నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం తెరచాప. ఈ సినిమాకు జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అనన్య క్రియేషన్స్ బ్యానర్‌లో కైలాష్ దుర్గం నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు.


