'సెట్‌లో నేను ఏడ్చిన సందర్భం అదొక్కటే'.. హన్సిక కామెంట్స్ | Hansika Motwani Shares Her exeperience at Desamuduru Movie sets | Sakshi
Sakshi News home page

Hansika Motwani: 'అల్లు అర్జున్‌లో సహజ గుణం అదే'.. ఐకాన్‌ స్టార్‌పై ప్రశంసలు

Apr 17 2026 7:03 PM | Updated on Apr 17 2026 7:23 PM

Hansika Motwani Shares Her exeperience at Desamuduru Movie sets

టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‍తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ  చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ముఖ్యంగా ఐకాన్ స్టార్‌  అల్లు అర్జున్‌ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్‌లో ఏడ్చిన సందర్భం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్‌లో టీమ్‌తో సెండాఫ్‌ టైమ్‌లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్‌లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. 

కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో ‍అల్లు అర్జున్‌కు జంటగా హన్సిక హీరోయిన్‌గా నటించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement