breaking news
Adhurs2
-
అదుర్స్ సీక్వెల్.. వీవీ వినాయక్ ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన ఈ మూవీసో మాస్ అండ్ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ కూడా సీక్వెల్‌పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్ అదుర్స్-2పై మాట్లాడారు.ఈ విషయంలో దర్శకుడు వినాయక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు. -
అదుర్స్-2 కథ ఫైనల్ కాలేదు: వినాయక్
చెన్నై: అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. గతంలో జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లుడు శీను విజయంతో దర్శకుడు వీవీవినాయక్ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే.


