' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్ | Ram Gopal Varma Satirical Tweet On Birthday Occassion Went Viral On Social Media, Tells Fans Dont Celebrate | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

Apr 7 2026 3:53 PM | Updated on Apr 7 2026 4:35 PM

Ram Gopal Varma tweet On birthday occassion Goes Viral

టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆ‍ర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్‌కు భిన్నంగా తన పంచ్‌లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్‌లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.

ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్‌ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్‌ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement