'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' | Hero Prabhas Latest Bike Video Goes Viral on Social Media | Sakshi
Sakshi News home page

Prabhas: 'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్'

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 9:24 AM

Hero Prabhas Latest Bike Video Goes Viral on Social Media

శర్వానంద్‌ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ బైకర్. ఇండియాలోనే తొలి మోటోక్రాస్‌ చిత్రంగా బైకర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లలో దూసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం సందడి చేశారు. బైకర్‌ మూవీకి తన బైక్‌పై స్టైలిష్‌గా కనిపించారు. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌ అంటూ డైలాగ్‌ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన శర్వానంద్‌ ఫుల్ ఖుషీ అయిపోయారు. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న.. లవ్ యూ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావ్.. మన బంధం ఎప్పటికీ ఇలానే పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాని పోస్ట్ చేశారు. అవును... ట్రైలర్ చూసి కొన్ని నమ్మాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement