పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సినీనటి, యాంకర్ అనసూయ సందడి చేసింది. (Anasuya Bharadwaj)
నరసాపురం స్టీమర్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జీ.వి మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అనసూయ హాజరైంది.
అనసూయను చూసేందుకు నరసాపురం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో స్టీమర్ రోడ్ ప్రాంతమంతా సందడిగా మారింది.
అభిమానులను తనదైన శైలిలో పలకరిస్తూ అనసూయ సందడి చేసింది.


