అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా? | Tollywood Fans Searching For Raaka Meaning of allu arjun Movie Title | Sakshi
Sakshi News home page

Raaka Movie: అల్లు అర్జున్ రాకా.. ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?

Apr 8 2026 7:01 PM | Updated on Apr 8 2026 9:26 PM

Tollywood Fans Searching For Raaka Meaning of allu arjun Movie Title

టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్‌తో పాటు  రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ టైటిల్‌ గురించి టాలీవుడ్‌లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే ‍అర్థం వచ్చేలా టైటిల్‌ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్‌ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.

మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు.  పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్‌పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement