Tollywood Hero
-
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026 -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో వచ్చే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
'అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు'.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్‌తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్‌కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు గొప్పగా ఉండాలని అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
చిరంజీవి 'విశ్వంభర'.. జూలై కాదు.. ఆ తేదీ ఫిక్స్?
మెగాస్టార్ హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల మరింత ఆలస్యమవుతూ వస్తోంది. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్‌పై విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్‌పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా సమ్మర్లోనే విడుదలవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపించింది.అయితే విశ్వంభరకు రిలీజ్ తేదీకి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తాజా సమాచారం. ఆ సమయంలో పెద్దగా సినిమాల పోటీ లేకపోవడం విశ్వంభరకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశ్వంభర రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఇప్పటికే విశ్వంభర్ రెండు పార్టులుగా వస్తుందన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట స్పందించారు. అలాంటిదేమీ లేదని దర్శకుడు కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ డీల్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముంది. కాగా.. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
రాజ్ తరుణ్ థ్రిల్లర్ మూవీ.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఇవాళ హీరో రాజ్ తరుణ్ బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా టార్టాయిస్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. టార్టాయిస్ కథ చాలా కొత్తగా.. డిఫరెంట్‌గా ఉంటుందని మేకర్స్ వివరించారు. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది.. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి మర్డర్స్ చేస్తూ ఉంటాడు..ఆ తర్వాత ఏమి జరుగుతుందనే కోణంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
'కనిపించే దైవం కూడా మాతృమూర్తి తర్వాతే'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!
ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి ప్రస్తావించారు. అమ్మ… మన మొదటి గురువు.. మన మొదటి ధైర్యం.. కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే అంటూ అమ్మపై ప్రేమ చాటుకున్నారు. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మదేనన్నారు. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను షేర్ చేశారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీతో జతకట్టారు. వీరిద్దరు కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య మూవీ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో కలిసి పనిచేయనున్నారు. ఈ మూవీని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ పెడతారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అమ్మ…మన మొదటి గురువు,మన మొదటి ధైర్యం,కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026 -
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్యా రెడ్డిని పెళ్లాడారు. తిరుమలలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి కావ్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయేనని మనందరికీ తెలుసు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ అని తెలుస్తోంది. అంతకుమించి ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియదు. కానీ తాజాగా కావ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.బిజినెస్‌తో రూ.90 లక్షలు..ఆమె బిజినెస్ ద్వారానే నెలకు ఏకంగా రూ.90 లక్షలు రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. అరటి మొక్కల నుంచి వచ్చే నారతో శారీలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారట. వీటికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ద్వారా కావ్య రెడ్డి నెలకు దాదాపు రూ.90 లక్షలు సంపాదిస్తున్నారని లేటేస్ట్ టాక్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మార్చిలో కావ్యాతో నిశ్చితార్థం చేసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో సింపుల్‌గా పెళ్లి పీటలెక్కారు. -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్‌కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
ఫ్యామిలీతో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. స్పెషల్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్‌తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్‌కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్‌కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఇదే..!
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట. అలా మెగాస్టార్ ఈ బ్లాక్‌బస్టర్ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్‌లో తెలుగులోనూ విడుదల చేశారు. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్‌లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
వారణాసి గ్లోబల్ ఈవెంట్.. టైమింగ్స్ ఇవే..!
మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్‌లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్ ఫ్యాన్స్‌కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది. -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్‌నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్‌కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
అల్లు అర్జున్ షిఫ్ట్.. ముంబైకి కాదు.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్లో ఇప్పుడంతా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. -
అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. బన్నీ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, ఫోటోలు ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ గొంతు, హావభావాలను అనుమతి లేకుండా అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడటకూడదని నిషేధం విధించింది. ఎవరైనా సరే సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కాగా.. గతంలో చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. తమ వ్యక్తగత హక్కులు కాపాడాలంటూ కోర్టుకు వెళ్లారు. తమ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు వాడుతున్నారని సినీతారలు పిటిషన్స్ దాఖలు చేశారు. వీరందరి హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్ట్ ఊరట కల్పించింది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా రాకాలో కనిపించనున్నట్లు సమాచారం. -
కుమారుడి పేరు రివీల్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో తీరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన తీరువీర్.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఆయన పాపం ప్రతాప్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.సినిమాల సంగతి పక్కన పెడితే తిరువీర్ గతేడాది డిసెంబర్లో తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు కుమారుడు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేశారు. వీరిద్దరి రెండో పెళ్లి రోజు సందర్భంగా కొడుకు పేరు రివీల్ చేశారు. అథర్వ్ రెడ్డిగా తమ ముద్దుల కుమారుడికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. తిరువీర్ తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. 2016 నుంచి మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. తిరువీర్ 2024లో కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. Actor Thiruveer named their son - ATHARV REDDY on their second wedding anniversary. pic.twitter.com/73GFRItOPX— CineAura (@CineAuraX) April 21, 2026 -
ట్రంప్‌కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. వీడియో చూశారా?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.దీనికి డొనాల్డ్ ట్రంప్ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్సీస్లో ఎస్వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026 -
విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. అఫీషియల్‌గా ప్రారంభం
రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు. Antha Easy ga Ela Pulloff chesthaav @TheDeverakonda AnnA outfits Anni 🥵❤️💥!...#VDShouryuvpic.twitter.com/rkzc9UR5Qz— Therajamohan (@therajamohan) April 20, 2026 -
నాన్న గొప్పతనాన్ని ఆవిష్కరించే ఓ తండ్రి కథ.. రిలీజ్ ఎప్పుడంటే?
వైఎస్‌కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఓ తండ్రి కథ. ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్వీ క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఆడియో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వి సముద్ర, సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. 'ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనం' అని అన్నారు.దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…'తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం' అని అన్నారు. ఈ చిత్రంలో అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి. కరుణాకర్, తన్నీరు నాగేశ్వరరావు, విజయలక్ష్మీ , వరేణ్య ఆగ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కుటుంబ కథాచిత్రంం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెరచాప మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో వచ్చిన చిత్రం తెరచాప. ఈ మూవీకి జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాశ్ దుర్గం నిర్మించారు. ఈ రోజు ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అసలు కథేంటంటే..సమాజంలో తన ప్రజల కోసం పోరాడే నాయకుడైన కాశీ బాబు (నాగ మహేష్) అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి కొడుకు నిర్లక్ష్య స్వభావం వల్ల చనిపోయాడని అందరూ అంటారు. అయితే తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ఈశ్వర్ (నవీన్ రాజ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) పాత్ర ఏంటి? ఆనంద్ రాజు (రాజీవీ కనకాల), పుష్ప ఫేమ్ కేశవ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మత్స్యకారుల నేపథ్యం ఉన్న కథ అని ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ జోయెల్ జార్జ్. తాను అనుకున్న కథను ఎక్కడా మిస్సవకుండా తెరపై ఆవిష్కరించాడు.సెకండాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న కథనం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. మధ్య మధ్యలో కనిపించే రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్తా చిరాకు తెప్పిస్తాయి. మొత్తానికి స్క్రీన్‌ప్లేలో లోపాలు ఈ కథకు పెద్ద మైనస్. ఓవరాల్‌గా ఓ ఆకట్టుకునే వాస్తవిక డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. . ఈ వీకెండ్‌కు తెరచాపను ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..గ్రామీణ యువకుడి పాత్రలో నవీన్ రాజ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడిగా ఆయన లుక్ చాలా సహజంగా.. పాత్రకు తగినట్లుగా ఉంది. శ్రీలు, పూజా సుహాసిని తమ పాత్రల్లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నాగ మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేశవ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే ప్రజల్ కృష్ణ అందించిన సంగీతం బాగుంది.. ఎంఎల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. అజీమ్, వెంకట్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రాజు బోదాసింగి ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.రేటింగ్: 2.5/5 -
'సెట్లో నేను ఏడ్చిన సందర్భం అదొక్కటే'.. హన్సిక కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్లో ఏడ్చిన సందర్భం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్లో టీమ్‌తో సెండాఫ్ టైమ్‌లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జంటగా హన్సిక హీరోయిన్గా నటించింది. Hansika Motwani says, “The only time I CRIED ON SET was ‘DesaMuduru’.”“#AlluArjun is an amazing person and very respectful. He has a Natural Charm of being a friend. I remember I cried on set for a Crew during #DesaMuduru, After that, I never cried for leaving any film set.” pic.twitter.com/Xx3dxdta4D— Whynot Cinemas (@whynotcinemass_) April 17, 2026 -
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్‌పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్‌గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్‌ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. -
అక్కినేని హీరో సినిమా.. ఎట్టా ఎట్టా అంటోన్న అఖిల్..!
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా
రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.నిర్మాణ సంస్థ తమ నోట్లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్ఫెక్షన్తో మీ ముందుకొస్తాం. జూన్‌లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/jA5aq7dnW0— Vriddhi Cinemas (@vriddhicinemas) April 15, 2026 -
మెగా హీరో వరుణ్ తేజ్‌కు తీవ్ర గాయం..!
మెగా హీరో వరుణ్ తేజ్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో పాటు బరి అనే చిత్రంలో నటిస్తున్నారు. బరి మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయ అయిందని నిహారిక కొణిదెల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం గాయానికి సర్జరీ జరిగిందని తెలిపారు. వరుణ్ తేజ్ గాయం నుంచి కోలుకుంటున్నారని ఇన్‌స్టాలో పంచకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘కమిటీ కుర్రోళ్లుతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యుదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. తన సొంత ఫ్యామిలీ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు చిత్రంలోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్‌లో ఇలాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. -
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026 -
అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ టైటిల్ గురించి టాలీవుడ్లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు. పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్‌పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
అడివి శేష్ డకాయిట్.. ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026 -
స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ నుంచి పుష్ప-2 వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో కొత్త రకమైన వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడే. ఈ సందర్భంగా బన్నీ సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించిన బన్నీ.. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులతో అదరగొట్టాడు.హీరోగా గంగోత్రి.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఓ సారి అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్ చేస్తుంటే బన్నీ కూడా స్టెప్పులతో అదరగొట్టేశారు. అదే టైమ్‌లో ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చి.. ఆ తర్వాత కొద్ది రోజులకు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.రెండో సినిమాకే నంది అవార్డు..ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.బన్నీ వల్లే టాలీవుడ్‌కు సిక్స్ పాక్..టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేసింది కూడా అల్లు అర్జునే. దేశ ముదురు చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీలో హన్సిక హీరోయిన్గా నటించింది. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ చాలామంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్..మొదట్లో అందరు అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'తో ఐకాన్ స్టార్‌గా అయిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. -
'ఇది కేవలం నిశ్చితార్థం కాదు'.. టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్‌కు అభినందనలు చెబుతున్నారు.కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్‌కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. From this moment… everything changes.With hearts full and eyes only for each other,we stepped into a forever we’ve always believed in.No noise, no rush… just love, beautifully ours. 🖤This isn’t just an engagement,it’s the start of something timeless. ✨Location… pic.twitter.com/ufYAsHcYwK— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 7, 2026 -
రిలీజ్‌కు సిద్ధమైన తెరచాప.. ఎప్పుడంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం తెరచాప. ఈ సినిమాకు జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అనన్య క్రియేషన్స్ బ్యానర్లో కైలాష్ దుర్గం నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. -
నాగ శౌర్య యాక్షన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్‌బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారు. ట్రైలర్లో ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. -
మెగా హీరో కొత్త సినిమా.. సంబరాల ఆగిపోయినట్టేనా?
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మెగా హీరో మరో కొత్త సినిమా ప్రకటించారు. క మూవీ డైరెక్టర్ సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్లో 19 మూవీగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఎస్డీటీ19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కంచునున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. Secrets of the Ages… Power beyond imagination.Stepping into something truly powerful… Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna#SDT19 #CosmicChronicles @Shine_Screens… pic.twitter.com/OxXyLhUK6S— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026 A powerful collaboration comes together for #SDT19 ❤️🔥Mega Supreme Hero @IamSaiDharamTej joins hands with visionary director duo @Dir_Sujith & @Dir_SandeepM, backed by blockbuster producer @Sahugarapati7 🔥A new cinematic chapter unfolds. ✨#CosmicChronicles #Archana… pic.twitter.com/dWagdUQwBk— Shine Screens (@Shine_Screens) April 3, 2026 -
హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై చిన్ని బాబు అంటూ తనయుడిపై తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మలయాళ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్లో పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.Many happy returns of the day to the love of my life. Happy Birthday, my chinni babu. #HBDAlluAyaan #AyaanisaVibe pic.twitter.com/czUM77roIv— Allu Arjun (@alluarjun) April 3, 2026 -
తెలుగులో తొలి ఏఐ సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగింతాం. విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. -
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026 -
'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్'
శర్వానంద్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ బైకర్. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ చిత్రంగా బైకర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లలో దూసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం సందడి చేశారు. బైకర్ మూవీకి తన బైక్‌పై స్టైలిష్‌గా కనిపించారు. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డైలాగ్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన శర్వానంద్ ఫుల్ ఖుషీ అయిపోయారు. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న.. లవ్ యూ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావ్.. మన బంధం ఎప్పటికీ ఇలానే పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాని పోస్ట్ చేశారు. అవును... ట్రైలర్ చూసి కొన్ని నమ్మాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. Thank you, Prabhas Anna. Love you 🫂You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7— Sharwanand (@ImSharwanand) March 31, 2026 -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడడం మిస్సయివారు ఎంచక్కా ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.The business begins!#HeyBalwanthSTREAMING NOW #TeluguZee5 #Suhas #HeyBalwanthOnZee5 pic.twitter.com/34BOOlrBJR— ZEE5 Telugu (@ZEE5Telugu) March 30, 2026 -
వెంకీ మామ స్టైలే వేరు.. సింపుల్‌గా హోటల్‌కు వెళ్లి..!
వెంకీమామ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అలరించారు. మెగాస్టార్ హీరోగా వచ్చిన మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో అభిమానులను మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా కనిపించింది. గతేడాది అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సైతం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది.తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే ఈసారి తన తొలి సినిమా హీరో కల్యాణ్‌రామ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురి క్రేజీ కాంబోలో రానున్న చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.ఇక సినిమా సంగతి పక్కనపెడితే విక్టరీ వెంకటేశ్ తాజాగా ఓ హోటల్లో సందడి చేశారు. సామాన్యుడిలాగే హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేశారు. బెంగళూరులోని విద్యార్థి భవన్ అనే హోటల్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వెంకీమామ సింప్లీసిటీని తెగ మెచ్చుకుంటున్నారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 2026 -
శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను జపాన్‌కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టోమట్సు కోసానోకు వివరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ వీడియోను అల్లు అర్జున్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఐకాన్ స్టార్ బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిపారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. A reflection of his love for Indian culture and traditions. 🤍Icon Star @AlluArjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO Mr. Tomatsu Kosano, explaining the historical and spiritual essence of the Ramayana.🙏A beautiful moment of cultural exchange… pic.twitter.com/T4dOeoBqxc— Team Allu Arjun (@TeamAAOfficial) March 27, 2026 -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్‌గా రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo— Filmy Focus (@FilmyFocus) March 27, 2026 -
మెగాస్టార్ గొప్పమనసు.. రామ్ చరణ్ తరఫున బర్త్ డే గిఫ్ట్
మెగా తనయుడు రామ్ చరణ్ బర్త్ డే వేళ మెగాస్టార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ బహుమతి పురస్కారం రూ.10 లక్షల నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్ డే గిఫ్ట్‌గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. -
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨Starring MASS MAHARAJA @RaviTeja_offlA @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026 -
పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.తాజా అప్డేట్ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. -
అదుర్స్ సీక్వెల్.. వీవీ వినాయక్ ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన ఈ మూవీసో మాస్ అండ్ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ కూడా సీక్వెల్‌పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్ అదుర్స్-2పై మాట్లాడారు.ఈ విషయంలో దర్శకుడు వినాయక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు. -
మల్లన్న సేవలో హీరో శ్రీకాంత్ దంపతులు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026 -
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్‌గా ఛాన్స్..!
హనుమాన్ మూవీతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్‌గా క్రేజ్ ఉన్న షోకి హోస్ట్‌గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్‌తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ రియాలిటీ షో జరగనుంది. -
మాట నిలబెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.తాజాగా తాను ఇచ్చిన మాటను అల్లు అర్జున్ నిలబెట్టుకున్నారు. తండ్రిని కోల్పోయిన దుర్గ అనే యువతికి రూ.7,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్‌షాట్‌ను బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించారు. అంతేకాకుండా ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు.అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. After the tragic fire accident at a Kakinada fireworks factory claimed her father's life, Allu Arjun stepped up to support Kadimpalli Durga, a mentally challenged young girl left in distress.He pledged financial assistance of ₹7,500 every month for her entire life to ensure… pic.twitter.com/7DvsBnSZm2— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 18, 2026 -
స్టార్ బాయ్ కొత్త సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా మూవీతో ప్రేక్షకులను అలరించాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక కొత్త ఏడాదిలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మన యంగ్ హీరో.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాలు బ్యానర్సపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. A new journey begins this Ugadi 🔥Star Boy @Siddubuoyoffl x Sithara Entertainments ~ #ProductionNo42 launched with a grand pooja ceremony! ✨A big-scale fantasy entertainer 💥Rolling from this April 🎬Directed by @AforAnilkumar Produced by @vamsi84 & #SaiSoujanya… pic.twitter.com/iN7FuI5ZkW— Sithara Entertainments (@SitharaEnts) March 19, 2026 -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్‌పైనే..ఇటీవల కోలీవుడ్‌లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్‌ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్‌తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్‌తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను పోస్ట్ చేశారు. -
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్‌తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026 -
బ్లాక్ డ్రెస్‌లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. -
హీరో రాజశేఖర్‌కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్‌ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్‌పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
భాగ్యనగరంలో భలే జోరు
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్‌లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్‌లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...మూసరంబాగ్లో... నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. శంకర్‌పల్లిలో ఇరుముడి... వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్‌పల్లిలో జరుపుకుంటోంది.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్‌పల్లిలో కల్కి... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్‌హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్‌కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్‌పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అజీజ్ నగర్లో... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్. ముచ్చింతల్‌లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. అజీజ్ నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణలో లెనిన్... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది. ముచ్చింతల్‌లో భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. తుక్కుగూడలో... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్‌లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం. -
నేను చెప్పేది అదొక్కటే.. మా కుటుంబంలా మీకు జరగ్గకూడదు: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఓ ఆస్పత్రి కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. నా కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా నాకు ప్రేమ అందించిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే జోర్డాన్‌లో పూర్తి చేశారు. ఈ షూట్లో ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముందే డ్రాగన్ టీమ్ ఇండియాకు చేరుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ డ్రాగన్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిమానుల గురించి #NTR ❤️ ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం రుణపడి ఉంటా! 🙏నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే...జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి...😊Follow 👉 @tupaki_official#JrNTR #PES #KIMSHospitals #NTRInBengaluru #LatestNews #Tupaki pic.twitter.com/93Ts08a971— Tupaki (@tupaki_official) March 8, 2026 -
'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. This Women’s Day is about accepting and embracing myself — in all the many shapes & sizes in different phases of my life. It isn’t always easy, but I’m motivated to make my health a priority, for my own wellbeing & for my family. 💛 pic.twitter.com/9NBdRIiQsH— Upasana Konidela (@upasanakonidela) March 8, 2026 -
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు.. వీడియో వైరల్
టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, శోభిత ధూలిపాల ప్రముఖ ఆలయంలో పూజలు చేశారు. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే వృషకర్మ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Actor Naga Chaitanya, along with his wife Sobhita Dhulipala, visited the Shree Jagannath Temple at Puri, in Odisha, to seek the blessings of Lord Jagannath.Actor Naga Chaitanya says, "Jai Jagannath" (06.03) pic.twitter.com/VAhPmVmCpw— ANI (@ANI) March 6, 2026 Puri, Odisha : Actor Naga Chaitanyaprays at Shree Jagannath Temple. pic.twitter.com/utech7CQVF— News Arena India (@NewsArenaIndia) March 6, 2026 -
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
శర్వానంద్ బైకర్ మూవీ.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్
శర్వానంద్ హీరోగా వస్తోన్న రేసింగ్ చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.ఇప్పటికే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జిద్దీ జిద్దీ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఈ పాటను కంపోజ్ చేసిన జిబ్రాన్ తానే ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ సరస్వతి లాంటి సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పలు వెబ్ సిరీస్‌లు, చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫ్రైడే ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06 వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06 స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06జియో హాట్‌స్టార్ విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06 టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06సోనీ లివ్ లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్ డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06 గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5 గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06 -
విరోష్ జంట రిసెప్షన్లో కనిపించని ఆ టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.స్టార్స్ డుమ్మా..అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.అదే కారణమా?కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్‌గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్‌కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. -
మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటో విష్ణు రివీల్ చేశారు. ఓ పాప కోసమే ఈ సినిమా అంతా కొనసాగుతుందని అన్నారు. ఆ పాప ఫాదర్ ప్లేస్‌లో నన్ను తీసుకుని జస్టిస్ కావాలనుకుందో.. ఆ ప్లేస్‌లో నేను పాపకు హీరో అని తెలిపారు. చైల్డ్ సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే సెంటిమెంట్‌లో డాడీ, బింబిసార, హాయ్‌నాన్న సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. #Daddy, #Bimbisara, #HiNanna సినిమాలు చైల్డ్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.ఇప్పుడు అదే ఎమోషనల్ టచ్‌తో #Mrithyunjay కూడా వస్తోంది. - #VenkyAtluri - #SreeVishnu pic.twitter.com/05Ygjzrcva— CHITRAMBHALARE (@chitrambhalareI) March 4, 2026 -
'ప్రతి ఒక్కరికీ అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. We would like to thank everyone who attended the pre-wedding reception and showered their blessings on the lovely couple. To all those sending their wishes from across the world, our hearts are filled with gratitude.Thank you for all the love and warmth. ALLU FAMILY. pic.twitter.com/0AtL6oCYIu— Allu Arjun (@alluarjun) March 4, 2026 -
మనశంకర వరప్రసాద్‌గారు మరో రికార్డ్.. అదేంటంటే?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాజాగా మనశంకర వరప్రసాద్‌గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. 50 DAYS. 109 CENTRES. 🔥Thousands of celebrations 🥳Lakhs of whistles 😍Countless goosebumps ❤️🔥Megastar @KChiruTweets’s ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru completes a sensational 50-day theatrical run, rewriting box office history 💥💥💥#MSG… pic.twitter.com/qFr1Pazn3k— Shine Screens (@Shine_Screens) March 2, 2026 -
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
దుబాయ్‌లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోయింది. To everyone concerned about our safety, thank you. 🙏 We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026 -
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
ముందుగానే అంచనా వేశారు.. ఎస్కేప్ అయ్యారు.!
ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ టీమ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్ టీమ్ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. -
దుబాయ్‌లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.కాగా.. ఇరాన్‌పై దాడి తర్వాత దుబాయ్ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ మిస్సైల్స్‌తో దుబాయ్‌పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్‌లో ఉన్నానని మిస్సైల్స్ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం దుబాయ్‌లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు. War has never elevated our humanity.When innocent lives suffer and fear replaces normalcy, no justification can make it right.Praying for the safety of innocent people in Dubai and everywhere affected by violence.#WorldWar3#Peace #humanity#Dubai #dubaiattack pic.twitter.com/nCBfkptaSy— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 1, 2026 -
నిర్మాతగా రామ్ చరణ్.. స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్ సంగీతమందించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026 -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ
టైటిల్: సన్ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్మెంట్ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
కిరణ్ అబ్బవరం కుమారుడి కేశఖండన వేడుక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.కిరణ్ అబ్బవరం తన కుమారుడు హనుఅబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026 -
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
గ్రాండ్‌గా విజయ్-రష్మిక పెళ్లి.. అతిథుల నోరూరించే స్పెషల్ వంటకాలు ఇవే.. !
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఇంతలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్ వెడ్డింగ్‌లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్‌గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్, మైసూర్ పాక్ అతిథులకు రుచి చూపించారు. -
అక్కినేని నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష గ్లింప్ల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చేనెల ఐదో తేదీన వృషకర్మ గ్లింప్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు నాగచైతన్య ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. When sinister energy awakens, A warrior is chosen. #VrushakarmaGlimpse on MARCH 5th, 2026 ❤️🔥The much anticipated world of #VRUSHAKARMA opens in all its fury, fire, and fear 💥💥💥Yuvasamrat @Chay_akkineni like never before in @karthikdandu86’s vision 🔥 @Meenakshiioffl… pic.twitter.com/k7Rk4uoVEx— Annapurna Studios (@AnnapurnaStdios) February 25, 2026 -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్‌కు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to launch the first single of #Mrithyunjay - #EeZindagi ❤️🔥The trailer also looked intriguing..Looking forward to seeing @sreevishnuoffl in @hussainshakiran ‘s thriller. Wishing them all the very best for Mrithyunjay coming on March 6th! ❤️Check the song out now!… pic.twitter.com/uSjXSaPIfY— RAm POthineni (@ramsayz) February 25, 2026 -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్‌లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్‌గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పెళ్లికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి pic.twitter.com/fKmHCFaLYs— Telangana365 (@Telangana365) February 25, 2026 -
రియల్ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం కాక్రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు. -
రాధిక శరత్‌కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్‌స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026 -
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్‌ను హద్దుల్లేని నా అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.కాగా..కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఐకాన్‌స్టార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్‌కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤 pic.twitter.com/EYPdC9BJl9— Allu Arjun (@alluarjun) February 22, 2026 -
ప్రభాస్ ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ తీసుకొచ్చింది. -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. Release date marindhi, thrillu kaadhu🔥Meet #MrithyuNjay in cinemas from March 6th❤️🔥 pic.twitter.com/vrKKwW0Ijo— Sree Vishnu (@sreevishnuoffl) February 20, 2026 -
ప్రశాంత్ వర్మ- ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?.. అసలు నిజమేంటి?
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. తన చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవీ కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి రెబల్ స్టార్ ఓకే చెప్పిన సంగతి తెలిసింది.ఇన్నీ భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రభాస్ చేతిలో ఉండగా.. ప్రశంతా వర్మతో సినిమా చేసేందుకు టైమ్ కేటాయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో ప్రాజెక్ట్ రద్దైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ వినిపించింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెగ ఆరా తీస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అని షాకవుతున్నారు.ప్రశాంత్ వర్మ క్లారిటీ..ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్ స్వయంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్‌తో ప్రాజెక్ట్ రద్దు కాలేదని.. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఆలస్యం కానుందని తెలిపారు. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతే తప్ప తమ ప్రాజెక్ట్ రద్దు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్, కల్కి-2 సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, అతను ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ చిల్ అవుతూ అప్డేట్స్ కోసం వేచి చూడటమే. జై హనుమాన్తో బిజీగా ప్రశాంత్ వర్మమరోవైపు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని సమాచారం. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యంగ్ హీరోకు ఫోన్ నంబర్.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.ప్రభాస్ అన్న ప్రశంసలు తమ చిత్రానికి రావడంపై సంతోశ్ శోభన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్న రివ్యూతో మా మూవీ సక్సెస్ అయినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోశ్ శోభన్‌కు ప్రభాస్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అన్న ఫోన్ నంబర్ నా వద్ద లేదని.. నీకు నేను అభిమానిని మాత్రమేనని శోభన్ చెప్పగా.. ప్రభాస్ తన నంబర్ ఇచ్చాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చెయ్.. అనవసరంగా చేస్తే తంతా అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్..ఈ చిట్ చాట్‌లో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ఆ రోజు ఓం రౌత్‌కు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తానని చెప్పానన్నారు. చెన్నై నుంచి ఆహారం ఆర్డర్ చేసి ముంబయికి ఫ్లైట్‌లో తెప్పించినట్లు వెల్లడించారు. మన హైదరాబాద్ బిర్యానీ ఓకే కానీ.. చెన్నై ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రభాస్ అన్నారు. ఇది విన్న ఔం రౌత్ నీలాంటోడిని ఎక్కడా చూడలేదని అన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ అన్న ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు...#Prabhas: "దా నా నెంబర్ ఇస్తా...Important అయితేనే Call చెయ్..ఊరికే చేసావ్ అనుకో తంతా 🤣👌🏻" pic.twitter.com/ldbMr8hnIS— Movies4u Official (@Movies4u_Officl) February 20, 2026 -
'రామ్ చరణ్‌కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Wishing you a Very Happy Birthday Surekha Amma Garu ❤️❤️@AlwaysRamCharan https://t.co/e7nZ2cjUqf pic.twitter.com/cCdfuUUY73— Team Charanism (@TeamCharanism) February 18, 2026 -
ఎవరైనా అబ్బాయితో నాకు పెళ్లి చేస్తావా?.. విష్ణు విన్యాసం టీజర్ చూశారా?
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా విష్ణు విన్యాసం మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విష్ణు.. నీకు తెలిసిన అబ్బాయిల్లో ఎవరినైనా ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధన్ సంగీతమందించారు. -
ఈ రోజుల్లో నిర్మాతకు విలువే లేదు: దిల్ రాజు ఆవేదన
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేకుండా పోయిందన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని... అందరూ తీసుకునేవాళ్లేనని అన్నారు. ఈ రోజుల్లో తీసుకునేవాళ్లే.. ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ఉందని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు. రజినీకాంత్ చెప్పినట్లు నిర్మాత అంటే ఇచ్చేవాడు.. అందరూ తీసుకునేవాళ్లే. అప్పట్లో అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి నిర్మాతలు ఉన్నారు. నా దిల్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటే రైట్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పా' అని అన్నారు. నిర్మాతకు ఈరోజు విలువ లేదు...నిర్మాత అంటే ఇచ్చేవాడు... అందరూ తీసుకునేవాళ్లు...తీసుకునేవాళ్లే ఈరోజు ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ఉంది.-#DilRaju pic.twitter.com/RZ0Ophb5tn— M9 NEWS (@M9News_) February 18, 2026 -
'45 ఏళ్ల ప్రేమాభిషేకం.. లక్షలాది హృదయాల్లో జీవించే ఉంటారు'
తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో రిలీజైన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అక్కనేని వెంకట్, అక్కినేని నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఐకానిక్ మూవీలో శ్రీదేవి హీరోయిన్గా నటించింది..నేటితో ఈ మూవీ రిలీజై నేటికి 45 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'ప్రేమకు నిర్వచనం… త్యాగానికి ప్రతీక… సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ మూవీ 45 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామని తెలిపింది. ఈ సినిమా రికార్డులు, భావోద్వేగాలు, ప్రభావం నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని ట్వీట్ చేసింది. లక్షలాది హృదయాల్లో ఏఎన్నార్ ఎప్పటికీ జీవించే ఉంటారని ట్వీట్లో వెల్లడించింది.ప్రేమకు నిర్వచనం…త్యాగానికి ప్రతీక…సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨A timeless legacy of the legendary #ANR garu that… pic.twitter.com/Ifcorr71DG— Annapurna Studios (@AnnapurnaStdios) February 18, 2026 -
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని టీమ్‌ను అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్ వచ్చింది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్సంగీతమందించారు. -
సొంతిల్లు లేదు.. అకౌంట్లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే రోటిన్ భిన్నంగా కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్ మీట్లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు. దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్ సినిమాకు అడ్వాన్స్ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్‌నుమా దాస్ రిలీజ్ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్ సినిమాకు అడ్వాన్స్ రూ.50 వేలు బ్యాంక్ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు. -
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే
తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్‌తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026 -
'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైన వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్‌కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్ఫర్ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.ఆ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్‌కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్ ప్రశంసించారు.నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతె ట్రైన్లో సెనగలు తిందాం అంటూ షూటింగ్ ఆగనివ్వకుండా చేసారు.సింప్లిసిటీ కి మారో పేరు కృష్ణ గారు...- Actor #Naresh !#HeyBhalwanth pic.twitter.com/wMgWkQpYed— Karthikuuu (@Anchor_Karthik_) February 16, 2026 -
ఎర్రబస్సు ఎక్కా.. ఒక్కరు గుర్తుపట్టలేదు : జగపతి బాబు
సింపుల్ లైఫ్‌ని లీడ్ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు. అంతేకాదు సెట్లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్‌గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లి వచ్చేవారట. సెట్లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో గ్యాంబ్లింగ్ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదుసాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నా షూట్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్‌గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్ అయిపోయారు. మా హోటల్ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్‌కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్‌లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్‌కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్‌గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. -
మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్‌గారు సూపర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగా అభిమానులను మెప్పించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్‌లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. -
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్‌గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. I don’t want to rush. I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026 -
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్గా కనిపించనుంది. గోపి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
యూఫోరియా మూవీకి మహేశ్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻A must watch! Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026 -
శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. -
అర్జున్ సర్జాకు గిఫ్ట్ ఇచ్చిన ట్యాంక్ బండ్ శివ.. వీడియో వైరల్
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివను ఘనంగా సత్కరించారు.ఈవెంట్‌కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్‌ను అర్జున్‌కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్ బండ్ శివకు లక్ష రూపాయల చెక్‌ను అర్జున్ సర్జా అందజేశారు."నా భార్య శాంతే నా జీవిత ప్రయాణానికి అర్థం.. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నా.."-నిష్కల్మషమైన తన స్పీచ్ తో సభికుల మనసులను గెలుచుకున్న ట్యాంక్ బండ్ శివ..#SeethaPayanam pic.twitter.com/VJvjFyXpYN— Mega Abhimani (@megaabhimani3) February 10, 2026 -
'ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు.. అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన'
అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్‌తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్‌తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Unbelievable rules of Allu Arjun.A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026 -
'ఐకాన్ స్టార్‌తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్‌పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.కావేరి బారువా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్‌తో జరిగింది. ఈ సౌత్ స్టార్‌ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్‌కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026 -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఉపాసన తన పోస్ట్‌లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం. తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOUMy family is truly blessed.Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026 -
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్‌పుల్‌గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో రేవంత్ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్‌తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్‌కు హాజరైన తరుణ్ భాస్కర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్‌కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్‌కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్‌లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్‌లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. -
మైక్ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్‌ను చూస్తుంటే అనుదీప్‌ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026 -
రూరల్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
యాటిట్యూడ్ స్టార్‌కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్‌పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్‌ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్‌బాస్ అమర్దీప్
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్‌గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు. -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
దేవగుడి సక్సెస్.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు. -
రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?
రామ్ చరణ్ దంపతులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…— Allu Arjun (@alluarjun) February 2, 2026 -
తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్
మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు. అర్ధరాత్రి ఉపాసన ఓ బిడ్డ, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్....గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి చేసిన ప్రతిపాదనను తాజాగా ఆమోదించారు. సినిమా షూటింగ్లలో ఎంతో శ్రమించే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు.ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించనుంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


