హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ కృతీసనన్ జంటగా నటించనున్నారా? అంటే... ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా రానుంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపికపై కూడా దృష్టిపెట్టారు శౌర్యువ్.
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ నటి కృతీసనన్‌ను సంప్రదిస్తున్నారట. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్. మరి.. విజయ్–కృతి కాంబినేషన్ సెట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. కాగా మహేశ్‌బాబు ‘వన్ : నేనొక్కడినే’, ప్రభాస్ ‘ఆది పురుష్’, నాగచైతన్య ‘దోచెయ్’ చిత్రాల్లో కృతీసనన్ నటించిన విషయం తెలిసిందే. విజయ్. ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ ఆరంభిస్తారని ఊహించవచ్చు.


