మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఇదే..! | Did Megastar Chiranjeevi Missed The Super Star Blockbuster Movie, Viral News Sparks Debate Amid New Film Buzz | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ స్టార్ సినిమా ఇదే..!

Apr 29 2026 4:31 PM | Updated on Apr 29 2026 5:31 PM

Megastar Chiranjeevi missed the super Star blockbuster Movie

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్‌ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. ‍అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్‌ హల్‌చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ ‌కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.

కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట.  అలా మెగాస్టార్ ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.  ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్‌లో తెలుగులోనూ విడుదల చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement