shouryuv
-
విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ కృతీసనన్ జంటగా నటించనున్నారా? అంటే... ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా రానుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపికపై కూడా దృష్టిపెట్టారు శౌర్యువ్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ నటి కృతీసనన్‌ను సంప్రదిస్తున్నారట. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్. మరి.. విజయ్–కృతి కాంబినేషన్ సెట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. కాగా మహేశ్‌బాబు ‘వన్ : నేనొక్కడినే’, ప్రభాస్ ‘ఆది పురుష్’, నాగచైతన్య ‘దోచెయ్’ చిత్రాల్లో కృతీసనన్ నటించిన విషయం తెలిసిందే. విజయ్. ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ ఆరంభిస్తారని ఊహించవచ్చు. -
విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. అఫీషియల్‌గా ప్రారంభం
రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు. Antha Easy ga Ela Pulloff chesthaav @TheDeverakonda AnnA outfits Anni 🥵❤️💥!...#VDShouryuvpic.twitter.com/rkzc9UR5Qz— Therajamohan (@therajamohan) April 20, 2026 -
హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజయ్ భారీ సినిమా
-
హిట్ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో సినిమాను తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన మరో సినిమా ప్రకటించి జోరు పెంచాడు. ‘హాయ్ నాన్న’ ఫేం శౌర్యువ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ తాజాగా ప్రకటిస్తూ తన టీమ్‌తో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ షూటింగ్లో విజయ్ దేవరకొండి బిజీ అయిపోయాడు. మరోవైపు రెండోది రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’ కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు శౌర్యువ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా హషీమ్ అబ్దుల్ వాహబ్ పనిచేయనున్నారు. ఆయన గతంలో ఖుషి, హాయ్ నాన్న, 8వసంతాలు, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలకు సంగీతం అందించిన విషయం తెలసిందే. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.నానితో ‘హాయ్ నాన్న’ వంటి లవ్‌స్టోరీతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు శౌర్యువ్- వైరా ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు విజయ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. ‘హాయ్ నాన్న’ తర్వాత ఎన్టీఆర్ కోసం శౌర్యవ్ ఒక కథ రాసుకున్నాడని ప్రచారం జరిగింది. హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట. కానీ, తారక్‌కు ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరకపోవడంతో అదే స్టోరీని విజయ్‌కి చెబితే నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రచారంలో ఉంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా.. హాయ్ నాన్న డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా హృతిక్ రోషన్ సినిమా వార్-2లోనూ యంగ్ టైగర్ కనిపించనున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. హాయ్ నాన్న డైరెక్టర్‌తో.. అయితే మరోవైపు హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ శౌర్యువ్‌తో ఎన్టీఆర్ జతకట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ కోసం మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు.. ఇదంతా తప్పుడు సమాచారం' అని శౌర్యువ్ స్పష్టం చేశారు. అయితే ఏదో ఒక రోజు ఇది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.కాగా.. దేవర మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు. మరోవైపు గతేడాది నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్నా సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. -
దర్శకుడిగా నా బలం అదే
‘‘ఓ దర్శకుడిగా యాక్షన్ చిత్రాల కథలు కూడా రాయగలను. కానీ ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలైతే కొత్త దర్శకులకు అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ‘హాయ్ నాన్న’ కథ రాశాను. నాకు నానీగారు చాన్స్ ఇచ్చారు. నాలానే మిగతా దర్శకులకూ ప్రేమకథలు, కుటుంబ కథలతోనే అవకాశాలు వస్తాయని చెప్పలేను. నా విషయంలో జరిగిందని చెబుతున్నాను. అయితే ఏ జానర్ ఫిల్మ్ అయినా ఆ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది అందులోని భావోద్వేగాలతోనే. భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడం నా బలం అని నా నమ్మకం’’ అన్నారు శౌర్యువ్. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా బాల నటి కియారా ఖన్నా, హీరోయిన్ శ్రుతీహాసన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో శౌర్యువ్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. మెడిసిన్ పూర్తి చేశాను. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. తండ్రీకూతురి అనుబంధం, వీరికి మృణాల్ పాత్రతో ఉన్న సంబంధం.. ఈ అంశాల తాలూకు ఎమోషన్స్‌తో ‘హాయ్ నాన్న’ కథనం ఉంటుంది. నానీగారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. కథ రీత్యా ఏడ్చినా అందంగా ఉండాలని మృణాల్‌ను తీసుకున్నాం. శ్రుతీహాసన్గారి పాత్ర బాగుంటుంది. బేబీ కియారాకి యాక్టింగ్ ప్రతిభ ఉంది. హేషమ్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం ఇంకా బాగుంటుంది. సాను మంచి విజువల్స్ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు. -
నా బలం ఎమోషన్.. ‘హాయ్ నాన్న’లో అదే చూస్తారు: డైరెక్టర్ శౌర్యువ్
ప్రస్తుతం వయోలెన్స్, గన్స్, యాక్షన్ ఇలాంటి నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. క్లీన్ ఎంటర్టైనర్ చిత్రాలు రావడం అరుదుగా మారింది. మనమంతా ఎమోషనల్‌గా మొద్దుబారిపోయాం. ఇలాంటి సమయంలో ‘హాయ్ నాన్న’ లాంటి సినిమా చాలా అవసరం. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, హింసలేదు. చాలా క్లీన్ ఎమోషన్ ఫ్యామిలీ చిత్రమిది’ అన్నారు దర్శకుడు శౌర్యువ్. ఆయన దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైర్టెర్ శౌర్యువ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది వైజాగ్.నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి రావడం జరిగింది. కన్నడ, తెలుగు సినిమా జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యవర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. ►నాలుగేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నాను. వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు వారికి నచ్చింది. నాని గారికి పరిచయం చేశారు. నాని గారికి చెప్పినపుడు ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పారు. ఆరునెలల పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగింది. తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం. ►నా ప్రధాన బలం ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం, అలానే మృణాల్ పాత్రలో వున్న బాండింగ్, అలాగే ఈ కథ అంతా దేనిపై ఆధారపడి వెళుతుందనేది కోర్ స్ట్రెంత్. ఆ ఎమోషన్ కారణంగా నాని గారు ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నాను. ►హీరో విక్రమ్ గారి అబ్బాయి ద్రువ్ నా ఫ్రెండ్. తన సంగీతం తెలుసు. పాటలు చక్కగా పాడుతాడు, మంచి గిటార్ ప్లేయర్. అందుకే ఓడియమ్మ పాటను ద్రువ్ తో పాడిస్తే బావుంటుందనిపించింది. ఈ ఆలోచన ద్రువ్ కి కూడా చాలా నచ్చి స్వయంగా పాడారు. ►ఈ కథ రాస్తున్నప్పుడే హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ని తీసుకోవాలనుకున్నాను. మృణాల్ నటించిన తుపాన్ సినిమా చూశాను. అందులో ఆమె నటన చాలా నచ్చింది. హాయ్ నాన్న లో హీరోయిన్ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. ఇందులో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని అలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్ ఠాకూర్ కనిపించింది. ►బేబీ కియారా సూపర్ ట్యాలెంటెడ్. చిన్నపిల్లలతో నటింపజేయడం కొంచెం కష్టమైనపనే. ఐతే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సీన్ గురించి చెప్పి డైలాగు పేపర్ ఇవ్వగానే ఎలాంటి తడబాటు లేకుండా ఎమోషన్ ని అర్ధం చేసుకొని నటించేది. ఇప్పటికీ నిద్రలో లేపి అడిగిన తన డైలాగులన్నీ అనర్గళంగా చెప్పేస్తుంది. తనతోయాక్ట్ చేయించడానికి నేను పెద్దగా కష్టపడలేదు. ►ఇందులో శ్రుతి హాసన్ గారికి పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత వుంది. ఇప్పటివరకైతే ఆ పాత్ర గురించి ఇంత మాత్రమే చెప్పాలి. ఒకటిరెండు సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయి. ►‘హాయ్ నాన్న’లాంటి కథ చేయడం ఒక సవాల్. చాలా సున్నితమైన కథ. దానిని మాటలతో, సన్నివేశాలతో ఎమోషన్స్ తో నిలబెట్టాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇలాంటి కథను రాయడం ఒక సవాల్ ► ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం తీసుకొని కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను. ఇప్పటికే కొన్ని కథలను రాసుకున్నా. నా బలం ఎమోషన్. కమర్షియల్ సినిమాల్లో కూడా ఎమోషనే కీలకం


