'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్ | Allu Arjun Tweet about His fans awareness programme about hpv vaccine | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్

Apr 10 2026 6:41 PM | Updated on Apr 10 2026 7:10 PM

Allu Arjun Tweet about His fans awareness programme about hpv vaccine

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్‌ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement