రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..! | The Main Reason Behind The peddi Movie Postponed two times | Sakshi
Sakshi News home page

Peddi Movie: రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!

Apr 27 2026 2:33 PM | Updated on Apr 27 2026 2:57 PM

The Main Reason Behind The peddi Movie Postponed two times

రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.

పెద్ది మూవీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ గెటప్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement