రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్‌ | Vija Devarakonda Ranabali Movie Shoot Video Goes Viral | Sakshi
Sakshi News home page

Ranabali Movie: రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్‌

Apr 2 2026 7:10 PM | Updated on Apr 2 2026 7:47 PM

Vija Devarakonda Ranabali Movie Shoot Video Goes Viral

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్‌ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్‌ వింటే ఫుల్ మాస్‌ యాక్షన్‌ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement