శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్ | Allu Arjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO | Sakshi
Sakshi News home page

Allu Arjun: శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్

Mar 27 2026 7:14 PM | Updated on Mar 27 2026 7:17 PM

Allu Arjun  presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను జపాన్‌కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టోమట్సు కోసానోకు వివరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ వీడియోను అల్లు అర్జున్‌ టీమ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఐకాన్ స్టార్ బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరక్షన్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిపారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్   బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్‌ కానుందని టాక్ వినిపిస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement