breaking news
Hesham Abdul Wahab
-
ది గర్ల్‌ఫ్రెండ్ చూసి నా భార్య, నేను ఎమోషనలయ్యాం!
‘‘తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend Movie). కాకపోతే ‘ఖుషి’ తో నా ఎంట్రీ జరిగింది. ‘ఖుషి, హాయ్ నాన్న, మనమే, 8 వసంతాలు’... ఇలా నా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే... ఇది ఇంటెన్స్ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab). రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నా భార్యతో సినిమా చూశా..రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను కచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్ రవీంద్రన్. రష్మిక, దీక్షిత్ అద్భుతంగా నటించారు. సంగీతానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు. ఆ సినిమాకు ఏఐ వాడా..కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో కొంత ఏఐ వాడాం. ‘హాయ్ నాన్న’ సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేశ్‌గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది’’ అని చెప్పారు.చదవండి: సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో.. -
' ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు'.. ఆసక్తిగా 8 వసంతాలు ట్రైలర్
అనంతిక సానిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం '8 వసంతాలు'. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఒక అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్‌తోనే ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.Directed by #PhanindraNarsettiProduced by @MythriOfficialStarring… pic.twitter.com/8C5x3Noi8V— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025 -
మనీ కాదు...మానసిక తృప్తి ముఖ్యం: హేషమ్ అబ్దుల్ వహాబ్
‘ఖుషి, హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లోని బీట్స్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ని టచ్ చేశాయి. అందుకే జస్ట్ రెండు మూడు చిత్రాలతో సంగీతదర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు ‘మనమే’కి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హేషమ్. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మనమే’ గురించి, ఇతర విశేషాలను సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విధంగా పంచుకున్నారు. ⇒ సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం ఏ సంగీతదర్శకుడికైనా ఆనందంగా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి. నా గత చిత్రాలకన్నా ఈ చిత్రానికి ఎక్కువ హార్డ్‌వర్క్ చేశాను. ముందు 16 పాటలు ఉంటాయని ఊహించలేదు. కానీ శ్రీరామ్ ఆదిత్య కథని మలిచిన తీరు ఎక్కువ పాటలకు స్కోప్ ఇచ్చింది. ఫస్టాఫ్‌లో పది, సెకండాఫ్‌లో ఆరు పాటలు అవసరం అవుతాయని కంపోజ్ చేసేటప్పుడు అర్థం అయింది. పదకొండు ఫుల్ సాంగ్స్, మిగతావి బిట్ సాంగ్స్‌లా వస్తాయి ∙నా గత చిత్రం ‘హాయ్ నాన్న’లో తండ్రీ కూతురు ఎమోషన్ ఉంటుంది. ‘మనమే’లో కూడా పేరెంటింగ్ ప్రాధాన్యమైన అంశం. అయితే రెండు కథలు పూర్తిగా వేరు. ‘మనమే’లో పేరెంటింగ్ అనే ఎమోషన్‌తో పాటు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి ⇒ ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి కాబట్టి మిగతా సినిమాలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే... ఓ క్రియేటర్‌గా మనీ గురించి కాకుండా మానసిక తృప్తి ముఖ్యం అనుకుంటాను. ఆ విధంగా చూస్తే ‘మనమే’ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. సంగీతం పట్ల నాకు ఉన్న అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే నా పనికి తగ్గ పారితోషికం కూడా దక్కింది (నవ్వుతూ). నా గత చిత్రాలు, ఇప్పుడు ‘మనమే’ వంటి మంచి ప్రాజెక్ట్‌కి చాన్స్ దక్కడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను ⇒ ఫలానా సినిమాలో ఉన్న అలాంటి బీట్ ఇవ్వండి అంటూ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ అడగకపోవడం నా లక్. మంచి ట్యూన్‌ని ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు. కానీ నా వరకూ ఒరిజినల్ ట్యూన్ ఇవ్వాలనుకుంటాను. ఒకవేళ డైరెక్టర్ అడిగితే... ఆయన చెప్పిన ట్యూన్ కథలోని సందర్భానికి తగ్గట్టుగా ఉందనిపిస్తే అప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను ∙ప్రస్తుతం రష్మికా మందన్నా నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’కి వర్క్ చేస్తున్నాను. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో సాగే సినిమా చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. ఇదో కొత్త అనుభవం. ఇక తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఎంతమంది వచ్చినా ఇక్కడ అవకాశం ఉంటుంది... ్రపోత్సాహం ఉంటుంది. అందుకే కేరళ నా ఫస్ట్ హోమ్ అయితే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అంటాను.


