'తిరుమలలో పెళ్లి జరగడం నా ‍అదృష్టం..' బెల్లంకొండ | Bellamkonda Sai Srinivas Marriage on Marriage At Tirumala | Sakshi
Sakshi News home page

Bellamkonda Sai Srinivas: 'తిరుమలలో పెళ్లి జరగడం నా ‍అదృష్టం..'

Apr 29 2026 2:58 PM | Updated on Apr 29 2026 7:04 PM

Bellamkonda Sai Srinivas Marriage on Marriage At Tirumala

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి  శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.

ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్‌లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.

తిరుపతిలో వివాహం నా ‍అదృష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement