రాహుల్‌ గాంధీపై మండిపడిన ఉద్దవ్‌ ఠాక్రే

Uddhav Thackeray Said Will Not Let Rahul Gandhi Win By Supporting Traitors - Sakshi

పూణె : దేశ ద్రోహులకు మద్దతిస్తున్న రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానివ్వొద్దని శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే పిలుపునిచ్చారు. శివసేన అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ఉద్దవ్‌ ఠాక్రే. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన మేనిఫెస్టోలో రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా’ అని ప్రజలను ప్రశ్నించారు. రాజద్రోహానికి పాల్పడే వారిని ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక ‘దేశం మీద ప్రేమతో శివసేన, బీజేపీ, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి లక్ష్యం ఏంటి.. మేం దేశం కోసం కలలు కంటాం. మరి మీ కల ఏంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అధికారాన్ని దక్కించుకోవడమే మీ ధ్యేయం అంటూ విమర్శించారు. రేపు కూడా మా ప్రధాని నరేంద్ర మోదీనే.. మరి మీ ప్రధాని ఎవరో చెప్పగలరా అంటూ ఆయన ప్రతిపక్షాలను సవాల్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top