దేశద్రోహులకు మద్దతిస్తారా?: పొంగులేటి

CM KCR, AIMIM Chief trying to incite hatred among people on CAA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వారి కి, ఉగ్రవాదులతో సంబంధమున్న వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలా? దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతునిస్తాయా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని శరణార్థుల కోసం తీసుకొస్తే విపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయన్నారు. పార్టీ నేతలు పద్మ, సుధాకరశర్మలతో కలసి ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఎంఐఎం మోకాలికి, బోడి గుండుకు లంకె పెట్టేలా వ్యవహరిస్తున్నా యని ధ్వజమెత్తారు. దేశంపై తమ గుత్తాధిపత్యం కొనసాగాలనే అక్కసుతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో కాంగ్రెస్‌ పార్టీ కాస్తా కమర్షియల్‌ పార్టీగా మారిందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top