రామ్ చరణ్‌ పెద్ది రిలీజ్.. ఆ డేట్‌నే ఫిక్స్ చేశారా? | Ram Charan and Buchibabu Peddi Movie Release Date Out Now | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్‌ పెద్ది రిలీజ్.. ఆ డేట్‌నే ఫిక్స్ చేశారా?

Apr 24 2026 3:30 PM | Updated on Apr 24 2026 5:51 PM

Ram Charan and Buchibabu Peddi Movie Release Date Out Now

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్‌కు షిఫ్ట్ చేశారు.

అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ కూడా రానుందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.

కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement