
పోకిరి మూవీతో తెలుగులో ఫేమస్ అయిన నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకు పాల్గొన్న ఆయన.. ప్రముఖ ఇన్‌ఫ్లూయన్సర్ అపూర్వ ముఖిజా తనను అగౌరవపరిచేలా మాట్లాడారన్న కామెంట్స్పై స్పందించారు. ఆమెతో తన సంభాషణ చాలా ఉత్తేజకరంగా సాగిందని అభివర్ణించాడు. అయితే ఈ షో ముగిశాక తనకు ఆమె క్షమాపణలు చెప్పిందని ఆశిష్ విద్యార్థి తెలిపారు.
ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.."ఆ షో ముగిసిన మరుసటి రోజే తను నాకు వాట్సాప్ సందేశం పంపింది. సర్, నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మేసేజ్ చేసింది. నేను వెంటనే ఆమెకు ఫోన్ చేసి అపూర్వ, నేను అక్కడ కూడా మీతో మాట్లాడాను. మీరు చాలా అద్భుతమైన మనిషి. అంతా బాగానే ఉందని చెప్పా. ఆ చర్చ పట్ల నేను సంతోషంగా ఉన్నా. ఆమె ఒక రోజు నాతో భోజనం చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కుదిరితే భవిష్యత్తులో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తా. తనపట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదని" వెల్లడించారు.
కాగా.. ఆశిష్ విద్యార్థి ఇటీవల ‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్ కూడా నటించారు.