టాలీవుడ్ యంగ్ హీరో తీరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన తీరువీర్.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఆయన పాపం ప్రతాప్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే తిరువీర్ గతేడాది డిసెంబర్‌లో తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు కుమారుడు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేశారు. వీరిద్దరి రెండో పెళ్లి రోజు సందర్భంగా కొడుకు పేరు రివీల్ చేశారు. అథర్వ్ రెడ్డిగా తమ ముద్దుల కుమారుడికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. తిరువీర్ తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. 2016 నుంచి మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. తిరువీర్ 2024లో కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
Actor Thiruveer named their son - ATHARV REDDY on their second wedding anniversary. pic.twitter.com/73GFRItOPX
— CineAura (@CineAuraX) April 21, 2026


