విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. అఫీషియల్‌గా ప్రారంభం | vijay devarakonda next movie officially started with pooja ceremony | Sakshi
Sakshi News home page

vijay devarakonda: విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. క్లాప్ కొట్టినా నేచురల్ స్టార్

Apr 20 2026 9:31 PM | Updated on Apr 20 2026 9:31 PM

vijay devarakonda next movie officially started with pooja ceremony

రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్‌ శౌర్యువ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement