్రస్తావించడం తెలిసిందే. -
యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్తూ తన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్లు అందజేస్తాను. తొమహాక్లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఏమిటి తొమహాక్ల ప్రత్యేకత? తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్‌సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది. 1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు. -
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్‌హోల్‌లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్‌బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్‌బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్‌కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్‌లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్‌మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్‌కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్‌మ్యాప్‌పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
అవధుల్లేని ఆనందం
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది. ఓమ్రీని వీడియోకాల్‌లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్‌లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి. ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంగాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్‌ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు. -
కాబోయే వాడు హగ్ చేసుకున్నాడని రూ. 3.73లక్షల డిమాండ్..!
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికొడుకు-పెళ్లికూతరు(పెళ్లికి ముందే) ప్రీ వెడ్డింగ్ షూట్లో మెరిసి మురిసిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇదంతా ఇలా ఉంచితే, ప్రీ వెడ్డింగ్ షూట్లో అమ్మాయిని అబ్బాయి హగ్ చేసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అటు పెళ్లి క్యాన్సల్ కావడం ఒకటైతే, తనను హగ్ చేసుకున్నందుకు మూడు లక్షల డబ్బై ఐదు వేలు రూపాయిలు ఇవ్వాలని అమ్మాయి డిమాండ్ చేస్తోంది. చైనాలో చేసుకున్న ఈ ఘటన వైరల్‌గా మారింది. వీరి నిశ్చితార్థం జనవరిలో జరగ్గా, నవంబర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఒక హోటల్ తీసుకుని మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయి ముందుండి, అబ్బాయి వెనుక ఉండే ఫోటో తీసే సందర్భంలో హగ్ చేసుకోమన్నాడు ఫోటో గ్రాఫర్. దాంతో నిశ్చితార్థ పెళ్లి కొడుకు ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ అమ్మాయి తెగేసి చెప్పేసింది. ఇలా హగ్ చేసుకోవడం ఏంటని పాత సంప్రదాయాన్ని తిరగతోడింది. తాము నిశ్చితార్థం చేసుకోవడానికి ఖర్చులు అయినందున రూ. 3.73 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయికి నిశ్చితార్థంలో అబ్బాయి కుటుంబం వారు 200,000 యువాన్లు(రూ. 25 లక్షలు) బహుమతిగా ఇవ్వడానికి అంగీకరించి అది కాస్తా ఇచ్చేశారు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ కావడంతో 30,000 యువాన్లు(రూ. 3.73 లక్షలు ) కట్ చేసి మిగతా అమౌంట్‌ను తిరిగి ఇచ్చేసింది. ఇలా ఎందుకు కట్ చేసారని అడిగితే.. అబ్బాయి హగ్ చేసుకున్నందుకు అని ఆమె సమాధానం చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు ఆ సంబంధం కుదిర్చిన మధ్యవర్తి. తాను వెయ్యికిపైగా పెళ్లిల్లు చేశానని, ఈ అమ్మాయి మాత్రం చాలా భిన్నంగా ఉందన్నాడు. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత మొత్తం తిరిగి ఇవ్వకుండా ఇలా కట్ చేసుకుని మిగతా 170,500 యువాన్లు(సుమారు రూ. 21లక్షలు) మాత్రమే తిరిగి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏమీ కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా డిమాండ్ పేరుతో సుమారు నాలుగు లక్షల రూపాయిలు కట్ చేసుకోవడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు ‘పెళ్లిళ్ల పేరయ్య’.ఇదీ చదవండి: ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ -
ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ
ఇజ్రాయిల్-హమాస్‌ల మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా నిరసన సెగ ఎదురైంది. ట్రంప్ ప్రసంగించే సమయంలో ఇద్దరు ఎంపీలు ట్రంప్ ప్రసంగానికి అడ్డుతగిలారు. స్లోగాన్స్తో ట్రంప్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. ఇలా ట్రంప్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడటంతో ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి వారిని మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లిపోయారు. 2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ కిడ్నాప్ చేయబడినప్పటి నుండి వారు బందీలుగా పట్టుకున్న చివరి సజీవ బందీలను ఇజ్రాయెల్‌కు తిరిగి పంపడాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. హమాస్‌తో తొలి దశ ఒప్పందంలోని ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
సృజనాత్మక ప్రగతికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే, అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే ‘సృజనాత్మక విధ్వంసం’ భావనను మరింత ప్రభావవంతంగా వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు 2025 ఏడాదికిగాను ఆర్థిక నోబెల్ పురస్కారం దక్కింది. సోమవారం నోబెల్ కమిటీ ఆర్థికవేత్తలు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్‌లకు 2025 ఏడాదికి ఎకనమిక్స్ నోబెల్‌ను ప్రకటించింది. ‘‘కొత్త ఉత్పత్తులు, తయారీ విధానాలకు కొత్త ఆవిష్కరణలు ఏ రకంగా దోహదపడతాయనేది ఈ ముగ్గురు వివరించారు. ఆర్థిక స్తబ్దత అనేది ఎప్పుడైనా జరగొచ్చు. దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వీళ్లు సోదాహరణంగా హెచ్చరించారు’’ అని ఆర్థికశాస్త్ర నోబెల్ కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ కొనియాడారు. ముగ్గురికీ సంయుక్తంగా దాదాపు రూ.10.63 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. ఇందులో సగభాగాన్ని డచ్ ఆర్థికవేత్త మోకిర్ అందుకోనున్నారు. మిగతా సగాన్ని ఫిలిప్, పీటర్ పంచుకోనున్నారు. ముగ్గురికీ విడివిడిగా 18 క్యారెట్ల విలువైన బంగారు నోబెల్ మెడల్‌ను మెడలో వేయనున్నారు. కృత్రిమమేధతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందన్న అంచనాల మధ్య క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంత విశ్లేషకులకు ఆర్థిక నోబెల్ దక్కడం విశేషం. ఏమిటీ పరిశోధన? ‘‘పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్త ఆవిష్కరణలు భర్తీచేస్తున్నప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక్కటి పరిశీలిస్తే సరిపోదు. అసలు ఆ కొత్త ఆవిష్కరణ ఏ రకంగా విజయం సాధిస్తుందనేది శాస్త్రీయంగా అర్థంచేసుకోగలగాలి. దీనిని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చక్కగా వివరించారు’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. ప్రత్యామ్నాయంగా కొత్త సాంకేతికతలు రావడంతో పాతవి కనుమరుగవుతాయి. ఒకరకంగా పాత ఆవిష్కరణలను మనుగడలో లేకుండా కొత్తవి నాశనంచేస్తాయి. ఈ ఆర్థిక భావనను ‘సృజనాత్మక విధ్వంసం’ అంటారు. ఈ భావనను అమెరికా, ఇజ్రాయెల్ మూలాలున్న నెదర్లాండ్స్ ఆర్థిక చరిత్రకారుడు జోయెల్ మోకిర్ తనదైన శైలిలో వివరించారు. ఇందుకోసం పాత ఆర్థికశాస్త్ర పుస్తకాలను తిరగేశారు. 79 ఏళ్ల మోకిర్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీలో ఆర్థిక పరిశోధనలు చేస్తున్నారు. ఇదే భావనను ఫ్రాన్స్‌లో జని్మంచిన ఆర్థికవేత్త ఫిలిప్ అఘియన్, కెనడాలో జని్మంచిన ఆర్థికవేత్త పీటర్ విలి్కన్సన్ హోవిట్ సైతం గణిత సిద్ధాంతాలతో వివరించారు. 69 ఏళ్ల అఘియన్ ప్రస్తుతం పారిస్‌లోని కాలేజ్ ది ఫ్రాన్స్‌లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 79 ఏళ్ల హోవిట్ ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఆర్థికనోబెల్కు ఎంపికైన విషయం తెల్సి ఆర్థికవేత్త మోకిర్ షాక్‌కు గురయ్యారు. ‘‘ఏదైనా అనూహ్యమైనది సాధించినప్పుడు షాక్‌లో ఉన్నామని చాలా మంది చెబుతుంటారు. అది నిజంగా నిజం. నేనిప్పుడు అదే అనుభూతిని పొందా. నోబెల్ గెల్చుకుంటానని అస్సలు అనుకోలేదు. నిజానికి మీకు నోబెల్ రావొచ్చని నా విద్యార్థులు చెప్పారు. వాళ్లతో ఒక్కటే చెప్పా. వస్తే నాకు పోప్ పదవి రావొచ్చుగానీ నోబెల్ రాదని చెప్పా’’ అని మోకిర్ సరదాగా మాట్లాడారు. ‘‘ఈ వేసవికాలానికి నాకు 80 ఏళ్లు నిండుతాయి. అయినా నా వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకోను. ఆర్థికవేత్తగా జీవితాంతం కొనసాగాలన్నదే నా కల’’ అని ఆయన అన్నారు. నజరానాను పరిశోధనకు కేటాయిస్తా.. నోబెల్ గెల్చుకోవడంపై ఆర్థికవేత్త అఘియన్ స్పందించారు. ‘‘ఈ అనుభూతిని వరి్ణంచడానికి నాకు మాటలు రావట్లేదు. ప్రైజ్‌మనీగా నాకు దక్కే నగదును మళ్లీ ఆర్థికశాస్త్ర పరిశోధనల కోసమే ఖర్చుచేస్తా. అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ మేధావులను రానీయకుండా అడ్డుకుంటోంది. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, రక్షణాత్మకత ధోరణి చాలా తప్పు. ఇది ప్రపంచ ఆర్థిక ప్రగతికి, ఆవిష్కరణలకు విఘాతంగా మారనుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ భావన ఎప్పటిది? క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది దశాబ్దాలనాటి పాత సిద్ధాంతం. ఈ భావనను ఆర్థికవేత్త జోసెఫ్ షుమ్పీటర్ ప్రతిపాదించారు. ఆయన 1942లో రచించిన తన ‘పెట్టుబడిదారీవిధానం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం’ పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా పేర్కొన్నారు. ఈ సృజనాత్మక విధ్వంసం భావనను తమదైన రీతిలో వివరించేందుకు అఘియన్, హోవిట్లు 1992లో ఒక గణితశాస్త్ర మోడల్‌ను అభివృద్ధిచేశారు. అఘియన్ 2017లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆర్థిక పథకానికి సైతం తుదిరూపుని చ్చారు. కృత్రిమమేధ రంగంలో ఫ్రాన్స్‌లో అగ్రగామిగా మార్చాలంటే ఏ రకమైన విధానాలను అవలంభించాలో తెలుపుతూ 25 ప్రతిపాదనలను మేక్రాన్‌కు అఘియన్ అందజేశారు. ‘‘ఆర్థిక ప్రగతిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకూడదు. అది ఎందుకు సాధ్యమైందో అర్థంచేసుకుని ముందుకు సాగాలి. లేదంటే సంక్షోభంలో చిక్కుకుపోతాం’’ అని జాన్ హాస్లర్ వ్యాఖ్యానించారు. -
ఇజ్రాయెల్‌లో సంబరాలు.. హమాస్ నుంచి బందీల విడుదల
జెరూసలేం: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలివిడతలో తాజాగా ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్.. రెడ్ క్రాస్‌కు అప్పగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మిగిలిన వారిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఖాన్ యూనిస్‌కు చేరుకుంది.ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు.. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదల అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. హమాస్‌పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబురాలు జరుపుకుంటున్నారు. Prime Minister Netanyahu is receiving real-time updates on the ongoing release of the hostages and is in continuous contact with hostage affairs coordinator Gal Hirsch. pic.twitter.com/JRAnwOXTK9— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) October 13, 2025 Fantastisch nieuws.Eerste gijzelaars vrijgelaten.Uit de handen van de islamitische terreurbeweging Hamas.Na twee lange jaren weer vrij.Terug naar hun geliefden en familie in Israël!❤️#HostageRelease #Israel pic.twitter.com/VT7EXuFekX— Geert Wilders (@geertwilderspvv) October 13, 2025ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్ అపహరించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.#BREAKING: First Israeli hostages to be released by Hamas at the Re'im base are Alon Ohel, Matan Angrest, brothers Gali and Ziv Berman, Eitan Mor and Omri Miren. #HostageRelease #Israel #Gaza pic.twitter.com/JCci4e7rJQ— OSINT Spectator (@osint1117) October 13, 2025ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ⚡️BREAKING:Seven Israeli hostages have been handed over to the Red Cross as part of the ongoing peace agreement between Israel and Hamas.#BreakingNews #HostageRelease #Gaza #RedCross #PeaceDeal pic.twitter.com/BiJrOUOBmn— Tabish Rahman (@Tabishtabi11) October 13, 2025In Israel tens of thousands are already out in the streets to experience the return of the hostages, together. pic.twitter.com/Dc36YuGmzO— Israel News Pulse (@israelnewspulse) October 13, 2025 -
ట్రంప్ లూప్ ఆగట్లే.. నెక్స్ట్ ఆపేది ఆ యుద్ధమేనంట!
ప్రపంచ శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ ఫలితం తనను కుంగదీయబోదని, శాంతిని నెలకొల్పాలన్న తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపబోదని అంటున్నారాయన. తాజాగా ఆయన మరో యుద్ధంపై కన్నేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, ఈజిప్ట్‌లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. , యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై(Pak Afghan Clashes) ఉందని అన్నారు.ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు. అయితే తన శాంతి ప్రయత్నాలు అవార్డులను తేలేకపోయినా(నోబెల్‌ను ఉద్దేశించి..) ప్రాణాలను నిలబెడుతోందని, అది తనకెంతో గౌరవాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారాయన.ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా పర్యటనకు బయల్దేరే ముందు కూడా ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు(Trump On India Pak Tensions). భారత్-పాక్ మధ్య యుద్ధం టారిఫ్‌ల బెదిరింపులతోనే ఆగిందని పునరుద్ఘాటించారు. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఓసారి ఆలోచించండి. కొన్ని యుద్ధాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది మరణించారు. నేను వాటిని ఒక్క రోజులోనే ముగించాను. అది గొప్ప విషయం’’ అని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. దౌత్యంతో ప్రయత్నిద్దామనుకుంటే మాట వింటారా?. అందుకే సుంకాలు విధిస్తా అని బెదిరించా. 24 గంటలు గడవకముందే దెబ్బకు దిగొచ్చారు. లేకుంటే యుద్ధం ఆగి ఉండేదా? అని మే నెలలో జరిగిన భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్.. ఈ కాల్పుల విమరణలో మూడో దేశం, వ్యక్తి.. ప్రేమయం లేదని, పాక్ కోరితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది. ఇదీ చదవండి: తాలిబన్ల దెబ్బ.. పాక్‌కు భారీ నష్టం -
తుపాను బీభత్సం.. 44 మరణాలు.. మేయర్‌పై దాడికి యత్నం
పొజారికా: మెక్సికోలో మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వెరాక్రుజ్ రాష్ట్రంలో ఈ నెల 6–9 తేదీల మధ్యలో అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో, కజొనెస్ నది పొంగి ప్రవహించింది. శుక్రవారం వేకువజామున పొజారికా వీధుల్లో నాలుగు మీటర్ల మేర వరద ప్రవహించింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను బీభత్సం కారణంగా పొజారికాలో ప్రజలు బురద నీటిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని పరిశీలించేందుకు అక్కడికి వచ్చిన మేయర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆగ్రహంతో స్థానికులు.. మేయర్ వాహనంపై రాళ్లు రువ్వి, బురద చల్లారు. విపత్తు సమయంలో ముందస్తుగా తమను ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#Internacionales | 🇲🇽 Vecinos de Poza Rica, México, arremetieron con piedras y reclamos contra el alcalde por las inundaciones tras no alertar a la población sobre la creciente del río Cazones.Video: Cortesía. pic.twitter.com/lOgmdbUf0I— #ÚltimaHora (@ultimahsv) October 13, 2025 మరోవైపు.. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగింది. దీంతో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల గవర్నర్లను సమావేశపరిచి అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను నిర్దేశించారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.🚨 BREAKING: HERE WE GO AGAIN: MASSIVE FLOODING UNFOLDING IN RUIDOSO, NEW MEXICOWater levels surged 20 FEET in just 30 minutes, shattering records.Flash flood warnings are active. Burn scar zones are fueling the chaos.pic.twitter.com/7paFApY4P9— HustleBitch (@HustleBitch_) July 8, 2025 #Internacionales | 🇲🇽🚨 Las lluvias dejaron grandes afectaciones en Veracruz, México, mientras ciudadanos reclaman por el abandono del gobierno. Video: Cortesía. pic.twitter.com/xofN5YtbWr— #ÚltimaHora (@ultimahsv) October 13, 2025Heavy rainfall causes MASS flooding in Mexico, with rescue operations underwayReports claim 27 DEAD as a result of of severe weather conditions pic.twitter.com/yZ3oTokStL— RT (@RT_com) October 11, 2025🚨 No están solos. Estamos en #Veracruz, donde las lluvias han golpeado fuerte… pero la ayuda ya se está brindando. pic.twitter.com/YXShKOKlW3— Cruz Roja Mexicana IAP (@CruzRoja_MX) October 12, 2025 -
పశ్చిమాసియాకు ట్రంప్.. భారత్ తరఫున కీర్తివర్దన్‌సింగ్
గాజా యుద్ధాన్ని ముగించానన్న జోష్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. తొలుత ఇజ్రాయెల్‌లో పర్యటించి.. అక్కడి నుంచి ఈజిప్ట్‌లో జరగబోయే అత్యున్నతస్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ పర్యటన కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఎయిర్‌పోర్టులో రాయిటర్స్‌తో మాట్లాడారు. గాజా యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఆయన.. విషయం అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. అతిత్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా.. తొలుత ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్(Trump In Israel Parliament)లో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశంలో పర్యటించిన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. అటు నుంచి ఆయన ఈజిప్ట్‌కు వెళ్లి.. శర్మ్ ఎల్-షేక్ నగరంలో అత్యున్నత స్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణలో ఖతార్ దేశ మధ్యవర్తిత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చక్కగా పని చేశారని ప్రశంసించారు. బంధీల విడుదల కూడా ఊహించిన దానికంటే ముందే జరగొచ్చని, ధ్వంసమైన గాజాను బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పునర్విర్మిస్తామని అన్నారాయన. యూదులు, ముస్లింలు, అరబ్ దేశాలు.. అంతా సంతోషంగా ఉన్నారని అన్నారాయన. గాజా శాంతి సదస్సుఇదిలా ఉంటే.. ఇవాళ శర్మ్ ఎల్-షేక్ నగరం(Sharm El-Sheikh Summit)లో జరగనున్న సదస్సుకి 20కి పైగా ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసి సంయుక్త అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. శాంతి ఒప్పందానికి రూపకల్పన చేయడం, గాజా పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఈ సదస్సు జరగనుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించింది. అయితే ఆయన తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్దన్‌సింగ్ హాజరు కానున్నారు. బందీల విడుదల.. నేడేదాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది. గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ బలగాలు, హమాస్ మధ్య ఆదివారం వరకు కాల్పుల విరమణ కొనసాగింది. సోమవారం ఉదయం 20 మంది బంధీలు విడుదలవుతారని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి షోష్ బెడ్రోసియన్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం.. హమాస్ మొత్తం బంధీలను మధ్యాహ్నం 12 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ 250 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. అయితే హమాస్ సీనియర్ కమాండర్లను మాత్రం విడుదల చేయడం లేదని తెలుస్తోంది. అయితే.. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి బంధించిన మరో 1,700 పాలస్తీనా పౌరుల్ని(ఇందులో 22 మైనర్లు, 360 మిలిటెంట్ల మృతదేహాలు కూడా ఉన్నాయి) విడుదల చేయనున్నటలు ఇజ్రాయెల్ ధృవీకరించింది.తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్‌పై విజయం సాధించాం అని ప్రకటించారాయన. అయితే.. భద్రతా సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోంOperation Returning Home’ చేపట్టాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో 1,200 మంది మరణించారు. ఆపై 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించడంతో గాజా సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. ఇదీ చదవండి: సైనిక తిరుగుబాటుతో అట్టుడికిన మడగాస్కర్! -
150 ఏళ్లు బతకడం సైన్స్ ఫిక్షన్ కాదు
మాస్కో: వందేళ్లు హాయిగా జీవించిన వ్యక్తులను పూర్ణాయుశ్కులు అంటుంటాం. అయితే అంతకంటే మరో 50 ఏళ్లు ఎక్కువే జీవించగల ఎంతో మంది వ్యక్తులు మన మధ్యే ఉన్నారని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్ వ్యాఖ్యానించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న ఈయన ఈయన తాజాగా వైద్య, ఆరోగ్య సంబంధ విషయాలను వివరించే బయోపాలిటిక్స్ ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వృద్దాప్య ఛాయల్లోకి పడిపోవడం ఇటీవల తగ్గింది. 150 ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానేకాదు. 150 ఏళ్లు జీవించగల సత్తా ఉన్న మనుషులెందరో ఇటీవల పుట్టారు. వాళ్లలో కొందరు ఇప్పుడు 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల వయసులో ఉన్నారు. వృద్దాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. వృద్దాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన. 150 ఏళ్లు పైబడిన తర్వాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయి’’అని ఆయన అన్నారు. గత నెలలో బీజింగ్‌లోని తియాన్మెన్స్కే్వర్లో జరిగిన చైనా సైనిక పరేడ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యే అచ్చం ఇలాంటి అంశంపైనే మాటామంతీ జరగడం తెల్సిందే. ‘‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మారి్పడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’’అని జిన్‌పింగ్‌తో పుతిన్ వ్యాఖ్యానించడం తెల్సిందే. -
శాంతి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని బదులు మంత్రి కేవీ సింగ్
న్యూఢిల్లీ: ఈజిప్టులోని ఎర్ర సముద్ర తీర నగరం షర్మ్ ఎల్ షేక్‌లో సోమవారం జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సు(పీస్ సమిట్)కు మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 20కి పైగా దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశానికి రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి ప్రధాని మోదీకి ఆదివారం ఆహ్వానం పంపించారు. అయితే, ఆయన తన బదులుగా మంత్రి కేవీ సింగ్‌ను పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాతోపాటు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప డమే లక్ష్యంగా జరిగే కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షు డు ఎల్ సిసి, ట్రంప్ సహాధ్యక్షత వహించనున్నారు. గాజా శాంతి ఒప్పందంపై ఈ సందర్భంగా సంతకాలు జరుగుతాయి. శిఖరా గ్రానికి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్, యూకే ప్రధాని స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితర నేతలు హాజరవ నున్నారు.బాంబు పేల్చిన హమాస్అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలుపై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆదివారం హమాస్ చేసిన ప్రకటనే ఇందుకు తాజా ఉదాహరణ. సోమవారం ఈజిప్టులో జరిగే శాంతి శిఖరాగ్రాన్ని తాము బహిష్కరిస్తున్నామని హమాస్ తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై తాము సంతకం చేసేది లేదని స్పష్టం చేసింది. -
శాంతియుత పరిష్కారం కావాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం. అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్‌లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు. -
ఉద్రిక్తంగా పాక్–అఫ్గాన్ పోరు
ఇస్లామాబాద్/పెషావర్: తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. 200 మందికిపైగా తాలిబాన్ ఫైటర్లను అంతంచేశామని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం ప్రకటించగా తాము 58 మంది పాక్ సైనికులను చంపేశామని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను సైతం దాడులను ధ్వంసంచేశామని అఫ్గాన్ సర్కార్ వెల్లడించింది. తమ దాడుల ధాటికి 30 మంది పాక్ సైనికులు రక్తమోడారని వెల్లడించింది. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ మాట్లాడారు. ‘‘ మా అఫ్గాన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌లో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ముఖ్యులను మాకు అప్పగించాలి. ఐఎస్గ్రూప్ ఒక్క అఫ్గానిస్తాన్‌కే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పు’’ అని ముజాహిద్ అన్నారు. సరిహద్దు వెంట కాల్పుల మోత‘ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ పరిధిలోని బరా మ్చాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, డిర్, చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్ట్ లపై మా బలగాలు దాడులుచేశాయి. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ పోస్ట్‌లపై తెగబడి పలువురు పాక్ సైనికులను చంపేశాం’ అని ముజాహిద్ వివరించారు. -
మడగాస్కర్‌లో సైనిక తిరుగుబాటు
అంటాననరివో: ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లో మరోసారి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా ప్రకటించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే ప్రయత్నా లను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. సైనిక బలగాలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. తాను దేశంలోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని రజొలినా కూడా ప్రకటించారు. రజొలినా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జెన్ జెడ్ మడగాస్కర్ పేరుతో యువత ఆందోళనలు సాగిస్తోంది. శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది. ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్శాట్ అనే యూనిట్ కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జాడలు లేవు. రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. తిరుగుబాటుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారు..వంటి విషయాలను అధ్యక్షుడు రజొలినా వెల్లడించలేదు. -
సాయం పంపిణీకి ఏర్పాట్లు
కైరో: కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పాలస్తీనియన్లకు తక్షణ మానవతా సాయం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఒప్పందం ప్రకారం రోజుకు 600 ట్రక్కుల సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన పర్యవేక్షణాధికారి ఒకరు తెలిపారు. ఆదివారం తాము 400 ట్రక్కుల ఆహార పదార్థాలను పంపించనున్నట్లు ఈజిప్టు ప్రకటించింది. కెరెమ్ షలోమ్ వద్ద ఇజ్రాయెల్ అధికారులు తనిఖీలు జరిపాక, ఇవి గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ మీదుగా గాజాలోకి పదుల సంఖ్యలో ట్రక్కులు ప్రవేశిస్తున్న ఫుటేజీ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రక్కుల్లో టెంట్లు, దుప్పట్లు, ఆహారం, ఇంధనం, వైద్య సాయం ఉన్నాయని ఈజిప్టు రెడ్ క్రీసెంట్ తెలిపింది. నెలలపాటు కొనసాగిన ఇజ్రాయెల్ దిగ్బంధనం ఫలితంగా గాజాలో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. యుద్ధం సమయంలో అవసరమైన సాయంలో 20 శాతం మేర మాత్రమే సరఫరా చేయగలిగామని ఐరాస తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం, మందులు, ఇతర మానవీయ సాయం సిద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ ఓకే చెప్పిన వెంటనే గాజాలోకి వీటిని పంపుతామంది.బందీలు, ఖైదీల విడుదలకు ఏర్పాట్లుగాజాలో హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న వందలాది పాలస్తీనా ఖైదీల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి బందీల విడుదల మొదలవుతుందని ఈ వ్యవహారాలను పర్యవేక్షించే ఇజ్రాయెల్ అధికారి గాల్ హిర్‡్ష చెప్పారు. సజీవంగా ఉన్న వారి కోసం ఆస్పత్రులతోపాటు రెయిమ్ క్యాంపులో ఏర్పాట్లు చేశామన్నారు. మృతదేహాలను తమకు అప్పగించిన వెంటనే గుర్తింపు కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలించనున్నట్లు చెప్పారు. హమాస్ చెరలో ఉన్న 48 మందిలో కనీసం 20 మంది సజీవంగా ఉండొచ్చని అంటున్నారు. ఇలా ఉండగా, తమ జైళ్ల నుంచి 2 వేల మంది పాలస్తీనా ఖైదీల విడుదల సమయాన్ని ఇజ్రాయెల్ ఇంకా ప్రకటించలేదు. వీరిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మందితోపాటు, యుద్ధ సమయంలో గాజా నుంచి ఎలాంటి కారణం చూపకుండా ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకెళ్లిన మరో 1,700 మంది ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌కు ట్రంప్ రాకబందీలను విడుదల చేయనుండటంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అన్నీ తానై వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ రానున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో జరిగే కార్యక్రమంలో బందీల కుటుంబాలతో ఆయన మాట్లాడుతారని వైట్‌హౌస్ తెలిపింది. అనంతరం ఈజిప్టు వెళతారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసితో కలిసి ప్రాంతీయ, అంతర్జాతీయ నేతలతో జరిగే శాంతి శిఖరాగ్రానికి సహాధ్యక్షత వహిస్తారు. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్‌పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్‌కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కతార్ రాయబారుల మృతి.. ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం
కైరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం (అక్టోబర్ 11న) జరిగిన ఘోర కారు ప్రమాదంలో కతార్‌కు చెందిన ముగ్గురు కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అక్టోబర్ 13న ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు కతార్ దేశాధినేతకు సేవలందించే అమిరీ దివాన్(Amiri Diwan) కార్యాలయానికి చెందిన ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి’అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి.ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్ట్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ 6న, అక్టోబర్ 7న రెండోసారి చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపు, బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 13న ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది.కతార్ రాయబారుల మరణంతో శాంతి చర్చల్లో కలకలంఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయ దౌత్యపరంగా కలకలం రేపుతోంది. శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోనున్నాయనే అంతర్జాతీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశముంది.మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నాయి. అయితే, ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా? లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా? అన్నది సమయం చెప్పాలి. -
హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’
హమాస్.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’గా రూపాంతరం చెందింది. తాజాగా వీరి బ్రాండ్ పేరును విడుదల చేసింది హమాస్. దీనిలో భాగంగా సుమారు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరుల వలే మారిపోవడానికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్).. గాజాలో ఇటీవల ఉపసంహరించుకున్న ప్రాంతాలపై నియంత్రణను తిరిగి స్థాపించడానికి పౌర దుస్తులలో దర్శనమిస్తున్నారు. మొన్నటి వరకూ చీకటిలో యుద్ధం చేసిన వీరు.. ఇప్పుడ జన జీవన స్రవంతిలోకి వచ్చి నేరుగా గాజాకు అండగా ఉంటామంటున్నారు. మా వారిని విడిచిపెడతారని ఆశిస్తున్నాం..మరొకవైపు గడువులోగా బందీలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ రేపు ఉదయం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టే సమయానికి హమాస్ చేతిలో బందీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది. రెండేళ్ల నాటి యుద్ధం.. ముగిసిన వేళ..హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సుమారు రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. అక్డోబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.వారి మెడపై కత్తి ఉంది..: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.ఇది ఇజ్రాయిల్‌కు పరోక్ష వార్నింగేనా? ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్‌లు అమెరికా ఒత్తిడితో శాంతి ఒప్పందానికి ముందుకొచ్చినా ఇరు వర్గాల్లో ఎక్కడో భయం ఉంది. వారి మధ్య చోటు చేసుకుంది మామాలు యుద్ధం కాదు. విధ్వంసకర యుద్ధం. ఈ క్రమంలోనే వారి మధ్య శాంతి ఒప్పందం జరిగినా కూడా రెండు వర్గాలు జాగ్రత్తగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. హమాస్ ఏమీ చేసే పరిస్థితి లేకే ఒప్పందానికి వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ స్పష్టం చేసిన నేపథ్యంలో హమాస్ కూడా వారు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా లేరనేది అర్ధమవుతోంది. తాము ఉంటాం.. కానీ ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉంటామని చెబుతున్నారు. జస్ట్ మేము మారాం.. అంతే.. మా లక్ష్యం మారలేదు’ అని సందేశాన్ని ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు ద్వారా పంపినట్లు అయ్యింది. అంటే అవసరమైన పక్షంలో మళ్లీ తాము యుద్ధం చేయడానికి సిద్ధమేనని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు హమాస్.. ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ రూపొంతరం చెందడానికి ప్రధాన కారణం మాత్రం ఇజ్రాయిల్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. అటు ఇజ్రాయిల్ కూడా హమాస్‌ను పూర్తిగా నమ్మడం లేదు. ఒప్పందానికి కట్టుబడే అటు ఇజ్రాయిల్-ఇటు హమాస్‌లు తమ తమ చెరల్లో ఉన్న బంధీలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాయి. ఒకవేళ వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తితే మళ్లీ యుద్ధం రాదనే విషయం కూడా చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇదీ చదవండి: 58 మంది పాక్ సైనికుల మృతి -
58 మంది పాక్ సైనికుల మృతి
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గంటగంటకూ ముదురుతున్నాయి. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. కాబూల్‌పై పాక్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తాము కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతుండగా.. అకారణంగా ఆఫ్ఘన్ తమపై కాల్పులకు దిగిందని పాక్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రెండు సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయితే.. తమ సేనలు జరిపిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. 30 మంది సైనికులు గాయపడ్డట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వైపు తొమ్మిది మంది సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డట్లు ఆదివారం మధ్యాహ్నం కాబూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఈ గణాంకాలను నిర్ధారించలేదు. తమవైపు ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు మృతిచెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ప్రకటించింది. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముక్తకంఠంతో ఆఫ్ఘన్ చర్యలను ఖండించినట్లు పాక్ మీడియా తెలిపింది. తాలిబన్ సర్కారుకు గట్టి బదులిచ్చేందుకు పాక్ సైన్యం సిద్ధమైనట్లు వెల్లడించింది.టీటీపీ లక్ష్యంగా డ్రోన్ దాడులుతెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వలీ మహ్సూద్ టార్గెట్‌గా పాక్ సైన్యం దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు టీటీపీ సీనియర్ నేతలు మరణించగా.. వారిలో మహ్సూద్ ఉన్నారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రోన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం పాక్ సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది. హెల్మాండ్ ప్రావిన్స్ లో రెండు పాకిస్థాన్ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కునార్, నంగర్హార్, హెల్మాండ్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.రంగంలోకి ఇరాన్పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలను నిలువరించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చింది. ఘర్షణలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియా, ఖతార్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది. కేవలం రష్యా మాత్రమే తాలిబన్ల అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించింది. తాజాగా భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన తర్వాత.. ఉపఖండంతో తాలిబన్ల మైత్రికి అడుగులు పడ్డాయి.👉ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
ట్రంప్‌కు చైనా కౌంటర్.. భయపడే ప్రసక్తే లేదు..
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా(US Tariff), డ్రాగన్ కంటీ చైనా(china) మధ్య టారిఫ్‌ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump Tariff Warning) విధించిన టారిఫ్‌ల అంశంపై తాజాగా చైనా స్పందించింది. ఈ సందర్బంగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.ట్రంప్ నిర్ణయాలపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతీ విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించడం సరైన మార్గం కాదు. అమెరికా తన తప్పుడు పద్దతులను వెంటనే సరిదిద్దుకోవాలి. చైనా-అమెరికా మధ్య స్థిరమైన వాణిజ్య సంబంధాలను మేము కోరుకుంటున్నాం. ట్రంప్ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే చైనా తన చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. కాగా, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చైనా తీరు తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. అనంతరం, చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇవి నవంబర్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్నిరకాల నియంత్రణలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇక, చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130 శాతానికి చేరడం గమనార్హం. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతోందో చూద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా విధించామని పేర్కొన్నారు. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్‌ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. 🚨Beijing blames the US for raising trade tensions.China signals it won’t back down in the face of the latest tariff threat from President Donald Trump.Officials said “we do not want a tariff war, but we are not afraid of one.” pic.twitter.com/nWpC4GCgOR— CryptoCurrency News (@CryptoBoomNews) October 12, 2025 -
Bangladesh: ‘అసలు హింసే లేదు’.. భారత్‌పై యూనస్ తీవ్ర ఆరోపణలు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదని, అయితే భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. గత ఏదాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై మత పరమైన హింస జరిగిందంటూ వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను ముహమ్మద్ యూనస్ తోసిపుచ్చారు. అవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని పేర్కొన్నారు.ఇటీవల యూఎస్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ముహమ్మద్ యూనస్.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగువారితో సాధారణ ఘర్షణలు ఉన్నాయని, అయితే వీటిని మతపరంగా చిత్రీకరించకూడదన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఫేక్ వార్తలలో ఒత్తిడి తెస్తున్నదని, అందుకే వీటిపై తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హసీనా పదవీచ్యుతురాలైన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయన్నారు. హిందువుల విషయంలో యూనస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అనాగరికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.గత నవంబర్‌లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకా వీధుల్లో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. మరోవైపు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు పలువురు భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాగా బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని యూనస్ విజ్ఞప్తి చేశారు. -
మరో మహమ్మారి విజృంభణ.. పాఠశాలలు మూసివేత.. జనజీవనం అతలాకుతలం
టోక్యో: ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) మహమ్మారితో జపాన్ అతలాకుతలమవుతోంది. సుమారు ఐదు వారాలుగా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫ్లూ కేసుల పెరుగుదల దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు ఫ్లూ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలంతా ఫ్లూ టీకాలు తీసుకోవాలని, ఆరోగ్య రక్షణ చర్యలను పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.ఆస్పత్రులు కిటకిట ఈ ఫ్లూ వ్యాప్తి.. జపాన్‌లో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. బాధితులు ఆస్పత్రుల బయట చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య సిబ్బంది కొరత ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు వేలకు మించిన ఇన్ఫ్లుఎంజా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు వారంతో పోలిస్తే కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఫ్లూ లక్షణాలు కలిగిన బాధితులు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ అధికారులు సలహా ఇస్తున్నారు.పాఠశాలలు మూసివేత ఈ అంటువ్యాధి ప్రజల సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇన్ఫ్లుఎంజా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా 135 పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. యమగాట ప్రిఫెక్చర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలోని 36 మంది విద్యార్థులలో 22 మందికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పాఠశాలను మూసివేశారు. సంక్రమణ మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.నిపుణుల హెచ్చరికలు హక్కైడోలోని హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యోకో సుకామోటో మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫ్లూ వేవ్ అసాధారణంగా, ముందుగానే దూకుడుగా ఉందని హెచ్చరించారు. మారుతున్న వాతావరణం కారణంగా ఇటువంటి పరిణామాలు సర్వసాధారణం అవుతున్నాయన్నారు. గ్లోబల్ ట్రావెల్ నమూనాలు ఇన్ఫ్లుఎంజా జాతులు వ్యాప్తి చెందడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ సగటు ఫ్లూ రోగుల సంఖ్య ఇప్పుడు అంటువ్యాధి స్థాయిలను అధిగమించింది, ఒకినావా, టోక్యో, కగోషిమా అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయి.పర్యాటకులకు సూచనలుఆరోగ్యశాఖ అధికారులు ఇన్ఫ్లుఎంజా టీకా అవసరాన్ని మరోమారు తెలియజేస్తున్నారు. టీకాలు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వీలైనంత సమయం ఇంట్లోనే ఉండడంలాంటి నివారణ చర్యలు ఫ్లూ వ్యాప్తిని నిరోధిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్‌కు వచ్చే పర్యాటకులు పరిశుభ్రతా చర్యలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రయాణ ఆంక్షలు లేనప్పటికీ, సంక్రమణను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. -
పాక్, ఆప్ఘన్ బోర్డర్లో టెన్షన్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్
కాబూల్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్, పాక్ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది.పాక్, ఆప్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ప్రకటించింది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీ జాని, సలేహాన్ ప్రాంతాలలో, అలాగే పక్తియాలోని ఆర్యుబ్ జాజీ జిల్లా అంతటా తీవ్ర పోరాటం జరిగినట్లు నివేదించింది.#𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆:🚨Afghanistan has initiated an offensive against Pakistan from seven distinct border points, according to the Afghan Ministry of Defence; Huge battles underway. Pakistani jets have gone airborne in the east of the country.#Afghanistan #Pakistan pic.twitter.com/n5gwjaicYs— Jahangir (@jahangir_sid) October 11, 2025అయితే, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపినట్టు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి ఈ ఆపరేషన్‌ను అభివర్ణించారు. శనివారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని ఆయన అన్నారు. మరోసారి పాక్.. ఇలా గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్ గగనతలాన్ని తాము ఆక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.Afghan Taliban After capture pakistani post...🇦🇫🇵🇰The Afghan Taliban announce that they have launched attacks against Pakistan at 7 points along the border.Source: Afghan Defense MinistryFuck Pakistan 🖕🖕 pic.twitter.com/9BatiJtBFU— Sumit (@SumitHansd) October 11, 2025ఇక, పాకిస్తాన్ భద్రతా అధికారులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ దాడులను తమ దళాలు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా వారి విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. -
భారత్‌తో బంధానికి అత్యధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సెర్గియో గోర్ చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నిమితుడైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోదీ, సెర్గియో చర్చించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సెర్గియో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. సెర్గియోతో మా ట్లాడడం సంతోషంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మో దీ గొప్ప నాయకుడు, మంచి మిత్రుడు అంటూ డొ నాల్డ్ ట్రంప్ తరచుగా ప్రశంసిస్తుంటారని సెర్గియో గోర్ గుర్తుచేశారు. మోదీతో కీలక అంశాలపై చర్చించానని తెలిపారు. వరుస భేటీల అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు సహా ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్–అమెరికాలు మరింత సన్నిహితంగా మారడం ఖాయమని అన్నారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. -
శరణార్థి శిబిరంపై దాడి
కైరో: సూడాన్ అంతర్యుద్ధంలో అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తాజాగా సూడాన్‌లోని ఉత్తర డార్ఫూర్ రాష్ట్రంలోని ఎల్‌ఫాషర్ నగరంలో ఒక శరణార్థి శిబిరంపై ఆ దేశ పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) జరిపిన దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పిల్లలు, 15 మంది మహిళలు ఉన్నారు. ఐదుగురు పిల్లలు, ఏడుగురు మహిళలుసహా మరో 21 మంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంపై పట్టుఉన్న సూడాన్ సైన్యంతో ఆర్ఎస్ఎఫ్ పోరాడుతోంది. దేశంలో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం!
సియోల్: ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలకు పదును పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ ‘హసాంగ్–20’ను సిద్ధం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి రాజధాని పాంగ్యాంగ్లో అట్టహాసంగా జరిగిన భారీ మిలటరీ పరేడ్‌లో ఈ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆయుధం ప్రజలకు దర్శనమివ్వడం ఇదే తొలిసారి. కిమ్ చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రమని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా అభివరి్ణంచింది. అమెరికాతోపాటు ఆసియాతోని శత్రుదేశాలను భయపెట్టడమే లక్ష్యంగా ‘హసాంగ్–20’ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు. మరికొన్ని రోజుల్లో టెస్టు చేయబోతున్నట్లు సమాచారం. మిలటరీ పరేడ్‌కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్యనేతలు, అధికారులు సైతం హాజరయ్యారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. శత్రువులను మట్టికరిపించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అమెరికా, దక్షిణ కొరియా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారని కొని యాడారు. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిచామని పేర్కొన్నారు. మిలటరీ పరేడ్‌లో లాంగ్–రేంజ్, షార్ట్–రేంజ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్ లాంచ్ వెహికల్స్, డ్రోన్లు, యుద్ధ ట్యాంక్‌లు సైతం ప్రదర్శించారు. ఏమిటీ హసాంగ్–20?మిలటరీ పరేడ్‌లో 11 ఇరుసుల భారీ లాంచర్ ట్రక్కుపై హసాంగ్–20 క్షిపణిని ప్రదర్శించారు. కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజిన్ 1,971 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. ఒకేసారి బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లేలా డిజైన్ చేశారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేయగలదని అంటున్నారు. భవిష్యత్తులో అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి హసాంగ్–20ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ మిస్సైల్ కనీస రేంజ్ ఏకంగా 15,000 కిలోమీటర్లు(9,300 మైళ్లు) కావడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మధ్య దూరం దాదాపు 11,000 కిలోమీటర్లు. అంటే హసాంగ్–20తో అమెరికా రాజధానిని టార్గెట్ చేయొచ్చు. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్‌లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్‌బాల్ ఆట ముగిసిన తర్వాత 18ఏళ్ల బాలుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్ మేయర్ జాన్ లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సంప్రదాయ ఫుట్‌బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
మిలిటెంట్ గ్రూప్ మిలియన్ మార్చ్.. అట్టుడుకుతున్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో మిలిటెంట్ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.ఈ ఘటనపై పాక్ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. Tehreek-e-Labbaik workers forcibly took away a Pakistani police vehicle.This shows exactly how far Pakistan has fallen. Radical mobs are now ruling cities, and the state that cultivated them is watching helplessly.Chaos has become permanent.@LtGenDPPandey @EPxInsights pic.twitter.com/4rKPpPysjm— Stuti Bhagat (@StutiBhagat_) October 11, 2025 -
ఇండియాకు వెళ్లిపో, భారతీయ యువతిపై జాత్యహంకార దాడి
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India) వేధింపులు, జాతి వివక్షకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో బాధితురాలు స్వాతి వర్మ మొత్తం సంఘటనవీడియోనుసోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న స్వాతి ఈఘటన తనను చాలా బాధపెట్టిందని, వ్యక్తిగతం ఇది కలవర పెట్టిందని విచారం వ్యక్తం చేసింది. జిమ్ నుంచి ఇంటికి నడిచి వెడుతుండగా గుర్తు తెలియని మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిందనీ, ఆధునిక సమాజంలో కూడా వలసదారులు వివక్ష, తిరస్కరణను ఎదుర్కొంటున్నారని ఈ వీడియోలో స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది.సాయంత్రం 9 గంటల ప్రాంతంలో, తాను జిమ్ సెషన్ తర్వాత ఇంటికి వెళుతుండగా, నేను నివసించే ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలో, రోడ్డు అవతలి వైపున డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (DCU) బ్యాడ్జ్ ధరించినఉన్న ఒక మహిళ ఈమెను సమీపించింది. ‘నువ్వు ఐర్లాండ్‌కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇండియా తిరిగి వెళ్లిపో’’ అంటూ నానా యాగీ చేసింది. View this post on Instagram A post shared by Swati Verma (@swatayva) అంతేకాదు "నీకు వర్క్ వీసా ఉందా?" సొంత ఇల్లు ఉందా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. అయితే తాను ఇక్కడ ఉచితంగా ఉండటం లేదనీ, టాక్స్‌లు కడుతూ ఇక్కడి దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారం అందిస్తున్నాను అంటూ గట్టిగానే బదులిచ్చింది. అయినా సరే వెంటనే ఇండియాకు తిరిగి వెళ్లిపో అంటూ రెచ్చిపోయింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయానని భయంగా ఉందని, అసలేందో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని స్వాతి పోస్ట్ చేసింది. అయితే జాత్యహంకారం, బెదిరింపు , ద్వేషం ఇప్పటికీ మన వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అందుకే తనలా ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేసి, మీతో షేర్ చేసుకుంటున్నాని తెలిపింది. బహుశా ఆమె ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు.దయచేసి ఎవరైనా ఆమెకు హెల్ప్ చేయండి. అందుకే సం దీన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అని కూడా వివరించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. స్వాతి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, జాగ్రత్తగా ఉండమని సూచించారు. -
ట్రంప్‌కు 79.. అతని గుండెకు 65’.. వైట్ హౌస్ ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారని వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ట్రంప్ గుర్తింపు పొందారు. ట్రంప్ గుండె వయస్సు అతని వయస్సు కన్నా 14 ఏళ్లు చిన్నదిగా ఉన్నదని వైట్‌హౌస్ వైద్య వర్గాలు పేర్కొన్నాయి.గత జనవరిలో వైట్ హౌస్‌లో తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 79 ఏళ్ల ట్రంప్ తన పరిపాలనలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు.‘ట్రంప్ అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారు. అతని గుండె ఎంతో చక్కగా పనిచేస్తున్నదని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా తెలిపారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు వెల్లడించారు. ట్రంప్ తన అంతర్జాతీయ ప్రయాణానికి ముందుగా కోవిడ్-19 బూస్టర్ టీకాలు తీసుకోవడంతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మంచి రోగనిరోధక శక్తి పొందారని కరోలిన్ లీవిట్ తెలిపారు. ట్రంప్ గుండె పనితీరు అతనికన్నా 14 ఏళ్ల చిన్నవయసులో అంటే 65 ఏళ్ల వయసులో ఉన్న గుండె మాదిరిగా చురుకుగా పనిచేస్తున్నదన్నారు.ట్రంప్ ఆరోగ్యంపై ఏడాదిగా పలు వార్తలు వెలువడుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో నాటి అధ్యక్షుడు జో బైడెన్ వయసు, ఆరోగ్యంపై అప్పటి ప్రత్యర్థి ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ తాను ఆరోగ్యంపరంగా ఫిట్‌గా ఉన్నానని ప్రకటించుకున్నారు. తాజాగా ట్రంప్ మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరు నెలల తర్వాత ట్రంప్ చేయించుకున్న వైద్య పరీక్షల్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉందని వెల్లడయ్యింది.గత జూలైలో అధ్యక్షుడు ట్రంప్ తన కాళ్ల దిగువ భాగంలో వాపు, కుడి చేతిలో గాయాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో దర్శనమిచ్చాయి. ఈ సమయంలో వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వారిలో కాళ్లలో వాపు కనిపించడం సాధారణమైన స్థితి అని తెలిపారు. అలాగే తరచూ కలరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం కారణంగా ట్రంప్ చేతికి గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 2020లో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. -
France: నాటకీయ పరిణామం.. తిరిగి ప్రధానిగా లెకోర్ను
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. ఈ ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. 30 రోజుల క్రితం సెబాస్టియన్ లెకోర్ను (39) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు అనంతరం లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంతలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ, తిరిగి ఆయనను ప్రధానిగా నియమించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు.సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా అనంతరం ప్రతిపక్షాలు నూతన ప్రధాని కోసం ఎదురు చూశాయి. అయితే దీనికి భిన్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వారిని నిరాశ పరిచింది. దేశంలోని రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దాలని భావించిన మాక్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లెకోర్నును తిరిగి నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మరోమారు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నుంచి ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడిన దరిమిలా ప్రభుత్వం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఫ్రాన్స్ ప్రధానిగా లెకోర్ను సెప్టెంబర్ 9న ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజుల తరువాత తన పదవికి రాజీనామా చేశారు. కాగా నాలుగు రోజుల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నియమించారు. గత ఏడాది మాక్రాన్ తన అధికారాన్ని పదిలం చేసుకుంటారని భావించినప్పటికీ, హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. నాటి నుంచి ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది. పొదుపు బడ్జెట్‌పై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను ముగించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ప్రధానిగా కొత్త వ్యక్తిని ఆశించారు. అయితే దీనిని భిన్నంగా లెకోర్ను తిరిగి ఇదే పదవిలో నియమితులయ్యారు. ‘రిపబ్లిక్ అధ్యక్షుడు మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నామినేట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు’ అని ఎలీసీ ప్యాలెస్ మీడియాకు తెలిపింది.తిరిగి ప్రధానిగా ఎన్నికైన లెకోర్ను మాట్లాడుతూ తాను విధి లేని పరిస్థితుల్లో ఈ మిషన్‌ను అంగీకరించానని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రాన్స్‌కు బడ్జెట్ అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేస్తానని అయన అన్నారు. 2017లో అధ్యక్ష పదవిని చేపట్టిన మాక్రాన్ మొదటి నుంచే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఫ్రెంచ్ జాతీయ ర్యాలీ పార్టీ నేత జోర్డాన్ బార్డెల్లా ప్రధానిగా తిరిగి లెకోర్నును నియమించడాన్ని జోక్‌గా అభివర్ణించారు. లెకోర్ను గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. -
‘ఆమె అలా అనేసి ఉండొచ్చు..’ నోబెల్ దక్కకపోవడంపై స్పందించిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు(Trump reacts On Nobel Miss). వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఆ గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు గతంలో తాను పలు సందర్భాల్లో సహాయం చేశానని ట్రంప్ అన్నారు. అలాగే, తన నాయకత్వంలో ఏడు యుద్ధాలను ముగించానని.. అందుకోసమైనా తనకు నోబెల్ రావాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి(Maria Corina Machado) ఇవాళ నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థమే నేను ఈ బహుమతిని అందుకున్నానని, మీరు దీనికి అన్నివిధాల అర్హులు అని ఆమె నాతో అన్నారు. అప్పుడు.. అలాగైతే నాకే ఇవ్వండి అని మాత్రం నేను అనలేదు. కానీ, ఆమె అలా అనేసి ఉండొచ్చు.. అంటూ సరదా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. మరియా కొరీనా మచాడోకు గతంలో ఎన్నోసార్లు నా సాయం అందుకుంది. వెనిజులా సంక్షోభ సమయంలో ఎంతో సహాయం చేశా. ఏదైతేనేం లక్షల మందిని రక్షించా.. అందుకు సంతోషంగా ఉంది’’ అని ట్రంప్ వైట్‌హౌజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని చెప్పారు. కానీ అది పెద్ద వ్యవహారం. అయినా నేను ఏడు యుద్ధాలు ఆపాను. అందుకోసమైనా తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజులా ప్రజలకు, ట్రంప్‌కు అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల బాధలకు, అలాగే మా ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె ఓ కృతజ్ఞత పోస్ట్ ఉంచారు. అయితే.. ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ భగ్గుమంది(White House Slams Nobel Committee for Trump Peace Prize Miss). నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ప్రాధాన్యంగా చూసింది అని విమర్శించింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మానవతావాది. ఆయనకు మంచి హృదయం ఉంది. కానీ, నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని ఇది నిరూపించింది. అయినా కూడా ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను రక్షించడం ఆపబోరు అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చైనాపై పెద్దన్నకు కోపమొచ్చింది! నవంబర్ 1 నుంచి.. -
ఆ దగ్గు మందు మా దగ్గరకు రాలేదు: అమెరికా స్పష్టం
వాషింగ్టన్: భారతదేశంలో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ అమెరికాకు రాలేదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ధృవీకరించింది. భారత్‌లో ఒక దగ్గు మందు కారణంగా పలువురు చిన్నారులు మరణించినట్లు వస్తున్న ఆరోపణల గురించి తమకు తెలిసిందని అమెరికా పేర్కొంది. ఈ ఉత్పత్తులు భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఎగుమతి కాలేదని ఎఫ్‌డీఏ పేర్కొంది. విషపూరిత మందులు అమెరికాలో ప్రవేశించకుండా చూసే విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్‌డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్ చేస్తున్న మందులు సురక్షితంగా, అత్యున్నత నాణ్యతతో ఉండేలా నిర్ధారించుకోవాలని తయారీదారులను ఎఫ్‌డీఏ కోరింది. భారతదేశంలో విక్రయిస్తున్న కొన్ని రకాల దగ్గు, జలుబు మందులలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉందనే వార్తల నివేదికల గురించి తమకు తెలిసిందని యూఎస్ ఎఫ్‌డీఏ తెలిపింది.మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.కోల్డ్రిఫ్ సిరప్‌కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్పూర్, సికార్‌లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్‌లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్లు, హోల్‌సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. -
చైనాపై ట్రంప్ బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు ప్రయోగించారు. ఈసా రి డ్రాగన్ దేశం చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించబోతున్న ట్లు తేల్చిచెప్పారు. ఇవి నవంబర్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్నిరకాల నియంత్రణలు విధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అరుదైన ఖనిజాల విషయంలో చైనా తీరు తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130 శాతానికి చేరడం గమనార్హం. అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ప్రభు త్వం కొత్తగా నియంత్రణలు విధించడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతోందో చూ ద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా విధించామని పేర్కొన్నారు. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్‌ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. త్వరలో దక్షణ కొరియాలో జరిగే సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను కలిసే ఆసక్తి లేదని తొలుత వెల్లడించిన ట్రంప్ తాజాగా మాట మార్చేశారు. జిన్‌పింగ్‌తో జరిగే భేటీని రద్దు చేసుకోలేదని పేర్కొన్నారు. కానీ, ఈ భేటీ జరుగుతుందో లేదో తనకు తెలియదన్నారు. అదనపు టారిఫ్‌లు అమలయ్యేనా? అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ప్రభుత్వం గురువారమే ఆంక్షలు విధించింది. మరుసటి రోజే చైనాపై ట్రంప్ సుంకాల మోత మోగించడం గమనార్హం. అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి చైనా నుంచి వచ్చే ఖనిజాలే ఆధారం. నిజానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. చైనాపై ట్రంప్ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రావడం అంత సులభం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాల కారణంగా చైనా ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగితే అమెరికన్లకే నష్టమని అంటున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో విదేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అమెరికా అవసరాలను దృష్టిలో పెట్టుకొని టారిఫ్‌లు తగ్గించారు. చైనా విధించిన టారిఫ్‌లను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాలో ఈ నెలాఖరున ట్రంప్, జిన్‌పింగ్ మధ్య భేటీ జరుగుతుందని, అదనపు సుంకాలపై ట్రంప్ తన నిర్ణయం మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అరుదైన ఖనిజాల మార్కెట్ లో 70 శాతం వాటా చైనాదే కావడం విశేషం. -
హిందూ బాలికపై అత్యాచారం, పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువులు సహా మైనారిటీ వర్గాలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ 15 ఏళ్ల హిందూ బాలికను తనను ఓ వృద్ధుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని కోర్టుకు పేర్కొంది. తన కుటుంబాన్ని చేరుకునే అవకాశం కల్పించాలని వేడుకుంది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై మిర్పూర్ఖాస్ జిల్లాలోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. తుది తీర్పు వెలువడే వరకు ఆమెను సురక్షితంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. గత నెలలోతన కుమార్తెను తమ నివాసానికి సమీపంలో ఉండగా షార్ వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి నిర్మల్ మెఘ్వార్ పేర్కొంది. ‘అప్పటి నుంచి ఆ వర్గం వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు నా కుమార్తె బర్త్ సర్టిఫికెట్ అందివ్వకుండా అడ్డుకున్నారు. మొదటి వాయిదా విచారణకు వచి్చన సమయంలో కోర్టు వద్దే మాపై దాడి చేశారు. నా కుమార్తె గురువారం ధైర్యంతో కోర్టులో వాంగ్మూలం ఇచి్చంది’అని ఆమె పేర్కొంది. దీంతో, పెళ్లి జరిపించిన కాజీని, ఇద్దరు సాకు‡్ష్యలను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందువులు, క్రైస్తవులు సహా మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం వెయ్యి మంది బాలికలకు ఇలా బలవంతంగా పెళ్లిళ్లవుతున్నాయని అంచనా. -
ట్రం‘పూనకాలు’!
అన్యాయం! ఘోరం! ట్రంప్ గారికి నోబెల్ రాలేదు! నోబెల్ శాంతి బహుమతి 2025 ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం దక్కలేదు! ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచి్చన మీమ్స్, జోకులు చూస్తే మాత్రం పగలబడి నవ్వకుండా ఉండలేం. ఈ వార్త వినగానే, ఏం జరిగిందో ఊహించగలం కదా? అవును, ట్రంప్ స్పందనను ఊహిస్తూ ‘క్లాస్ పీకుతున్న’మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మనసు గెలిచిన మచాడో.. ఈసారి బహుమతిని వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఈమెకు ‘వెనెజులాఉక్కు మహిళ’అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, టైమ్ మ్యాగజైన్ ‘2025లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది’జాబితాలో ‘మచాడో’పేరు ఉందంటే ఆమె ప్రభావాన్ని ఊహించుకోవచ్చు. ట్రంప్ గారే టాక్ ఆఫ్ ది టౌన్! కానీ, ఆన్లైన్లో జనాలు ‘మచాడో’గురించి మాట్లాడకుండా, కేవలం ట్రంప్ కలల బహుమతి గురించి మాత్రమే జోకులు వేసుకున్నారు. ట్రంప్ నోబెల్ గెలవనందుకు ఎంత నిరాశ చెందారో చూపిస్తూ.. ఎక్స్ ప్లాట్‌ఫాం నిండిపోయింది. ట్రంప్ చిన్న పిల్లాడిలా అలిగి, చిందులు తొక్కుతున్నట్లు మారి్ఫంగ్ చేసిన ఫొటోలు, ఆయనకు బహుమతి దక్కనందుకు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటున్న వీడియోలు.. అబ్బో! నెటిజన్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ అవకాశాన్ని ’ఇంటర్నెట్ గోల్డ్’గా మార్చడానికి అస్సలు ఆలస్యం చేయలేదు. ట్రంప్ ‘శాంతి’ ప్రకటనలు: కామెడీకి కొత్త నిర్వచనం నిజానికి, 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు, ట్రంప్ చాలా పకడ్బందీగా ప్రచారం కూడా చేశారు. ప్రపంచంలో అనేక శాంతి కార్యక్రమాలలో తన పాత్ర ఉందని, అందుకే ఈ గౌరవం తనకే దక్కాలని ఆయన పట్టుబట్టారు. నిజమా?.. మీరే చేసారా? ఆయన నోటి నుంచి ఈ మాటలు వస్తున్నప్పుడు, అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు ముఖాలు ఎలా పెట్టుకున్నారో ఊహించుకుంటే చాలు. అన్నీ విన్నాక, ‘నిజంగా మీరు ఇవన్నీ చేసేసారా?’అని అందరూ నవ్వుకుంటూనే ప్రశ్నించారట!. ఏదేమైనా, నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కకపోయినా, ఆయన వల్ల మాత్రం నెటిజన్లకు భారీ వినోదం మాత్రం దక్కింది.ఆయన సొంత డబ్బా లిస్ట్ ఇదే.. → ఇజ్రాయెల్–హమాస్, ఆర్మేనియా–అజర్బైజాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారట! → కంబోడియా–థాయిలాండ్ గొడవలు కూడా ఆయనే పరిష్కరించారట! → అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి కృషి చేశానని చెప్పుకొన్నారు (అసలు అదెప్పుడు చేశారో ఎవరికీ తెలియదు). → ఇక, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో–రువాండా, ఈజిప్ట్–ఇథియోపియా, సెర్బియా–కొసావో మధ్య ఉద్రిక్తతలు కూడా ఆయన వల్లే శాంతించాయట! -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
ముంబై: విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్ ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో దుబాయ్‌లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌పీఐ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్ 787 రకానికి చెందినదే. ఈ నెల 4న బర్మింగ్‌హామ్ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్లుండి అత్యవసర ర్యాట్ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే, ఆ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఎఫ్ఐపీ మాత్రం ఆ విమానంలో ఆటోపైలట్, ఇన్స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టమ్స్ (ఐఎల్ఎస్), ఫైట్ డైరెక్టరేట్స్ (ఎఫ్‌డీస్) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక వ్యవస్థలన్నీ చెడిపోయాయని ఆరోపించింది. -
అమెరికా బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు
మెక్ఈవెన్ (యూఎస్): అమెరికాలోని టెన్సెసీ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం (స్థానిక కాలమా నం ప్రకారం) మందుగుండు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు (దాదాపు 19 మంది) మర ణించినట్లు, చాలామంది గల్లంతైనట్లు తెలిసింది. అయితే, మరణాల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. హిక్మాన్ కౌంటీలోని అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ అనే సంస్థ కర్మాగారంలో ఉదయం 7.45 గంటల సమయంలో పేలుడు సంభవించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సహాయ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా మళ్లీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టలేక పోయారు. ‘పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు ఉన్నట్లు తెలిసింది. కానీ ఎంతమంది ఉన్నారనేది తెలియదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ పనిచేసేవారి కుటుంబాలను సంప్రదిస్తున్నాం’అని హంప్ష్రేస్ కౌంటీ షెరిఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు. -
గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
గాజా/ కైరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. 24 గంటల్లో 11 మంది మృతిగురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ భారీగా కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. ఆర్మీ ప్రకటన తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించలేదన్నారు. సైనిక విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయని చెప్పారు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోగా మరో 49 గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తమ బలగాలకు ప్రమాదకరమనిపించిన లక్ష్యాలపైనే దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై హమాస్ మండిపడింది. విడుదలవనున్న మర్వాన్ బర్ఘౌటిఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.కత్తి మెడపైనే ఉంది: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం. -
ట్రంప్‌కు నోబెల్ నిరాశ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్‌ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు. అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్‌తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్బెర్గ్కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్‌లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.గడువు ముగిసిన తర్వాత నామినేషన్లుఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్‌ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్‌కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్‌నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.నోబెల్ కమిటీపై వైట్‌హౌస్ ఫైర్ ట్రంప్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు. నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు. -
అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత్ టెక్నికల్ మిషన్ ఇకనుంచి దౌత్య కార్యాల యంగా మారనుంది. అంతేకాదు, తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించనుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఈ విషయాలను ప్రకటించారు. భద్రతాపరమైన భారత ప్రభుత్వ ఆందోళనలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లను ఆయన అభినందించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించి భారత్‌కు సంఘీభావం తెలపడం ముఖ్యమైన విషయ మన్నారు. ఆ దేశంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధ రించడంతోపాటు కొత్తగా ఆరింటిని ప్రారంభించనున్నామన్నారు. సుహృద్భావ సూచనగా 20 అంబులెన్సులను కానుకగా అందజేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఐదు అంబులెన్సులను స్వయంగా మంత్రి ముత్తాఖీకి అందజేశానని జై శంకర్ తెలిపారు. భారత్‌లో ఆరు రోజుల పర్యటనకు వచ్చిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో మొదటిసారిగా జై శంకర్ శుక్రవారం భేటీ అయ్యారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరికీ అవకాశ మివ్వబోమని ముత్తాఖీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు దేశాలతోపాటు ఈ ప్రాంతమంతటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సవాలుగా మారిందని అంగీకరించారు. ఈ ఉగ్ర గ్రూపుతో తాము సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. భారత కంపెనీలు తమ దేశంలో గనులు, ఖనిజాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనివల్ల రెండు దేశాల వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. రెండు దేశాల మధ్య నేరుగా అదనంగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. అనంతరం, ముత్తాఖీ మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు దశల వారీగా చేపట్టే చర్యల్లో భాగంగా భారత్‌కు దౌత్యాధికారులను కూడా పంపిస్తామన్నారు. మహిళా జర్నలిస్టులకు అందని ఆహ్వానం అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం పంపకపోవడం వివాదానికి దారి తీసింది. భారత్‌లో ఉన్నా తాలిబన్లు లింగ వివక్షను కొనసాగించడంపై నిరసన వ్యక్తమైంది. భారత ప్రజాస్వామిక విలువలకు ఇది అవమానకరమంటూ జర్నలిస్టులతో పాటు రాజకీయ నేతలు, నెటిజన్లు మండిపడ్డారు. సహనాన్ని పరీక్షించొద్దు: ముత్తాఖీ హెచ్చరికమీడియా సమావేశంలో ముత్తాఖీ పాకిస్తాన్ తీరుపై మండిపడ్డారు. కాబూల్‌లోని తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులకు దిగడంపై ఆయన స్పందిస్తూ.. అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించే సాహసం చేయొద్దంటూ ఆ దేశానికి గట్టి వార్నింగిచ్చారు. ‘సరిహద్దులు దాటి మా భూభాగంలో దాడికి పాల్పడి పాకిస్తాన్ తప్పు చేసింది. 40 ఏళ్ల తర్వాత శాంతిని, పురోగతి దిశగా సాగుతున్నాం. ఈ సమయంలో అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించవద్దు’ అని ముత్తా్తఖీ అన్నారు. -
ప్రజాస్వామ్య గళానికి శాంతి నోబెల్
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశే ఎదురయ్యింది. నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేతకమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్‌కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగామరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్‌లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్‌ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు. వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం. 1992లో ఈటెనా ఫౌండేషన్‌ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.ఒక అసాధారణ మహిళమరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్‌కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు. ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు. -
అంతా ట్రంప్ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్ శాంతి’ విజేత
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్‌హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్‌ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. 2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్‌ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.President Trump,Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued. With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025 ఇక ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంనోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి మవ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీ.. పాకిస్తాన్‌కు సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ముత్తాకీ. తాము అధికారం చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఒక ఉగ్రవాది పురుగు కూడా చొరబడలేదన్నారు ముత్తాకీ. తమ దేశం తరహాలోనే ప్రతీ దేశం కూడా ఉగ్రవాదంపై పోరును సాగించాలనే సూచించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు భారత్ గడ్డపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా అఫ్గాన్‌లో ఉగ్రవాదం అనే ఛాయలే లేవని, అందుకు తాము అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. అంతకుముంద లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించినా తాము అధికారం చేపట్టిన తర్వాత ఆ పప్పులు ఉడకలేదన్నారు. ఏ దేశంలోనైనా శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు సూచించారు. ఇది పాకిస్తాన్ ఆచరిస్త వారికి మంచిదంటూ తన సందేశంలో పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్‌కు రావడం ఇదే తొలిసారి. నిన్న(అక్టోబర్9వ తేదీ) భారత్‌లో అడుగుపెట్టారు ముత్తాకీ. తన భారత పర్యటనలో జై శంకర్, అజిత్ ధోవల్‌తో సమావేశం కానున్నారు ముత్తాకీ. ఇది చదవండినోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు. -
నోబెల్ బహుమతి అంటే పేరు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా!
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్సైట్లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.10 కోట్లు పైచిలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.పతకం రూపకల్పన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు. ఆరంభంలో.. 23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు 1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.పతకం రూపం,చిహ్నాలు:నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరంవెనుక భాగం:ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యంఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నంలాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’అంచు:5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూసంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుందిఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. -
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంయాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే.. మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు. -
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి -
నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వేళ ట్విస్ట్
మాస్కో: 2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)ప్రకటన వెలువడే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న కృషిపై రష్యా ఎప్పటికప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బహుమతి ప్రకటనకు చివరి గంటల్లో రష్యా అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ పేరిట శుక్రవారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది.మరోవైపు.. యుద్ధ విరామం జరిగితేనే తాము కూడా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ మద్దతు ఇవ్వనట్లే అని భావించాలి. ఇక..నోబెల్ శాంతి బహుమతి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతులేని ఆశ పెట్టుకున్నారు. తనవల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకుంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది శాంతి బహుమతి రాకుంటే ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ ప్రపంచం మొత్తం నెలకొంది. అదే సమయంలో ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో ఆయన నోబెల్ కల తీరవచ్చనే విశ్లేషణ ఒకటి నడుస్తోంది. మరికొద్ది సేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడనుంది.ఇదీ చదవండి: అందుకే ట్రంప్‌కు నో నోబెల్! -
‘శాంతిదూత’ ట్రంప్.. నోబెల్ కల నెరవేరేనా?
2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)ప్రకటనపై యావత్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ రేసులో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా గాజా సంక్షోభానికి ముగింపు పడేలా.. ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కి తీరుతుందేమోనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ అర్హత దక్కే అవకాశాలపై ఓ లుక్కేద్దాం.. తాను శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపానని, ఎనిమిదవ యుద్ధం ముగింపు దశలో(గాజా) ఉందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తద్వారా జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించటం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం.. లాంటి కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అన్నివిధాలా అర్హుడినని అంటున్నారాయన(Trump Nobel Peace Prize). మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ఇప్పటికే ఆయన్ని ‘పీస్ ప్రెసిడెంట్’గా ప్రకటించుకుంది. ఇదిలా ఉంటే.. 2025కిగానూ ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఒప్పందం ఆధారంగా ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలనే ప్రతిపాదనతో యూఎస్ చట్టసభ్యురాలు క్లౌడియా టెన్నీ నామినేషన్ సమర్పించారు. దీనికి ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా మద్దతు ప్రకటించాయి కూడా. ఇస్తారా? ఇవ్వరా?నోబెల్ శాంతి బహుమతి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. దీనికి ఎవరు.. ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్‌కి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువ. నోబెల్ కమిటీ సాధారణంగా దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలు, అంతర్జాతీయ సహకారం, నిరుపేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా చూస్తుంది. అంతేకాని తాత్కాలిక ఒప్పందాలు, రాజకీయ ప్రచారాలు కాదు. వీటికి తోడు ట్రంప్ చర్యలు, అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం, ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం చూపడం.. ఇవన్నీ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే ట్రంప్ ప్రధానంగా చెబుతున్న గాజా ఒప్పందం తాజాగా కుదరగా.. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ గడువు ఫిబ్రవరి 1వ తేదీతోనే ముగియడం గమనించదగ్గ విషయం. పైగా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతును ప్రకటించిన వాళ్లంతా కూడా ఈ మధ్యకాలంలోనే ఆ ప్రకటనలు చేయడం మరో విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ట్రంప్ బహిరంగంగా బహుమతిని కోరడం, నోబెల్ కమిటీపై విమర్శలు చేయడం వంటి చర్యలు బహుమతి అవకాశాలను తగ్గించాయి. అల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా కమిటీ పనిచేస్తోందని.. ఒబామా ఏమి చేశాడో తెలియకుండానే బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. అలాగే.. ఏదో ఒక కారణం చూపుతూ తనకు నోబెల్ ఇవ్వొద్దని చూస్తున్నారని కూడా అన్నారాయన. ఒకవేళ.. ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. దాని విలువపై ప్రశ్నలు రేకెత్తే అవకాశం లేకపోలేదు. గాజా యుద్ధంలో తాత్కాలిక ఒప్పందం ఆధారంగా బహుమతి ఇవ్వడాన్ని ‘శాంతి కృషి’కి అవమానంగా నిపుణులు భావించే అవకాశం లేకపోలేదు. నార్వే.. అందుకు సిద్ధమా?..తనకు నచ్చకున్నా.. కోపం వచ్చినా.. ట్రంప్ ఎంతకైనా తెగిస్తారన్నది గత 9 నెలలకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేపథ్యంలో.. నార్వే అప్రమత్తమైంది. నోబెల్ బహుమతి తనకే రావాలంటూ నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్బర్గ్క్కి ట్రంప్ ఇంతకు ముందే ఫోన్ చేశారు. అయితే.. నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హార్ప్వికిన్ మాత్రం తాము ఒత్తిళ్లకు తలొగ్గమని, పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ నిర్ణయం అమెరికాతో తమ దేశ సంబంధాలపై ప్రభావం చూపించొచ్చనే ఆందోళన అక్కడి రాజకీయవర్గాల్లో ఉంది. ‘‘ట్రంప్ ఎలా స్పందిస్తారో తెలియదు.. సిద్ధంగా ఉండాలి’’ అని నార్వే సోషలిస్ట్ పార్టీ నేత క్రిస్టీ బెర్గ్స్టో అంటున్నారు.శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ 338 నామినేషన్లు (244 వ్యక్తులు, 94 సంస్థలు) స్వీకరించింది, రేసులో.. పాకిస్తాన్(ఇమ్రాన్ ఖాన్), ఎలాన్ మస్క్(అమెరికా), పోప్ ఫ్రాన్సిస్ (ఇటలీ.. మరణాంతరం), అన్వర్ ఇబ్రహీం(మలేషియా)తో పాటు సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సూడాన్), అలాగే.. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(CPJ), ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ (WILPF) లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖంగా నిలిచాయి.2025 నోబెల్ శాంతి బహుమతి భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10న(శుక్రవారం.. ఇవాళే) మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) ప్రకటించబడుతుంది. ఈ ప్రకటనను నార్వేలోని ఒస్లో నగరంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నర్ ఫ్రైడ్నెస్ ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ అధికారిక YouTube ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండనోవా ద్వీపంలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4తో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో పిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.భూకంపం కారణంగా భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ☄️#BREAKING: More Footage of the Earthquake that hit the Philippines 🇵🇭! pic.twitter.com/r0RxiIdd3i— Galaxy News United(GNU) (@GalaxyNewsUnit) October 10, 2025 Patients and staff seen evacuating the Tagum City Davao Regional Medical Center in the Philippines amid intense shaking caused by magnitude 7.6 earthquake. pic.twitter.com/melwzIQdCy— Noteworthy News (@newsnoteworthy) October 10, 2025Construction worker captures the M7.4 earthquake that hit the Philippines...😱📍 Davao Citypic.twitter.com/ToH8a0rPRo— Volcaholic 🌋 (@volcaholic1) October 10, 2025Video: Water receding for parts of Philippines amid 7.6 magnitude earthquake; tsunami warning in effect for southern Philippines. pic.twitter.com/4ixYtHMZHb— AZ Intel (@AZ_Intel_) October 10, 2025Terryfiyng video: A strong earthquake struck Davao Oriental . Tsunami warning is in effect for Davao Region and Eastern Visayas. Coastal residents are evacuating to higher ground.📍Davao Oriental, Mindanao, Philippines. pic.twitter.com/QOFIbjGuPQ— Weather Monitor (@WeatherMonitors) October 10, 2025NOW: A magnitude 7.6 earthquake hit Davao Oriental shaking much of Mindanao and parts of Visayas.📍 Davao Oriental, Mindanao, Philippines .Tsunami Warning: Coastal residents in Davao Region and Eastern Visayas are evacuating to higher ground. pic.twitter.com/8c8fM5vP4a— Weather Monitor (@WeatherMonitors) October 10, 2025 -
జైషే మహ్మద్ ‘మహిళా గ్రూప్’
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రకటించింది. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో.. జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ విభాగంలోకి ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విభాగానికి మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత మే నెల 7న ఆపరేషన సిందూర్‌లో భాగంగా పాక్‌లోని బహావల్పూర్లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయంపై భారత్ వైమానికదళం క్షిపణుల వర్షం కురిపించటంతో సాదియా భర్త యూసుఫ్ అజహర్‌తోపాటు మసూద్ కుటుంబసభ్యులు పలువురు మరణించారు. ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే సభ్యులు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను ఈ మహిళా విభాగంలోకి చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహావల్పూర్, కరాచి, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్సేహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతులను కూడా ఈ గ్రూపులో చేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్‌కు వ్యతిరేకంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే జమాత్ ఉల్ మోమినాత్ ప్రధాన లక్ష్యమని తెలిసింది. సోషల్‌మీడియా ద్వారా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని జమ్ముకశీ్మర్, ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రాంతాల్లో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాద సంస్థలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు ఈ మహిళా గ్రూప్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు మహిళలకు తమ సంస్థల్లో స్థానం కల్పించలేదు. జిహాద్ పేరుతో చేసే సాయుధ పోరాటాల్లో మహిళలకు స్థానం లేదని చెబుతూ వచ్చారు. కానీ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చావుదెబ్బ కొట్టడంతో జైషే మహ్మద్ తన విధానాన్ని మార్చుకుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజహర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ ఇద్దరూ ఈ మహిళా విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. బహావల్పూర్లో భారత్ ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునరి్నరి్మంచేందుకు ఆర్థికసాయం చేయనున్నట్లు ఇటీవలే పాక్ ప్రభుత్వం తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా పేరుపడ్డ ఐఎస్ఐఎస్, బోకోహరాం, హమాస్ల్లో మహిళా విభాగాలు ఉన్నాయి. ఈ మహిళలతో ఆయా సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది. -
‘బాలాకోట్’ బిర్యానీ.. ‘షెహబాజ్’ షర్బత్!
అవాక్కయ్యారా!.. ఈ పేర్లన్నీ మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (2019), ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ దెబ్బ తగిలిన పాకిస్థాన్ ప్రాంతాల పేర్లే కదూ అనిపించిందా! మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక ఫేక్ మెనూ సోషల్ మీడియాలో వైరలైంది.. దేశం మొత్తం గట్టిగా నవ్వుకునేలా చేసింది! ఈ మెనూని తయారుచేసింది ఎవరో కాదు, మన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఈ ఏఐకి, ఆ మెనూ పేర్లు పెట్టిన మన సైనికులకు పద్మశ్రీ ఇవ్వొచ్చు!. మెనూ చూడగానే, ’అమ్మో! ఎంత ఘాటుగా ఉందో!’ అనిపించేలా ఉంది. ఆ మెనూలో ఉన్న పేర్లు చదివితే, మనోళ్లు మామూలోళ్లు కాదు సుమీ.. అనిపించక మానదు. ఆ మెనూలో పాకిస్థాన్‌ను ఓ రేంజ్లో ఆడేసుకున్నారంతే..! ఇవి చదివాక.. ’ఆహో! వంటకాల పేర్లలో కూడా మన సైన్యం సత్తా చాటిందే!’ అనుకున్నారంతా. బహావల్పూర్ నాన్.. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా మెయిన్ కోర్సుగా బహావల్పూర్ నాన్, రావల్పిండి చికెన్ టిక్కా మసాలా పెట్టారు.. వారి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్టు.. మురిద్కే, ముజఫరాబాద్ పేర్లతో చేసిన డెసర్ట్లు వడ్డించారు. ‘మా విందులో మీకు ఘాటుగా టిక్కా మసాలా ఉంది, తీయగా తిరామిసు ఉంది. కానీ మాకు మాత్రం... మీ టెర్రర్ క్యాంపులు నాశనం చేసిన కిక్ ఉంది!’ అన్నట్టుగా ఉంది ఈ ఫేక్ మెనూ వెనుక ఉన్న ‘పకడ్బందీ ప్లాన్’! ఈ మెనూ చూసి సైనికులు, ఆర్మీ వెటరన్స్ కూడా పగలబడి నవ్వారంటే, దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!మన సైనికుల సెటైర్ సూపరెహే.. ‘షెహబాజ్’ అంటే.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకోవడం. ఇక, ‘రఫీఖీ’ అనేది పాకిస్థాన్‌లోని ఓ ముఖ్యమైన ఎయిర్ బేస్ పేరు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం ఆ ఎయిర్ బేస్‌ను కూడా దెబ్బ కొట్టింది. అంటే, ‘షెహబాజ్ గారూ.. మీ రఫీఖీ బేస్‌ను కొట్టేశాం’.. అని గాలిలోనే సరదాగా వారి్నంగ్ ఇచ్చినట్టు ఉందీ వ్యవహారం. ఏఐ పుణ్యమా అని వైరలైన ఈ ఫేక్ మెనూ, సరదాగా చేసిన ఈ విమానాల నామకరణం చూస్తే.. మన సైనికుల ఫైటింగ్ స్పిరిట్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధంలోనే కాదు, సెటైర్ వేయడంలోనూ దిట్ట!. మరి ఈ ఫన్నీ మెనూ చూశాక మీకేం అనిపించింది?.. మీరూ.. కొత్త ‘శత్రువుల కడుపు మంట’ వంటకాలు కనిపెట్టారా?విమానాలకు కూడా ‘పేరు’! ఇక, విందు మెనూతో పాటు, అంతకంటే ఫన్నీగా జరిగిన ఇంకో విషయం ఉంది. ఐఏఎఫ్ డేకి ముందు.. ఆకాశంలో కనిపించిన రెండు విమానాలకు పెట్టిన సంకేత నామాలు చూస్తే, ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కాదు. ఇ130ఒ విమానం సంకేత నామం: ‘రఫీఖీ’ అn32 విమానం సంకేత నామం: ‘షెహబాజ్’– న్యూఢిల్లీ -
ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్
ముంబై: భారత్ ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకెళ్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాము సైతం భాగస్వాములం అవుతామని చెప్పారు. అద్భుత నాయకత్వ ప్రతిభతో భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. స్టార్మర్ గురువారం ముంబైలో మోదీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వేర్వేరు రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–యూకే మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. మోదీతో భేటీ అనంతరం స్టార్మర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై మోదీతో చర్చించానని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని వెల్లడించారు. భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. భాగస్వామ్యమే మూలస్తంభం: మోదీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత అనిశి్చత పరిస్థితుల్లో ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక ప్రగతికి భారత్–యూకే భాగస్వామ్యం ఒక మూలస్తంభంగా నిలుస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్, యూకేలు సహజ మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధపాలన అనే పునాదిపై రెండు దేశాల బంధం నిర్మితమైందని అన్నారు. నైపుణ్యం, సాంకేతికతలే చోదకశక్తిగా యూకేతో భాగస్వామ్యం నానాటికీ బలపడుతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇరుదేశాల ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ఉమ్మడిగా కృషి చేయడానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. కీర్ స్టార్మర్తో సమావేశమైన తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు. అరుదైన ఖనిజాల విషయంలో సహకరించుకోవడానికి ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో శాటిలైట్ క్యాంపస్ నెలకొల్పనున్నట్లు వివరించారు. అంతేకాకుండా వాతావరణం, సాంకేతికత, కృత్రమ మేధ(ఏఐ)లో పరిశోధనల కోసం క్లైమేట్ టెక్నాలజీ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్రవాదానికి తావులేదని మోదీ తేల్చిచెప్పారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కీర్ స్టార్మర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘తుఝే దేఖా తో’ పాట విన్న స్టార్మర్ సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం దిల్వాలే దుల్హానియా లే జాయెంగేలోని ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ పాటను బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ ఎంతగానో ఆస్వాదించారు. ఆయన ఈ పాట వింటున్న వీడియోను యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచి్చన స్టార్మర్ బుధవారం ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోను సందర్శించారు. రక్షణ ఒప్పందం భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవాలని మోదీ, స్టార్మర్ నిర్ణయానికొచ్చారు. ఈ మేరకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి లైట్‌వెయిట్ మల్టిరోల్ మిస్సైల్ సిస్టమ్స్‌ను అందజేయబోతున్నట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. అలాగే భారత నావికాదళంతో కలిసి మారిటైమ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత వైమానికదళం, బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ శిక్షకులు పరస్పరం సహకరించుకోబోతున్నారు. ఇండియాలో యూకే వర్సిటీ క్యాంపస్‌లు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వయంగా ప్రకటించారు. యూకేకు చెందిన పలు వర్సిటీలు ఇప్పటికే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేశాయి. వచ్చే ఏడాది మరికొన్ని వర్సిటీలు క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి. -
గాజాలో శాంతి పవనాలు!
జెరూసలేం/న్యూఢిల్లీ: వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజా స్ట్రిప్‌లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కలి్పంచనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది. హమాస్ అ«దీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గాజాలో ఆనందోత్సాహాలు ట్రంప్ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. జనం పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు పాలస్తీనా సంప్రదాయ నృత్యాలు చేశారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటానని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చెప్పారు. మరోవైపు శాంతి ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు భావించిన నిరాశ్రయులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జెరూసలేంలో సంబరాలు ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరంలోనూ జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. బందీల రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. తాము ఇన్నాళ్లూ చేసిన ప్రార్థనలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని యూదు మత గురువు అవీ కోజ్మన్ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలనూ గౌరవిస్తాం: ట్రంప్ ‘‘గాజాలో బలమైన, మన్నికైన, శాశ్వతమైన శాంతి సాధనలో భాగంగా బందీలందరినీ హమాస్ అతిత్వరలో విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ తమ సైనికులను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో అన్ని పక్షాలనూ సమానంగానే గౌరవిస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం ఉదయం నుంచి గానీ ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రారంభవుతుందని ఆశిస్తున్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హమ్దాన్ చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులంతా వెళ్లిపోవాలని కోరారు. ఇజ్రాయెల్ జైళ్లలో 250 మంది పాలస్తీనా ఖైదీలు చాలాఏళ్లుగా మగ్గుతున్నారని, గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండేళ్లలో మరో 1,700 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధించిందని గుర్తుచేశారు. వీరందరినీ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇప్పుడేం జరగొచ్చు? గాజాలో హమాస్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేయాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. వారంతా ఆయుధాలు అప్పగించి, లొంగిపోవాల్సిందేనని చెబుతోంది. ఇదే అంశాన్ని ట్రంప్ ప్లాన్‌లోనూ చేర్చారు. లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని సూచించారు. కానీ, ఆయుధాలు వదిలేయడానికి హమాస్ మిలిటెంట్లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. సైన్యమంతా వెనక్కి వెళ్లిపోయిన తర్వాతే చివరి బందీని విడుదల చేస్తామని తేల్చిచెబుతున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుండడం గమనార్హం. మరోవైపు గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది. వెస్ట్‌బ్యాంక్ మద్దతున్న పాలస్తీనా అథారిటీకి గాజా అధికార బాధ్యతలు అప్పగించడం గానీ, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని గానీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు లొంగిపోయి, స్వతంత్ర పాలస్తీనా అథారిటీ చేతిలోకి పాలనా పగ్గాలు వస్తే తప్ప గాజా పునరి్నర్మాణం సాధ్యం కాదు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజల భవిష్యత్తు ఇంకా తేలడం లేదు. గాజాలో శాశ్వతంగా శాంతి ఎప్పుడు నెలకొంటుందన్న సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడేం జరిగింది...2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా మార్చేసి గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ దుశ్చర్యపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. గాజాలో రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో 67,000 మందికిపైగా మృతిచెందారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. గాజా చాలావరకు ధ్వంసమైపోయింది. శిథిలాల దిబ్బగా మారింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాజాలో మారణహోమం ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌ను, హమాస్‌ను నయానో భయానో ఒప్పించారు. తన మాట వినకుంటే నరకం చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. దాంతో ఉభయ పక్షాలు దారికొచ్చాయి. ట్రంప్ పీస్ ప్లాన్‌ను ఇజ్రాయెల్–హమాస్ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. 2023 నవంబర్‌లో ఇరుపక్షాల మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్ విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది బందీలను వదిలేశారు. అంతేకాకుండా మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ట్రంప్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలియజేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మోదీ గురువారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. గాజాలో శాంతి సాధనకు కృషి చేసినందుకు తన మిత్రు డిని అభినందించానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్లాన్ చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పరస్పరం సంప్రదించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు మోదీ స్పష్టంచేశారు. నెతన్యాహుకు మోదీ ఫోన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో పురోగతి పట్ల నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. గాజా నుంచి బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పంపిణీ కోసం అడుగులు ముందుకు పడడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు. -
12 నిమిషాల్లో సైకిల్‌పై ఈఫిల్ టవర్ ఎక్కి సరికొత్త రికార్దు
ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంట్‌నోయ్ అరుదైన వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. మెట్ల మార్గం గుండా సైకిల్‌పై ఈఫిల్ టవర్‌ను 12 నిమిషాల్లో ఎక్కి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 686 మెట్లు ఉన్న ఈఫిల్ టవర్‌ను 12 నిమిషాల 30 సెకన్లలో సైకిల్‌పై ఎక్కారు, అది కూడా ఎక్కడా కాలు కిందపెట్టకుండా ఈఫిల్ టవర్‌ను ఇలా ఎక్కడంతో వరల్డ్ రికార్డు సృష్టించాడు. దాంతో 2002లో హ్యూగ్స్ రిచర్డ్ నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. గతంలో రిచర్డ్ 19 నిమిషాల వ్యవధిలో ఈఫిల్ టవర్‌ను సైకిల్‌పై ఎక్కితే.. ఇప్పుడు దాన్ని ఏడు నిమిషాలు ముందుగాను ఫాంట్‌నోయ్ చేరుకుని నూతన అధ్యాయాన్ని లిఖించాడు. తన తదుపరి లక్ష్యం దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాను ఎక్కి రికార్డు నెలకొల్పడేనని పేర్కొన్నాడు.అయితే ఈఫిల్ టవర్‌ను ఎక్కి రికార్డు నెలకొల్పడంపై ఫాంట్‌నోయ్ మాట్లాడుతూ.. ‘ ఇది మూడు-నాలుగేళ్ల క్రితమే చేయాలనుకున్నానని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేచి చూడక తప్పలేదన్నాడు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెట్టడం, మరొకవైపు ఈఫిల్ టవర్ పనులు జరుగుతూ ఉండటం, మరొకవైపు ఒలింపిక్స్ గేమ్స్ వీటన్ని కారణంగా సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదన్నాడు. -
హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం: కటిక చీకట్లోనూ ఆశలు వదులుకో కూడదని, విధ్వంసానికి విచలితమైన సమాజంలో తన అక్షరాలలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని కలగలిపి చైతన్యం రగిలించిన హంగెరీ రచయిత లాస్లో క్రస్నహోర్కాయ్‌కి ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గురువారం నోబెల్ పురస్కార కమిటీలోని స్వీడిష్ అకాడెమీ అధికారి స్టీవ్ సెమ్ సాండ్‌బెర్గ్ 2025 ఏడాదికిగాను లాస్లోకు సాహిత్య నోబెల్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ‘నాగరికత విధ్వంసం మధ్యలోనూ కళ శక్తిని పునరుద్ఘాటిస్తూ దూరదృష్టితో లాస్లో చేసిన రచనలకు నోబెల్ పురస్కారం అందజేస్తున్నాం’అని స్టీవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నోబెల్ పురస్కారం లభించటంపై లాస్లో సంతోషం వ్యక్తంచేశారు. డిసెంబర్లో స్టాక్‌హోంలో లాస్లోకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇతిహాసాల్లాంటి రచనలులాస్లో రచనల్లో ప్రధానంగా అభౌతికమైన, అలౌకికమైన అంశాలే ఉంటాయి. వాటికి తనదైన హాస్య చతురతను జోడించి సమాజంలోని అణచివేతలు, విధ్వంసాలను ఆయన విమర్శించే తీరు అద్భుతంగా ఉంటుంది. అందుకే స్వీడిష్ అకాడెమీ లాస్లో రచనలను ఇతిహాసాలుగా అభివర్ణించింది. ‘కోఫ్కా, థామస్ బెర్న్‌హార్డ్ వంటి గొప్ప రచయితలు అనుసరించిన మధ్య యూరప్ సంప్రదాయాన్ని కొనసాగించిన గొప్ప ఇతిహాస రచయిత క్రాస్నహోర్కై. అసంబద్ధత, వింతైన ఊహలతో ఆయన రచనలు మూర్తీభవించాయి’అని ప్రశంసించింది. కమ్యూనిస్టు రష్యా ప్రభావంలాస్లో 1954లో హంగెరీలోని గ్యులా ప్రాంతంలో జన్మించారు. హంగెరీలో విప్లవానికి రెండేళ్ల ముందు ఆయన పుట్టారు. ఆ విప్లవాన్ని సోవియట్ యూనియన్ హింసాత్మకంగా అణచివేసిన తర్వాత హింగెరీలో ఏర్పడిన నాగరికత విధ్వంస పరిస్థితులు లాస్లోపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే ఆయన రచనల్లో నాగరికత అంతం, ఆ తర్వాత ఊహా ప్రపంచాల ఆవిర్భావం, అందులోని అసంబద్ధమైన వింతలు అధికంగా కనిపిస్తాయి. లాస్లో 1985లో తన తొలి రచన ‘సటంటాంగో’ను ప్రచురించారు. మొదటి నవలతోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత రాసిన మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్ (1989) కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ రెండు నవలలను హంగెరీ సినీ దర్శకుడు వెలా తార్ ఆ తర్వాత సినిమాలుగా తీశారు. సెజెడ్, బుడాపెస్ట్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన లాస్లో.. యూరప్ దేశాలన్నీ తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తన రచనల్లో వాటిని తనదైన ఊహాత్మక శైలితో పొందుపర్చారు. ‘పిచ్చితనంలోనూ వాస్తవికతను పరీక్షించటమే నా రచనల లక్షణం’అని లాస్లో గతంలో పేర్కొన్నారు. వార్ అండ్ వార్, సీబో దేర్ బిలో (2008) రచనలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. లాస్లో ఇప్పటివరకు 5 నవలలు మాత్రమే రాసినా, అవన్నీ యూరోపి యన్ సాహిత్యంలో ఆణిముత్యాల్లా ప్రశంసలు అందుకున్నాయి. 2021లో రాసిన ‘హెర్చెట్ 07767’నవల గొప్ప సమకాలీన జర్మన్ నవలగా గుర్తింపు పొందింది. ప్రముఖ భారతీయ ఇంగ్లిష్ రచయిత ఆర్కే నారాయన్ రచనల్లో కనిపించే కల్పిత పట్టణం మాల్గుడి మాదిరిగా లాస్లో కూడా తన ప్రతి రచనలోనూ ఓ కల్పిత పట్టణాన్నో, గ్రామాన్నో కేంద్రంగా చేసుకొంటారు. -
భారత్‌పై ప్రశంస.. అమెరికా అధ్యక్షుడికి కౌంటర్ పడ్డట్లే!
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది. యూకే ప్రధాని హోదాలో కీర్ స్టార్మర్ తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.Namaskar doston నమస్కారం మిత్రులారా.. అంటూ హిందీలో యూకే ప్రధాని స్టార్మర్ తన ప్రసంగం ప్రారంభించారు. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందుకుగానూ ప్రధాని నాయకత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారాయన. అలాగే.. 2047 వికసిత్ భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చడమేనని అన్నారాయన. ఇక్కడ నేను చూసిన ప్రతిదీ మీరు(మోదీని ఉద్దేశించి..) ఆ లక్ష్యాన్ని సాధించగలరన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఆ ప్రయాణంలో మేము భాగస్వాములుగా ఉండాలనుకుంటున్నాం అని స్టార్మర్ (UK PM) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. రష్యా ఆయిల్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎకానమీని డెడ్ అంటూ ట్రంప్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు అందుకు కౌంటర్‌గా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యూకే-భారత్ మధ్య ఆర్థిక సహకారం, టెక్నాలజీ, వాణిజ్యం, విద్య రంగాల్లో సహకారం ప్రధానంగా UK–India Free Trade Agreement (FTA)పై చర్చ జరిగింది. ఇదీ చదవండి: భారత్‌తో యుద్ధం తప్పదు! -
భారత్-యూకే ఎఫ్‌టీఏ.. ఆర్థిక వృద్ధికి కొత్త ఆశలు
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జులై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు.ఈ ఒప్పందం వల్ల భారత్‌లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు 34 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.ఎగుమతులు, దిగుమతులుఎఫ్టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్‌కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్‌బ్రెడ్, మెడికల్ డివైసెస్ వంటివి టారిఫ్రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్‌పై 150% నుంచి 75%కి సుంకాలు తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40%కు చేరుతుంది.ప్రొఫెషనల్ మొబిలిటీప్రొఫెషనల్ మొబిలిటీలో ఈ ఒప్పందం యూకే పాయింట్స్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఉల్లంఘించకుండా తాత్కాలిక ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్సులు, ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ఫర్లు, కాంట్రాక్ట్ సర్వీసెస్ కోసం వీసా ప్రక్రియలు సమానంగా ఉంటాయి. అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, ఇంజినీర్లకు మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. దాంతో భారత IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్‌కు యూకే మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులువ్యవసాయ రంగంలో యూకే నుంచి భారత్‌కు ఫ్రెష్/ఫ్రోజెన్ సాల్మన్, లాంబ్ మీట్ వంటి ఉత్పత్తులపై టారిఫ్లుండవు. 10 సంవత్సరాల తర్వాత చాక్లెట్, బిస్కట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఇందులో చేరుతాయి. షుగర్, రైస్, పోర్క్, చికెన్, ఎగ్స్ వంటి సున్నిత రంగాలను ఇందులో నుంచి మినహాయించారు.ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంఎంఎస్ఎంఈలకు ఇన్ఫర్మేషన్ షేరింగ్, పారదర్శకత పెంచుతూ అడ్డంకులను తగ్గించడం ద్వారా చేయూతని అందిస్తారు. కాంటాక్ట్ పాయింట్లు, మార్కెట్ ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆన్లైన్ ట్రేడ్ ఇన్ఫో, ఫైనాన్స్ యాక్సెస్‌పై సహకారం అందుతుంది. డిజిటల్ ట్రేడ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎంఎస్ఎంఈలకు సహాయపడుతుంది.విద్య, పరిశోధనవిద్యా రంగంలో నేరుగా కమిట్మెంట్స్ లేకపోయినా సర్వీసెస్ సెక్టార్ ద్వారా యూకే యూనివర్సిటీలు (అక్స్‌ఫర్డ్, కేమ్బ్రిడ్జ్) భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇది భారత విద్యార్థులకు (ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది యూకే వెళ్తారు) మరింత సౌలభ్యం అందిస్తుంది. ఇన్నోవేషన్ విభాగంలో యూకే-భారత్ పరిశోధన, అభివృద్ధి సహకారాన్ని పెంచుతుంది. ఇన్నోవేషన్ వర్కింగ్ గ్రూప్ రెగ్యులేటరీ అప్రోచెస్, టెక్నాలజీ కమర్షలైజేషన్పై పనిచేస్తుంది.పారిశ్రామికీకరణపారిశ్రామికీకరణలో ఆటోమోటివ్స్ (కారు టారిఫ్‌లు 10%), ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెడికల్ డివైసెస్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్‌పై టారిఫ్‌లు ఉండవు. భారత మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 21% (2031 నాటికి) పెరగడానికి యూకే ఇన్వెస్ట్మెంట్స్ (లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ) సహాయపడతాయి. ఎన్విరాన్మెంట్ పరంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ను ప్రోత్సహిస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’: వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా తను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్టు ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విషయమై వైట్‌హౌస్ ఆయనను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తున్నారు. శాంతి బహుమతికి ఇంకా ప్రకటించలేదు.నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం ప్రకటించాల్సి ఉండగా.. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ట్రంప్ స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించాను. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్, రష్య) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాము. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నాను. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్ చేశాయి. కానీ, నోబెల్ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. ఒక కారణాన్ని కనుగొంటున్నారు అని విమర్శలు చేశారు.THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd— The White House (@WhiteHouse) October 9, 2025మరోవైపు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి విషయంలో తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో ప్రకటనను పంచుకుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. జూన్ 20న, ఇస్లామాబాద్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని ప్రకటించింది ఇటీవల భారత్-పాకిస్తాన్ సంక్షోభంలో ఆయన నిర్ణయాత్మక దౌత్య జోక్యం కీలకమైన నాయకత్వం వహించారని పాక్ చెప్పుకొచ్చింది. -
‘అపూర్వ అడుగు’.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
గాజా సంక్షోభం(Gaza War)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)లు ముందుకు వచ్చాయి. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ·రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. .. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన. ఇది నెరవేరడానికి మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీ(తుర్కీయే)కు థ్యాంక్స్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు విరుచుపడి 1,200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్నారు. ఆపై హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్ ముఖ్య నేతలందరిని హతమార్చింది. ఈ రెండేళ్ల యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు. మరోవైపు మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ఏమందంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు. హమాస్ ఏమందంటే.. ఇటు శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని హమాస్ పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దీపావళికి అమెరికాలో సెలవు ప్రకటన -
భారత్‌తో యుద్ధం తప్పదు!
ఇస్లామాబాద్: భారత్‌తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. మంగళవారం సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయి. పరిస్థితిని ఉద్రిక్తం చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదం ఉన్నమాట నిజం. నేను దానిని తోసిపుచ్చలేను. ఒకవేళ యుద్ధమే వస్తే.. దేవుడి దయవల్ల మనం గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. గత ఆరు నెలల క్రితంకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎక్కువమంది మద్దతుదారులు, మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది’అని పేర్కొన్నారు. భారత్ ఒకేదేశం కాదు మధ్యయుగంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఒకేదేశంగా లేదని ఖవాజా చెప్పుకొచ్చారు. కానీ, అల్లా దయతో ఏర్పడిన పాకిస్తాన్ ఒకే ఐక్య రాజ్యంగా ఉంటూ అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలి సైనిక ఘర్షణ సమయంలో ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను మానుకోవాలని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్ వాయుసేన అధిపతి కూడా గత శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఇచ్చిన ఎఫ్–16 సహా పాకిస్తాన్‌కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపారు. అదేరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ తన పౌరులను రక్షించుకునేందుకు ఏ దేశ సరిహద్దునైనా దాటి వెళ్లగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా యుద్ధం వస్తుందని ఊహించినట్టు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అండతోనే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెదిరించటంవల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పదేపదే ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు లంచ్‌కు కూడా పిలిచాడు. ఆ తర్వాత కూడా పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. దీంతో మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగితే ట్రంప్ తమకు సాయం చేస్తారని ఖవాజా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ అరేబియాతో పాక్ సైన్య సహకార ఒప్పందం చేసుకుంది. అందువల్లే యుద్ధం జరిగితే మంచి ఫలితాలు సాధిస్తామని ఖవాజా ప్రగల్భాలు పలికారని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎఫ్టీఏతో వృద్ధికి అద్భుత అవకాశాలు
ముంబై: భారత్–యునైటెడ్ కింగ్డమ్(యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో భారత్‌లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ సంకల్పానికి ఇదొక చోదకశక్తిగా పని చేస్తుందని అన్నారు. ప్రగతికి ఇదొక లాంచ్‌ప్యాడ్ అని వెల్లడించారు. రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం కీర్ స్టార్మర్ బుధవారం ముంబైకి చేరుకున్నారు. ఆయన వెంట 125 మంది ప్రతినిధులు సైతం వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు ఉన్నారు. రోల్స్ రాయిస్, బ్రిటిష్ టెలికాం, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బ్రిటిష్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్, బ్రిటిష్ ఫిలిం కార్పొరేషన్, పైన్‌వుడ్ స్టూడియోస్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు సైతం ఉండడం విశేషం. బ్రిటిష్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టార్మర్ ఇండియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జూలైలో భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని స్టార్మర్ గుర్తుచేశారు. ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగదని, ఒప్పందం అంటే కేవలం ఒక కాగితం ముక్క కాదని వ్యాఖ్యానించారు. ఒప్పందం దేశ అభివృద్ధికి లాంచ్‌ప్యాడ్‌గా పనిచేస్తుందన్నారు. భారత్‌తో తమ వాణిజ్యం మరింత వేగవంతం, సులభతరం అవుతుందన్నారు. ఈ మేరకు స్టార్మర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిటన్‌కు తిరిగొస్తున్న బాలీవుడ్ ముంబైలోని సబర్బన్ అంధేరీలో ఉన్న యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోను కీర్ స్టార్మర్ సందర్శించారు. యశ్‌రాజ్ సంస్థ సీఈఓ అక్షయ్ విధానీ, చైర్పర్సన్ ఆదిత్య చోప్రా, ఆయన భార్య రాణి ముఖర్జీ తదితరులు స్టార్మర్ను కలిశారు. భారత సినీ నిర్మాణ సంస్థలు యూకేలో సినిమాలను చిత్రీకరించబోతున్నాయని, దీనివల్ల పెట్టుబడులు వస్తాయని, తమ దేశంలో ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్టార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నిర్మాణానికి యూకే ఒక ప్రపంచ స్థాయి వేదిక అని చెప్పారు. ‘‘బాలీవుడ్ మళ్లీ బ్రిటన్‌కు తిరిగివస్తోంది. వచ్చే ఏడాది మూడు బాలీవుడ్ చిత్రాలు బ్రిటన్‌లో నిర్మాణం కానున్నాయి. దీనివల్ల మా దేశానికి లబ్ధి చేకూరుతుంది. ఇది కూడా వాణిజ్య ఒప్పందం లాంటిదే. సినిమాల చిత్రీకరణ వల్ల రెండు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాలు బలపడతాయి’’ అని స్టార్మర్ తెలిపారు. ఫుట్‌బాల్ మైదానానికి స్టార్మర్ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలోని కూపరేజ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను సందర్శించారు. ఆయన వెంట ప్రముఖ సాకర్ ఆటగాడు మైఖైల్ ఓవెన్ కూడా ఉన్నారు. యువ క్రీడాకారులతో, కోచ్‌లతో వారు ముచ్చటించారు. స్టార్మర్ పర్యటన చరిత్రాత్మకం: మోదీ భారత పర్యటనకు వచి్చన కీర్ స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయన పర్యటన చరిత్రాత్మకమని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గురువారం స్టార్మర్తో జరిగే సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. -
కాలిఫోర్నియా రాష్ట్ర సెలవుగా దీపావళి
న్యూయార్క్: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరంలో పబ్లిక్ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎంఆర్ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్ దర్శనా పటేల్‌ను అభినందించారు. -
Pakistan: టీటీపీ ఉగ్రవాదులతో ఘర్షణ.. 11 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి. -
Coldrif syrup: ఆ విషయంపై క్లారిటీ ఇవ్వండి: డబ్ల్యూహెచ్‌వో
మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్‌లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్‌దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. -
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: లోహ సేంద్రియ చట్రాలను(మెటల్–ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్) అభివృద్ధి చేసినందుకు రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ బహుమతి లభించింది. నూతన రూపంలో మాలిక్యులర్ ఆర్కిటెక్చర్‌ను వారు రూపొందించారు. 2025 సంవత్సరానికి గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం.యాఘీలకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ బుధవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రకటించారు. కిటాగవా(74) జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, రాబ్సన్(88) ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, యాఘీ(60) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో పనిచేస్తున్నారు. ముగ్గురు శాస్త్రవేత్తలు భారీ కుహరాలతో కూడిన మాలిక్యులర్ నిర్మాణాలను సృష్టించారని, వీటిద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు స్వేచ్ఛగా లోపలికి, బయటకు ప్రవహిస్తాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ మాలిక్యులర్ నిర్మాణాలు, లోహ సేంద్రియ చట్రాలు ఎడారిలో గాలి నుంచి నీటిని సేకరించడానికి, కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి, విషపూరిత వాయువులు లేదా ఉ్రత్పేరక రసాయన ప్రతిచర్యలను నిల్వ చేయడానికి తోడ్పడుతాయని తెలియజేసింది. ముగ్గురు సైంటిస్టులు వేర్వేరుగానే పనిచేశారు. స్థిరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధికి ఈ ముగ్గురి కృషి దోహదపడింది. 1989 నుంచి వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ ఇంటి నిర్మాణంలో కలప చట్రంతో పోల్చవచ్చు. ఈ నిర్మాణాలు వాయువులను లోపలికి పీల్చుకుంటాయి. అక్కడే నిల్వ చేసుకోగలవు. వాతావరణంలోని ప్రమాదకరమైన వాయువులను బంధించడానికి ఉపయోగపడగలవు. ఎడారుల్లో గాలి నుంచి నీటిని సులువుగా సంగ్రహించవచ్చు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Chemistry to Susumu Kitagawa, Richard Robson and Omar M. Yaghi “for the development of metal–organic frameworks.” pic.twitter.com/IRrV57ObD6— The Nobel Prize (@NobelPrize) October 8, 2025ముగ్గురు సైంటిస్టులు తయారుచేసిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ను నోబెల్ కమిటీ సభ్యుడు ఓలాఫ్ రామ్‌్రస్టామ్ హ్యారీ పోటర్ సినిమాల్లోని హ్యాండ్‌బ్యాగ్‌తో పోల్చారు. ఈ సంచి పైకి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, లోపల మాత్రం చాలా పెద్దది. 1901 నుంచి 2024 దాకా రసాయన శాస్త్రంలో 116 నోబెల్ ప్రైజ్‌లు ప్రకటించారు. 195 మంది సైంటిస్టులు ఈ బహుమతులు అందుకున్నారు. 2024లో ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్ జాన్ జంపర్‌కు ఉమ్మడిగా నోబెల్ లభించింది. 2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ విజేత పేరును నోబెల్ కమిటీ గురువారం ప్రకటించనుంది. నోబెల్ శాంతి బహుమతి విజేత పేరును శుక్రవారం వెల్లడిస్తారు. ఆర్థిక శాస్త్రంలో విజేతను సోమవారం ప్రకటించబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..కెనడాఅత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.జర్మనీయూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఆస్ట్రేలియా (Australia)ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్‌కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.యూకే (United Kingdom)యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్‌కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.స్వీడన్ (Sweden)స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.నెదర్లాండ్స్ (Netherlands)నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.సింగపూర్, యూఏఈఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్‌లో ఫైనాన్స్, ఫిన్‌టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్‌లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర