అట్లీ-అల్లు అర్జున్‌ మూవీ టైటిల్‌ ఇదేనా! | Crazy Rumour On Allu Arjun and Atlee Movie Title | Sakshi
Sakshi News home page

AA22xA6: అట్లీ-అల్లు అర్జున్‌ మూవీ టైటిల్‌ ఇదేనా!

Apr 7 2026 6:05 PM | Updated on Apr 7 2026 6:45 PM

Crazy Rumour On Allu Arjun and Atlee Movie Title

పుష్ప 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  #AA22XA6 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న   ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు టైటిల్‌ని కానీ, హీరో లుక్‌ కానీ రిలీజ్‌ చేయలేదు. బన్నీ బర్త్‌డే సందర్భంగా రేపు(ఏప్రిల్‌ 8) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్‌ సినిమాల టైటిల్స్‌ కానీ, లుక్‌ కానీ ముందుగానే లీకవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. 

ఇప్పటి వరకు షూటింగ్‌కు సంబంధించిన చిన్న ఫుటేజీ కూడా బయటకు రాకుండా  టీమ్‌ జాగ్రత్త పడింది. ఇక టైటిల్‌ గురించి సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి వైల్డ్‌ ఫైర్‌ అనే పేరు ఖారారు చేశారని ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు ‘లెగసీ’ అనే టైటిల్‌ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ‘అయాన్‌’, ‘స్పార్క్‌’ అనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ సినిమా టైటిల్‌ ఏంటి అనేది మాత్రం రేపే తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ గురించి అట్లీ, బన్నీకి తప్ప మిగతావారెవరికి సమాచారమే లేదట. అందరితో పాటు చిత్రబృందం కూడా రేపే టైటిల్‌ ఏంటనేది తెలుసుకోబోతుంది.

పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ఫిక్షన్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోన్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే దీపికా పదుకొణె పేరును అధికారికంగా ప్రకటించారు. జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement