టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన ఈ మూవీసో మాస్ అండ్ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ కూడా సీక్వెల్‌పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్ అదుర్స్-2పై మాట్లాడారు.
ఈ విషయంలో దర్శకుడు వినాయక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు.


