మెగా హీరో కొత్త సినిమా.. సంబరాల ఆగిపోయినట్టేనా? | Mega Hero Sai Dharam Tej new movie announced goes viral | Sakshi
Sakshi News home page

SDT19: మెగా హీరో కొత్త సినిమా.. సంబరాల ఆగిపోయినట్టేనా?

Apr 3 2026 3:01 PM | Updated on Apr 3 2026 4:08 PM

Mega Hero Sai Dharam Tej new movie announced goes viral

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ‍అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలోనే మెగా హీరో మరో కొత్త సినిమా ప్రకటించారు. క మూవీ డైరెక్టర్‌ సుజిత్, సందీప్‌ల  దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో 19 మూవీగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఎస్‌డీటీ19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కంచునున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement