తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం | tollywood Hero Kiran Abbavaram about His wife Rahasya Ghorakh | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది

Apr 15 2026 3:40 PM | Updated on Apr 15 2026 5:25 PM

tollywood Hero Kiran Abbavaram about His wife Rahasya Ghorakh

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ ‍అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్‌ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.

ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్‌లో ఇలాంటి పార్ట్‌నర్‌ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement