హిట్‌ దర్శకుడితో విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన | Vijay Devarakonda and sourav new movie announced officially | Sakshi
Sakshi News home page

హిట్‌ దర్శకుడితో విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన

Apr 18 2026 11:37 AM | Updated on Apr 18 2026 11:55 AM

Vijay Devarakonda and sourav new movie announced officially

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ మరో సినిమాను తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన మరో సినిమా ప్రకటించి జోరు పెంచాడు. ‘హాయ్‌ నాన్న’ ఫేం శౌర్యువ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు విజయ్‌ దేవరకొండ  తాజాగా ప్రకటిస్తూ తన టీమ్‌తో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండి బిజీ అయిపోయాడు. మరోవైపు రెండోది రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’ కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు  శౌర్యువ్‌ దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.  ఈ మూవీకి సంగీత దర్శకుడిగా హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ పనిచేయనున్నారు. ఆయన గతంలో ఖుషి, హాయ్‌ నాన్న, 8వసంతాలు, ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలకు సంగీతం అందించిన విషయం తెలసిందే. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది.

నానితో ‘హాయ్‌ నాన్న’ వంటి లవ్‌స్టోరీతో భారీ హిట్‌ కొట్టిన దర్శకుడు శౌర్యువ్‌- వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ఇప్పుడు విజయ్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ చేయనున్నారు.  ‘హాయ్‌ నాన్న’ తర్వాత ఎన్టీఆర్‌ కోసం శౌర్యవ్‌ ఒక కథ రాసుకున్నాడని ప్రచారం జరిగింది. హీరోగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అనుకున్నారట. కానీ, తారక్‌కు  ఉన్న కమిట్‌మెంట్స్‌ వల్ల కుదరకపోవడంతో అదే స్టోరీని విజయ్‌కి చెబితే నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడని ప్రచారంలో ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement