మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్‌గా రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo
— Filmy Focus (@FilmyFocus) March 27, 2026


