'ఇది కేవలం నిశ్చితార్థం కాదు'.. టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్ | Tollywood hero Bellamkonda Sai Sreenivas emotional post on engagement | Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: 'శాశ్వత బంధానికి ఆరంభం'.. హీరో ఎమోషనల్ పోస్ట్

Apr 7 2026 7:39 PM | Updated on Apr 7 2026 8:03 PM

Tollywood hero Bellamkonda Sai Sreenivas emotional post on engagement

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.

తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు.  ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్‌కు అభినందనలు చెబుతున్నారు.

కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్‌కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement