జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా.. హాయ్ నాన్న డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్! | Hai Nanna Director Shouryuv Works With Jr Ntr In Upcoming film | Sakshi
Sakshi News home page

Shouryuv: 'జూనియర్‌తో సినిమా.. ఎలా వచ్చాయో కూడా తెలియదు'

Jul 31 2024 5:14 PM | Updated on Jul 31 2024 5:39 PM

Hai Nanna Director Shouryuv Works With Jr Ntr In Upcoming film

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా హృతిక్ రోషన్‌ సినిమా వార్‌-2లోనూ యంగ్ టైగర్ కనిపించనున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. 

హాయ్ నాన్న డైరెక్టర్‌తో.. 

అయితే మరోవైపు హాయ్ నాన్న సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ శౌర్యువ్‌తో ఎన్టీఆర్ జతకట్టనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ కోసం మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు.. ఇదంతా తప్పుడు సమాచారం' అని శౌర్యువ్ స్పష్టం చేశారు. అయితే ఏదో ఒక రోజు ఇది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

కాగా.. దేవర మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  జూనియర్ ఎన్టీఆర్‌ నటించనున్నారు. మరోవైపు గతేడాది నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్నా సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement