వారణాసి గ్లోబల్ ఈవెంట్.. టైమింగ్స్ ఇవే..! | SS Rajamouli Varanaasi Movie event at Mexico Comicon Festival | Sakshi
Sakshi News home page

Varanasi Movie: వారణాసి పాన్ వరల్డ్ ఈవెంట్.. టైమింగ్ తెలుసా?

Apr 24 2026 7:58 PM | Updated on Apr 24 2026 8:09 PM

SS Rajamouli Varanaasi Movie event at Mexico Comicon Festival

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్‌ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. 

తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్‌లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్‌లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్‌ ఫ్యాన్స్‌కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్‌లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement