టాలీవుడ్‌లో ఇప్పుడంతా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.


