శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్ | Raviteja Irumudi Team Sri ramanavami Special Poster | Sakshi
Sakshi News home page

Irumudi Movie: శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్

Mar 26 2026 5:47 PM | Updated on Mar 26 2026 5:57 PM

Raviteja Irumudi Team Sri ramanavami Special Poster

రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్‌ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. 

తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేసింది.  ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్‌ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌  నిర్మిస్తోంది.  జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement