Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మీ! | Manchu Lakshmi In Filmmaker Karan Johar New Reality Show | Sakshi
Sakshi News home page

ప్రాచీన కోటలో మర్డర్‌ రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మీ!

May 30 2025 4:16 PM | Updated on May 30 2025 4:53 PM

Manchu Lakshmi In Filmmaker Karan Johar New Reality Show

గతంలో కాఫీ విత్ కరణ్‌ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్‌ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వస్తోన్న రియాలిటీ గేమ్‌ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్‌ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు.  ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్‌గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి  భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.

అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ కానుంది. జూన్  12 నుంచి తొలి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది.  అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు రానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement