ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. బన్నీ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, ఫోటోలు ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ గొంతు, హావభావాలను అనుమతి లేకుండా అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడటకూడదని నిషేధం విధించింది. ఎవరైనా సరే సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా.. గతంలో చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. తమ వ్యక్తగత హక్కులు కాపాడాలంటూ కోర్టుకు వెళ్లారు. తమ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు వాడుతున్నారని సినీతారలు పిటిషన్స్ దాఖలు చేశారు. వీరందరి హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్ట్ ఊరట కల్పించింది.
ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా రాకాలో కనిపించనున్నట్లు సమాచారం.


