విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు | Tollywood actors Praised Vijay won In Tamilnadu elections | Sakshi
Sakshi News home page

Vijay: విజయ్ విన్.. టాలీవుడ్ హీరోల ప్రశంసలు

May 4 2026 6:47 PM | Updated on May 4 2026 7:07 PM

Tollywood actors Praised Vijay won In Tamilnadu elections

విజయ్ గెలుపుతో కోలీవుడ్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్‌ సైతం విజిల్స్‌తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. 

టాలీవుడ్ హీరోల ప్రశంసలు..

దళపతి విజయ్‌కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి  ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్‌ విజయంపై ట్వీట్ చేశారు.

కాజల్ అగర్వాల్ ట్వీట్..

తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన  విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా  చెప్పారని ప్రశంసించింది.  ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ,  మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. 

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు
 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement