అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5
Book your tickets now!
🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026


