ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే? | Tollywood Hero Suhas Latest Movie Hey Balwanth Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Hey Balwanth In OTT: ఓటీటీలో హే బల్వంత్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Mar 31 2026 9:34 AM | Updated on Mar 31 2026 9:59 AM

Tollywood Hero Suhas Latest Movie Hey Balwanth Streaming On This OTT

సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడడం మిస్సయివారు ఎంచక్కా ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.

ఈ మూవీ కథేంటంటే...

తల్లిలేని కృష్ణ(సుహాస్‌)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్‌వంత్‌(నరేశ్‌) చేసే బిజినెస్‌ టేకోవర్‌ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్‌ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్‌ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్‌వంత్‌ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.

చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్‌వంత్‌ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్‌)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్‌ వల్ల ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న  పీవీబీ (హర్ష వర్ధన్‌)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో  బెజ్జం దుర్గారావు (అజయ్‌ ఘోష్‌), యువన్‌ (వెన్నెల కిశోర్‌) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement