'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్‌పై తనయుడి ప్రశంసలు | Ram Charan Talks About His Father Megastar Chiranjeevi | Sakshi
Sakshi News home page

Ram Charan: ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా: రామ్ చరణ్

Apr 16 2026 9:45 PM | Updated on Apr 16 2026 10:14 PM

Ram Charan Talks About His Father Megastar Chiranjeevi

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ‍కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.

అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్‌ ఇండియా మ్యాగజైన్‌పై రామ్ చరణ్‌ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్‌లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్‌ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.

నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్‌గా ఉండేవారని.. అదే ఆయనతో  చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్‌ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement