breaking news
traitors
-
Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మీ!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వస్తోన్న రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు. ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్‌గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచి తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు రానుంది. -
‘బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశద్రోహులు’
బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులన్నారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను అభివృద్ధి చేయడానికి సంస్థ ఉద్యోగులు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. వీరంతా దేశ ద్రోహులని హెగ్డే విరుచుకుపడ్డారు. (బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి) అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు హెగ్డే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కన్నది. బీజేపీ అసమర్థత వల్లే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించింది. కేంద్రం ప్రతిదానిని ప్రైవేటీకరిస్తుందని తెలిపింది. -
దేశద్రోహులకు మద్దతిస్తారా?: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి కి, ఉగ్రవాదులతో సంబంధమున్న వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలా? దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతునిస్తాయా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని శరణార్థుల కోసం తీసుకొస్తే విపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయన్నారు. పార్టీ నేతలు పద్మ, సుధాకరశర్మలతో కలసి ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మోకాలికి, బోడి గుండుకు లంకె పెట్టేలా వ్యవహరిస్తున్నా యని ధ్వజమెత్తారు. దేశంపై తమ గుత్తాధిపత్యం కొనసాగాలనే అక్కసుతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో కాంగ్రెస్ పార్టీ కాస్తా కమర్షియల్ పార్టీగా మారిందన్నారు. -
‘అలాంటి వ్యక్తికి అధికారం దక్కనివ్వం’
పూణె : దేశ ద్రోహులకు మద్దతిస్తున్న రాహుల్ గాంధీని అధికారంలోకి రానివ్వొద్దని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. శివసేన అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ఉద్దవ్ ఠాక్రే. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మేనిఫెస్టోలో రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా’ అని ప్రజలను ప్రశ్నించారు. రాజద్రోహానికి పాల్పడే వారిని ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘దేశం మీద ప్రేమతో శివసేన, బీజేపీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి లక్ష్యం ఏంటి.. మేం దేశం కోసం కలలు కంటాం. మరి మీ కల ఏంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అధికారాన్ని దక్కించుకోవడమే మీ ధ్యేయం అంటూ విమర్శించారు. రేపు కూడా మా ప్రధాని నరేంద్ర మోదీనే.. మరి మీ ప్రధాని ఎవరో చెప్పగలరా అంటూ ఆయన ప్రతిపక్షాలను సవాల్ చేశారు. -
'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిక కారణమైన వారు విద్రోహులంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తాను పొరపాటున ఈ మాట అన్నానని ఒప్పుకున్నారు. విద్రోహులు అన్న మాట అనునుండాల్సింది కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కొంత మంది కార్యకర్తలు పార్టీకి సహకరించలేదని, వీరంతా విద్రోహులని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. పార్టీ ఓటమిపై 26 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించిన పరిశీలకులు నివేదికను సోమవారం రాంగోపాల్ యాదవ్ కు అందజేశారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా ఉందా, లేదా అనేది తర్వాత తెలుస్తుందన్నారు.