ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్‌గా ఛాన్స్..! | Tollywood Hero Teja Sajja going To Become as a Host for Reality Show | Sakshi
Sakshi News home page

Teja Sajja: ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్‌గా ఛాన్స్..!

Mar 20 2026 3:28 PM | Updated on Mar 20 2026 3:40 PM

Tollywood Hero Teja Sajja going To Become as a Host for Reality Show

హనుమాన్ మూవీతో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్‌లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్‌గా క్రేజ్‌ ఉన్న షోకి హోస్ట్‌గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్‌తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్‌ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్‌ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ రియాలిటీ షో జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement